
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 70


ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రల్లో బన్నీ

`ఐకాన్`లో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం?

కార్తికి అక్కగా నటించనున్న జ్యోతిక?

‘వెంకీ మామ’లో ఆ సీన్ హైలైట్ అవుతుందట

మల్టీ స్టారర్ మూవీ లో హీరోయిన్స్ ఫిక్స్

‘బంగార్రాజు’ అప్‌డేట్స్

పూజా కార్యక్రమాలలో అల్లు అర్జున్ మూవీ

మరోసారి ‘ఎవడు’ కాంబినేషన్?

‘మహర్షి’లో ‘అల్లరి’ నరేష్ పాత్ర వివరాలు

‘వ్యూహం’లో నాని పాత్ర వివరాలు!?

బిజీ బిజీగా హీరో నాని

జెర్సీ మూవీ ఒక ఎమోషనల్ రైడ్ -శ్రద్ధా శ్రీనాథ్

15 ఏళ్ళ తరువాత `మాస్` జోడీ?

హీరో కార్తికేయ అంతరంగం

నానితో ‘మలుపు’ డైరెక్టర్?

నాగ్ సీక్వెల్స్‌లో కుటుంబ సభ్యులు
సీనియర్ హీరో అక్కినేని నాగార్జున స్వల్ప విరామం తరువాత మళ్ళీ తెలుగు చిత్రాలపై దృష్టి పెట్టాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ప్రస్తుతం నాగ్ నటిస్తున్న రెండు తెలుగు చిత్రాలు కూడా తన బ్లాక్ బస్టర్ మూవీస్‌కి సీక్వెల్స్ కావడం విశేషం. ఆ సీక్వెల్సే… మన్మథుడు 2, బంగార్రాజు. అంతేకాదు… ఈ రెండు సినిమాలనూ తనే స్వయంగా నిర్మించడమే కాకుండా… ఈ చిత్రాల్లో కుటుంబ సభ్యులకు కూడా చోటిచ్చాడు నాగ్.

ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రల్లో బన్నీ
గత ఏడాది వేసవికి విడుదలైన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… వరుసగా మూడు ప్రాజెక్ట్‌లను అంగీకరించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్, సుకుమార్,ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో ఈ సినిమాలు చేస్తున్నాడు బన్నీ. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం విదితమే. తాజాగా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకున్న ఈ సినిమా… ఏప్రిల్ 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

`ఐకాన్`లో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘ఐకాన్’. కనబడుట లేదు అనేది ట్యాగ్‌లైన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఆర్య, పరుగు, ఎవడు, దువ్వాడ జగన్నాథమ్ తరువాత బన్నీ - రాజు కాంబినేషన్‌లో వస్తున్నచిత్రమిది. కాగా… బన్నీ బర్త్‌డే సందర్భంగా ఏప్రిల్ 8న విడుదల చేసిన ఐకాన్ ప్రీ లుక్ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

కార్తికి అక్కగా నటించనున్న జ్యోతిక?
వరుస సినిమాలతో బిజీగా ఉన్న యువ కథానాయకుడు కార్తి. ఒకవైపు తను నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’ విడుదలకు సిద్ధం కాగా… మరో వైపు ‘రెమో’ ఫేమ్ భాగ్యరాజా కన్నన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు కార్తి. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం… ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా… ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగనే… మరో ఆసక్తికరమైన చిత్రానికి కార్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ టాక్.

‘వెంకీ మామ’లో ఆ సీన్ హైలైట్ అవుతుందట
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్-2’తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం… ఈ సీనియర్ హీరో మరో మల్టీస్టారర్ మూవీలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఆ చిత్రమే వెంకీ మామ. ఈ సినిమా కోసం తన మేనల్లుడు నాగచైతన్యతో కలసి వినోదాలు పంచనున్నాడు వెంకీ.

మల్టీ స్టారర్ మూవీ లో హీరోయిన్స్ ఫిక్స్
సక్సెస్ ఫుల్ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని, సుథీర్ బాబు హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ వ్యూహం రూపొందనున్న విషయం తెలిసిందే. మోహన్ కృష్ణ ఇంద్రగంటి, నాని తో రూపొందించిన అష్టా చమ్మా, సుథీర్ బాబు తో రూపొందించిన సమ్మోహనం సినిమాలు ఘనవిజయం సాధించాయి. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న వ్యూహం మూవీ లో నాని ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నట్టు సమాచారం.

‘మహర్షి’లో ఎనిమిది పాటలు?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో `అల్లరి` నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మహేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా... ఈ సినిమాకి టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ “చోటీ చోటీ బాతే”... మహేష్ ఫ్యాన్స్‌తో పాటు శ్రోతలను కూడా విశేషంగా అలరిస్తోంది.

అద్భుత జానపద చిత్ర రాజం ‘భైరవద్వీపం’కు పాతికేళ్ళు
జానపదం, పౌరాణికం, చారిత్రకం, సాంఘికం... ఇలా జానర్ ఏదైనా తనదైన నటనాపాటవంతో ప్రేక్షకులను అలరించారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆయన నటవారసుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా నందమూరి బాలకృష్ణ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఆయా జానర్‌లలో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అటువంటి ఆసక్తితో... ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలో బాలకృష్ణ నటించిన చిత్రం ‘భైరవద్వీపం’. జానపద చిత్రాలు కనుమరుగైపోతున్న తరుణంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చక్కటి కథ, కథనాలతో ఆబాలగోపాలాన్ని అలరించేలా ఈ జానపద చిత్రాన్ని తెరకెక్కించారు. అలనాటి…

‘బంగార్రాజు’ అప్‌డేట్స్
ప్రస్తుతం ‘మన్మథుడు 2’ సినిమా చిత్రీకరణలో ఫుల్ బిజీగా ఉన్నాడు కింగ్ నాగార్జున. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే... కళ్యాణ్ కృష్ణ కురసాల దర్వకత్వంలో ‘బంగార్రాజు’ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు నాగ్. గతంలో వీరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్‌గా ఈ ‘బంగార్రాజు’ తెరకెక్కబోతోంది. కాగా... ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

పూజా కార్యక్రమాలలో అల్లు అర్జున్ మూవీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. ఈరోజు అల్లు అర్జున్ 19వ మూవీ పూజా కార్యక్రమాలలో ప్రారంభమయింది. హారిక &హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరోగా రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 24 వ తేదీ నుండి జరుపుకోనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన జులాయి,S/O సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించాయి. వారిద్దరి కాంబినేషన్ లో ఈ మూవీ మూడవది.

రిలీజయిన ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీ సాంగ్
డాల్ఫిన్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నరేష్ కుమార్ HN దర్శకత్వంలో చేతన్ మద్దినేని, కషిష్ వొహ్రా జంటగా ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీ రూపొందింది. ప్రకాష్ రాజ్ , రావు రమేష్, నరేష్, కమెడియన్స్ బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రలలో నటించారు. ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీ లోని రాజు రాజు వీడియో సాంగ్ ను మ్యాంగో మ్యూజిక్ ఛానల్ రిలీజ్ చేసింది.

మరోసారి ‘ఎవడు’ కాంబినేషన్?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలసి మెగా బడ్జెట్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్… వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే… ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే చరణ్ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ టాక్.

‘మహర్షి’లో ‘అల్లరి’ నరేష్ పాత్ర వివరాలు
సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడు. సి.అశ్వనీదత్, దిల్ రాజు, ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో మహేష్ ప్రాణ స్నేహితుడిగా ‘అల్లరి’ నరేష్ కనిపించనున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సినిమాలో నరేష్ పాత్ర చనిపోతుందనీ… అతని ఆశయాన్ని నెరవేర్చడం కోసమే యు.ఎస్.లో ఉన్న మహేష్ ఇండియాకు వస్తాడని ఆ మధ్య కొన్ని కథనాలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదట.

‘వ్యూహం’లో నాని పాత్ర వివరాలు!?
వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న యువ కథానాయకుడు నాని. ఒకవైపు తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘జెర్సీ’ ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతుండగా… మరోవైపు దర్శకుడు విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘గ్యాంగ్‌లీడర్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడీ నేచురల్ స్టార్. అంతేకాదు… ఈ సినిమా సెట్స్ పై ఉండగానే… తన తొలి దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు నాని.

బిజీ బిజీగా హీరో నాని
మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్న నాని ఈ సంవత్సరం మూడు సినిమాల రిలీజ్ కు ప్లాన్ చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో నాని హీరో గా క్రికెట్ నేపథ్యం లో రూపొందిన జెర్సీ మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం లో నాని హీరోగా గ్యాంగ్ లీడర్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. గ్యాంగ్ లీడర్ మూవీ లోని కొన్ని ముఖ్య సన్నివేశాల షూటింగ్ ను నాని కంప్లీట్ చేశారు. జూలై నెలకు మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆగష్ట్ నెలలో రిలీజ్ కు రెడీ అవుతుంది.

