రజినీ ‘దర్బార్’ షూటింగ్ ప్రారంభం

Rajinikanth Darbar Movie Shoot Commences,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rajinikanth Starts Darbar Movie Shoot,Rajinikanth Darbar Movie Shooting Location,Darbar Movie Shoot Begins,Rajinikanth Darbar Movie Latest Updates,Rajinikanth New Movie Darbar Shoot
Rajinikanth Darbar Movie Shoot Commences

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ హీరోలతో సమానంగా వరుస సినిమాలు చేస్తూ తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ దూసుకుపోతున్నారు. ‘కబాలి’, ‘కాలా’, ‘పేటా’ ఇలా వైవిద్యమైన కథలతో.. డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ తో తన అభిమానులను థ్రిల్ కు గురిచేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మురగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘దర్బార్’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసి రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఇదిలా ఉండగా.. ఈసినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. ముంబైలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈసినిమాలో రజనీకాంత్ రెండు షేడ్స్ లో కనిపించనున్నాడట. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా… ఇక మరో పాత్రలో ఆయన సామాజిక సేవకుడిగా కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈ సినిమాలో రజనీ సరసన హీరోయిన్ గా లేడి సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంతోష్ శివన్ ఛాయాగ్రహణ బాధ్యతలను, అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు. 2020 పొంగల్ కానుకగా ‘దర్బార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి అటు స్టార్ డైరెక్టర్.. ఇటు లెజెండరీ రజినీ.. దీంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోవడంతో పాటు అంచనాలు కూడా అదే రేంజ్ లో పెరిగిపోయాయి. మరి చూద్దాం.. ఈ సినిమా ఎలా ఉంటుందో?

[subscribe]


[youtube_video videoid=6ub9sHJALIk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =