
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 69


‘మజిలీ’ రీమేక్‌లో ధనుష్?

తెలుగు యవనికపై చెరగని సౌందర్యం

కాంచన3 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఖరారు

విజయ్ సినిమాలో తమిళ టీవీ నటి

డీసెంట్ ఫాదర్ క్యారెక్టర్స్ లో పోసాని సక్సస్

మజిలీ 11 డేస్ కలెక్షన్స్

పేరు మార్చుకోవడం కలిసొచ్చిందా?

20 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రలహరి..!

సెన్సార్ పూర్తి చేసుకున్న జెర్సీ

`హ్యాపీడేస్` స్టార్స్ మధ్య క్లాష్

సూర్యతో పోటీపడుతున్న విక్రమ్?

‘దర్బార్’ మూవీలో రజినీ డ్యూయెల్ రోల్?

పార్క్ హయత్ లో మజిలీ మూవీ థ్యాంక్స్ మీట్

విడుదలయిన ABCD మూవీ ట్రైలర్

50 కోట్ల క్లబ్ లో మజిలీ మూవీ

నాగచైతన్యతో `ఆర్ ఎక్స్ 100` డైరెక్టర్?
ఆర్ ఎక్స్ 100తో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు అజయ్ భూపతి. పరిమిత బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమాని… యువతరానికి నచ్చేలా రూపొందించి సంచలన విజయం సాధించిన వైనం అప్పట్లో పరిశ్రమలో చర్చనీయాంశంగా నిలచింది. ఈ నేపథ్యంలో… అజయ్ తదుపరి చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ మధ్య పలువురు యువ కథానాయకుల కాంబినేషన్స్‌లో అజయ్ పేరు వినిపించినా… ఇప్పటివరకు తన రెండో చిత్రం పట్టాలెక్కలేదు.

‘మజిలీ’ రీమేక్‌లో ధనుష్?
“పెళ్లికి ముందు ఉండే ప్రేమ… పెళ్లి తర్వాత బాధ్యతగా మారుతుంది” అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు… నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందీ చిత్రం. తెలుగునాట ఘన విజయం సాధించిన ఈ సినిమాను… ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు మాలీవుడ్‌లో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

తెలుగు యవనికపై చెరగని సౌందర్యం
సౌందర్య… నిన్నటి తరం అందమైన సినీ జ్ఞాపకం. అందం, అభినయం మెండుగా ఉన్న అందాల తార ఆమె. ఏ పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసి… ఆ పాత్రకే వన్నె తెచ్చే నటన ఆమె సొంతం. ఇక భావోద్వేగ సన్నివేశాల్లో అయితే సౌందర్య నటన అపూర్వం, అద్వితీయం. అందుకే… తెలుగు సినీ ప్రేక్షకులు ఆమెను తమ గుండెల్లో పదిలంగా ఉంచుకున్నారు.

కాంచన3 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఖరారు
లారెన్స్ తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ముని సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆతరువాత ఆ సినిమా సీక్వెల్ లో కాంచన, గంగ సినిమాలు తెరకెక్కించగా.. అవి కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ఆ సీక్వెల్ లో భాగంగానే కాంచన 3 అనే సినిమాను తెరకెక్కించాడు లారెన్స్. ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్ర యూనిట్.

విజయ్ సినిమాలో తమిళ టీవీ నటి
ఒక పక్క సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కొత్తగా నిర్మాత అవతారం కూడా ఎత్తిన సంగతి తెలిసిందే. 'కింగ్ ఆఫ్ ది హిల్' అనే పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి.. తన ప్రొడక్షన్ హౌస్ లో మొదటగా.. పెళ్లి చూపులు సినిమాతో తనకు బ్రేక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ తో సినిమా చేస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అనసూయ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది.
పరుచూరి సతీమణి హత్యకు కుట్రపన్నిన పోసాని కృష్ణ మురళి
అర్థాలు అపార్థాలు అయితే అనర్థాలకు దారితీస్తాయి అనటానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది ఈ సంఘటన. క్షణికావేశంలో విచక్షణ కోల్పోతే జరిగే పరిణామాలు ఎవరి నియంత్రణలోనూ ఉండవు. నిజానికి ఆ రోజున అలా జరిగి ఉంటే ఈ రోజున సుప్రసిద్ధ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కుటుంబం తీవ్ర ఆవేదన లో ఉండి ఉండేది.... ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి జీవితం కటకటాల పాలై ఉండేది. ఇంతకీ ఎలా జరిగితే అనుకుంటున్నారు కదూ ... అది తెలుసుకోవాలంటే పోసాని కృష్ణ మురళి "తెలుగు ఫిలిం నగర్" యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ చూడాల్సిందే. ఇంతకూ పోసాని చెప్పిన ఆనాటి ఫ్లాష్ బ్యాక్ కు అక్షర రూపం ఏమిటంటే....

జెర్సీ`.. ఓ జెన్యూన్ సినిమా.. అవుట్ స్టాండింగ్ మూవీ - విక్టరీ వెంకటేష్
నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న చిత్రం జెర్సీ. ఏప్రిల్ 19న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాని క్రికెట్ ప్రాక్టీస్ చేసే వీడియో మోహన్ చెరుకూరి చేతుల మీదుగా విడుదలైంది. వెంకటేష్ తొలి టిక్కెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా…

డీసెంట్ ఫాదర్ క్యారెక్టర్స్ లో పోసాని సక్సస్
ఒక పర్టిక్యులర్ ఇమేజ్ కి బ్రాండ్ అయిన నటుడికి ఆ బ్రాండ్ కు భిన్నమైన క్యారెక్టర్స్ రావటం చాలా అరుదు. ఒకవేళ వచ్చినా సక్సెస్ అవడం ఇంకా అరుదు. కానీ కేవలం ఒక్క వారం గ్యాప్ లో రెండు సార్లు ఈ అరుదైన ఫీట్ సాధించి శభాష్ అనిపించుకున్నారు పోసాని కృష్ణ మురళి. ఒక రచయితగా తన కెరీర్ ప్రారంభించి అనుకోకుండా నటుడిగా మారి కమెడియన్ గా, విలన్ గా, కామెడీ విలన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా వైడ్ వెరైటీ అఫ్ క్యారెక్టర్స్ చేస్తున్న పోసాని కృష్ణ మురళికి ఈ మధ్యకాలంలో వరుసగా రెండు మంచి క్యారెక్టర్స్ చేసే అవకాశం లభించింది.

మజిలీ 11 డేస్ కలెక్షన్స్
మజిలీ కలెక్షన్స్ మామూలుగా లేవుగా. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం జోరుగా సాగుతున్నాయి. నాగ చైతన్య, సమంత రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌నే.. రీల్ లైఫ్‌లో పోషించిన మజిలీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా నాగచైతన్య, సమంతల నటనకు విమర్శకులతో పాటు, సినీ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు అందాయి. దీంతో గత వారం విడుదలైనా కూడా ఇప్పటికీ మంచి వసూళ్లతో రన్ అవుతోంది. అంతేకాదు.. చైతన్య కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా ఈ మూవీ రికార్డు సృష్టించింది. ఈ సినిమా 11 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం…

పేరు మార్చుకోవడం కలిసొచ్చిందా?
సినీ ఇండస్ట్రీలో సెంటి మెంట్లు ఉండటం కామన్ థింగే. ఈ విషయం అందరికీ తెలిసిందే. సినిమా ప్రారంభానికి ముహూర్తం.. సినిమా రిలీజ్ కు ముహూర్తం.. ఇలా సినిమా మొదలైన దగ్గర నుండి… సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ అన్నీ ముహూర్తాలే చూసుకొని మరీ రిలీజ్ చేస్తుంటారు. ఇక డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు ఇలా ప్రతి ఒక్కరికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఇక ఈ సెంటిమెంట్ల నేపథ్యంలోనే కొంత మంది పేర్లు కూడా మార్చుకుంటారు. చిరంజీవి దగ్గర నుండి పలువురు టాప్ హీరోలు.. టాప్ హీరోయిన్లే తమ పేర్లు మార్చుకొని సినీ ఇండస్ట్రీని ఏలిన వారు ఉన్నారు. అలా ఈమధ్య కాలంలో పేరు మార్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో.. మెగా సుప్రీమ్ హీరో.. మెగా…

20 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రలహరి..!
మొత్తానికి మెగా మేనల్లుడు సాయి తేజుకు చిత్రలహరి సినిమాతో కాస్త రిలీఫ్ దొరికింది. తిక్క నుండి తేజ్ ఐలవ్యూ వరకు వరుసగా 6 ఫ్లాపులతో సరైన హిట్ లేక సతమతమవుతున్న సాయి తేజ్ కు చిత్రలహరి హిట్ తెచ్చిపెట్టింది. ఇక మంచి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతుంది. ఫస్ట్ వీకెండ్ లో కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లోదాదాపు 8 కోట్లుకు పైగా వసూళ్లు చేసింది. దీంతో వారంలోనే చిత్రలహరి బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చేపెట్టేలా కనిపిస్తోంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న జెర్సీ
మళ్లీరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్‌లో లవ్, ఎమోషన్ సీన్స్ చూపించి సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను ఆకాశానికెత్తేశారు. అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నాని ప్రాణం పెట్టి నటించాడన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ 'యూ' సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.

`హ్యాపీడేస్` స్టార్స్ మధ్య క్లాష్
‘హ్యపీడేస్’… కాలేజీ ఫ్రెండ్‌షిప్ గురించి కళ్ళకు కట్టినట్లు చూపించిన సినిమా. ఆ చిత్రంలో నటించిన నటీనటులలో చాలా మంది ఒకటి, రెండు సినిమాలకి మాత్రమే పరిమితమయ్యారు. కానీ, ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన తమన్నా మాత్రం తన గ్లామర్‌తోను, నటనతోను, డ్యాన్స్‌లతోను స్టార్ హీరోయిన్‌గా ఎదిగితే… ఆ మూవీలో ఒక హీరోగా నటించిన నిఖిల్ భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు సాగుతున్నాడు.

సూర్యతో పోటీపడుతున్న విక్రమ్?
‘శివపుత్రుడు’… 2004లో కాసుల వర్షం కురిపించిన తమిళ అనువాద చిత్రం. ఆ సినిమాతోనే… కోలీవుడ్ స్టార్స్ విక్రమ్, సూర్య తెలుగునాట మంచి మార్కెట్‌ని సంపాదించుకున్నారు. కట్ చేస్తే… ఆ సినిమాలో స్నేహితులుగా నటించిన ఈ ఇద్దరు టాలెంటెడ్ హీరోలు… ఇప్పుడు తమ అప్‌కమింగ్ మూవీస్‌తో పోటీ పడుతున్నారు.

బన్నీ, త్రివిక్రమ్ చిత్రానికి టైటిల్ మారుతోందా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పట్టాలెక్కిన ఈ చిత్రం తాలూకు రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానుంది. బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్ ఇతర ముఖ్య భూమికల్లో నటిస్తున్నారు. కాగా… ఈ సినిమాకి తొలుత నాన్న నేను అనే టైటిల్ వినిపించిన సంగతి తెలిసిందే.

`భీష్మ`తో రొమాన్స్ చేయనున్న కళ్యాణి ప్రియదర్శన్?
‘హలో’ చిత్రంతో టాలీవుడ్‌కు కథానాయికగా పరిచయమైంది కళ్యాణి ప్రియదర్శన్. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందివ్వకపోయినా… నటిగా మాత్రం మంచి మార్కులు తెచ్చుకుంది కళ్యాణి. ఇక రెండో ప్రయత్నంగా మెగా హీరో సాయి తేజ్ సరసన ‘చిత్ర లహరి’లో నటించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా హిట్ లిస్ట్‌లో చేరింది. ప్రస్తుతం శర్వానంద్, దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ హలో భామ. మే నెలలో ఈ సినిమా తెరపైకి రానుంది. ఈ లోపే మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ అమ్మడు.

‘దర్బార్’ మూవీలో రజినీ డ్యూయెల్ రోల్?
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం ‘దర్బార్’ ఇటీవలే పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ స్వరాలను సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది.

పార్క్ హయత్ లో మజిలీ మూవీ థ్యాంక్స్ మీట్
సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం లో రియల్ లైఫ్ జంట నాగ చైతన్య , సమంత రీల్ లైఫ్ జంటగా రూపొందిన మజిలీ మూవీ ఏప్రిల్ 5వ తేదీ రిలీజయి విజయఢంకా మ్రోగిస్తుంది. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న మజిలీ మూవీ 10 రోజులలో 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి, రికార్డ్ క్రియేట్ చేసి, నాగ చైతన్య సినీకెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

విడుదలయిన ABCD మూవీ ట్రైలర్
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పించు, మధుర ఎంటర్ టైన్ మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ లో అల్లు శిరీష్, రుక్సార్ జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ ABCD (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి) మూవీ మే నెలలో రిలీజ్ కానుంది. హీరో దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ ABCD కి తెలుగు రీమేక్ ఈ ABCD మూవీ.

50 కోట్ల క్లబ్ లో మజిలీ మూవీ
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వం లో నాగ చైతన్య, సమంత జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మజిలీ మూవీ ఏప్రిల్ 5వ తేదీ రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ లో విజయ వంతంగా ప్రదర్శించబడుతుంది. హీరో నాగ చైతన్య క్రికెటర్ గా ఫస్ట్ టైమ్ నటించిన మజిలీ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. రిలీజయిన రోజు నుండి హిట్ టాక్ తో దూసుకుపోతున్న మజిలీ మూవీ నాగ చైతన్య సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.