మెగాస్టార్ చిరంజీవి ‘దేవాంతకుడు’కి 35 ఏళ్ళు

Megastar Chiranjeevi Devanthakudu Completes 35 years,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,35 Years For Chiranjeevi Devanthakudu Movie,35 Years For Devanthakudu Movie,Mega Star Chiranjeevi Devanthakudu Movie Latest News,Chiranjeevi Devanthakudu Movie Turns 35 Years
Megastar Chiranjeevi Devanthakudu Completes 35 years

“జీవితంలో ఆటలు బాగుంటాయి గాని జీవితంతో ఆటలు చాలా ప్రమాదం” అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ‘దేవాంతకుడు’. మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూప‌ర్ స్టార్ విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎ.చంద్రశేఖర్ (కోలీవుడ్ స్టార్ విజ‌య్ తండ్రి) దర్శకత్వం వహించాడు. క‌న్న‌డంలో విజ‌యం సాధించిన‌ గెలువు న‌న్న‌దే(అక్క‌డ కూడా చంద్ర‌శేఖ‌రే ద‌ర్శ‌కుడు) కి రీమేక్ వెర్ష‌న్‌గా ఈ సినిమాని తీర్చిదిద్దాడు దర్శకుడు చంద్రశేఖర్. గుమ్మడి వెంకటేశ్వరరావు, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, వరలక్ష్మి, నారాయణరావు, రోహిణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక‌ జె.వి.రాఘవులు స్వరపరచిన పాటల్లో “చెల్లెమ్మకు పెళ్ళంటా… అన్నయ్యకు సంబరమంట” అనే పాట ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటుడు నారాయణరావు నిర్మాతగా మారి దమయంతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే సంఘ‌ర్ష‌ణ‌ త‌రువాత చిరంజీవి, విజ‌య‌శాంతి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రెండో చిత్ర‌మిది. అదేవిధంగా… ‘చట్టానికి కళ్ళులేవు’, పల్లెటూరి మొనగాడు’ తర్వాత చిరంజీవి, దర్శకుడు ఎస్.ఎ.చంద్రశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం ‘దేవాంతకుడు’. 1984 ఏప్రిల్ 12న‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవాంత‌కుడు… నేటితో 35 వసంతాలను పూర్తి చేసుకుంది.

[subscribe]


[youtube_video videoid=Y-MZgQHxwTA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.