పాత్ బ్రేకింగ్ అండ్ పాత్ షోయింగ్ డీసెంట్ ఎటెంప్ట్ "చిత్రలహరి"
ఇక టెక్నికల్ అంశాలకు వస్తే- దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రెండు పాటలు, ఆర్ఆర్ బాగున్నాయి. నిర్మాతల మేకింగ్ standards బాగున్నాయి. మొత్తానికి అక్కడక్కడ కొంచెం డ్రాపింగ్ ఉన్నట్టు అనిపించినప్పటికీ మొత్తం మీద "చిత్రలహరి" ని వర్త్ వాచింగ్ మూవీ గా అభినందించవచ్చు. రెగ్యులర్ మాస్ మసాలా ఫార్ములా సినిమాలకు భిన్నంగా ఒక దర్శకుడు ప్రయత్నించినప్పుడు దాన్ని గుర్తించి, అభినందించవలసిన అవసరం ఉంది. అలాంటి కంటెంట్ వెయిట్, హానెస్టీ ఉన్న సినిమాల విషయంలో కూడా "అలా ఉంటే బాగుండేది... ఇలా ఉంటే బాగుండేది".... అంటూ చిన్న చిన్న లోపాలను హైలెట్ చేయడం కంటే సినిమాలో ఉన్న మంచిని పదింతలుగా హైలెట్ చేస్తే యూత్ లో ఉండే ఆత్మవిశ్వాస ప్ర

జెర్సీ మూవీ ఒక ఎమోషనల్ రైడ్ -శ్రద్ధా శ్రీనాథ్
సక్సెస్ ఫుల్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో క్రికెట్ నేపథ్యం లో నాని హీరోగా రూపొందిన జెర్సీ మూవీ లో హీరోయిన్ గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఆ మూవీ గురించి తన స్పందన తెలిపారు. శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ .. జెర్సీ మూవీ లో వర్కింగ్ విమెన్ గా, నాని వైఫ్ గా నటించానని, జెర్సీ మూవీ లో తన క్యారెక్టర్ పై ఆసక్తి కలిగిందని, నాని, తన కెమిస్ట్రీ పండిందని, తాము నటించిన సన్నివేశాలను డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించారని, జెర్సీ మూవీ లో నటించడం ఎమోషనల్ జర్నీ అన్నారు.

15 ఏళ్ళ తరువాత `మాస్` జోడీ?
కింగ్ నాగార్జున, టాలెంటెడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల కాంబినేషన్‌లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (2016) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిన ఆ సినిమాలో బంగార్రాజుగా నాగార్జున చేసిన సందడి ఇంతా అంతా కాదు. ఇప్పుడు అదే పాత్ర పేరుతో ఆ సినిమా సీక్వెల్‌కి స్క్రిప్ట్ వర్క్ రెడీ చేస్తున్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. మరోవైపు ‘బంగార్రాజు’ సినిమా పూర్వనిర్మాణ పనుల్లో భాగంగా ఆర్టిస్టుల ఎంపికను కూడా ప్రారంభించాడు దర్శకుడు.

హీరో కార్తికేయ అంతరంగం
కార్తికేయ హీరోగా నటించిన RX 100 మూవీ 2018 జులై లో రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. RX 100 మూవీ కమర్షియల్ గా సూపర్ హిట్ అయి, హీరో కార్తికేయ కు యూత్ లో క్రేజ్ పెంచింది. కార్తికేయ ప్రస్తుతం 4మూవీస్ లో నటిస్తున్నారు. కార్తికేయ తన జీవిత విశేషాలు చెబుతూ .. హైదరాబాద్ లోని వనస్థలిపురం లో పెరిగానని, చిన్నతనం నుండీ తన అభిమాన నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సినిమాలు చూసేవాడినని, ఒక మూవీ చూ సేటపుడు హీరో పైనే తన దృష్టి ఉండేదని దర్శకత్వం, ఫొటోగ్రఫీ పై ఆసక్తి లేదని , హీరోగా మారడం తన కల అని తెలిపారు.

నానితో ‘మలుపు’ డైరెక్టర్?
ఆ మధ్య డబుల్ హ్యాట్రిక్ విజయాలతో అలరించిన నేచురల్ స్టార్ నాని… గత ఏడాది మాత్రం ఆశించిన విజయాలను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో… వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అంతేకాదు… తొమ్మిది నెలల గ్యాప్‌లో ముచ్చటగా మూడు చిత్రాలతో సందడి చేయనున్నాడు నాని.