హీరో కార్తికేయ అంతరంగం

Karthikeya Talks About Hippi,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Karthikeya New Movie Updates,Hippi Telugu Movie Latest News,Hero Karthikeya Next Project Details,Hippi Movie Latest Update
Karthikeya Talks About Hippi

కార్తికేయ హీరోగా నటించిన RX 100 మూవీ 2018 జులై లో రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. RX 100 మూవీ కమర్షియల్ గా సూపర్ హిట్ అయి, హీరో కార్తికేయ కు యూత్ లో క్రేజ్ పెంచింది. కార్తికేయ ప్రస్తుతం 4మూవీస్ లో నటిస్తున్నారు. కార్తికేయ తన జీవిత విశేషాలు చెబుతూ .. హైదరాబాద్ లోని వనస్థలిపురం లో పెరిగానని, చిన్నతనం నుండీ తన అభిమాన నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సినిమాలు చూసేవాడినని, ఒక మూవీ చూ సేటపుడు హీరో పైనే తన దృష్టి ఉండేదని దర్శకత్వం, ఫొటోగ్రఫీ పై ఆసక్తి లేదని , హీరోగా మారడం తన కల అని తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాను హీరో గా నటించిన RX 100 మూవీ ఘనవిజయం సాధించినందుకు సంతోషంగా ఉందని , ఆ మూవీ హ్యాంగోవర్ నుండి తనను ప్రేక్షకులు బయటకు రానివ్వడం లేదని, తన రాబోయే సినిమాలు RX 100 మూవీని మించి ఘనవిజయం సాధిస్తాయని కార్తికేయ ఆశాభావం వ్యక్తం చేశారు.టాప్ హీరోస్ ప్రయత్నించని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ RX 100 మూవీ లో చేశానని, ఆ విధంగా ఆ మూవీ సక్సెసయిందని అన్నారు. తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న హిప్పీ మూవీ క్యారెక్టర్ తన నిజజీవితానికి దగ్గరగా ఉంటుందని, తాను ఎంపిక చేసుకున్న నాలుగు సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయని, తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ ను క్రియేట్ చేసుకుంటానని, RX 100 మూవీ క్యారెక్టర్ సిమిలారిటీస్ తనకు లేవని, ఏ అమ్మాయి తో డేటింగ్ చేసే టైమ్ లేదని, తాను నటించే నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నానని కార్తికేయ చెప్పారు.

[subscribe]


[youtube_video videoid=_f6-h2H7gRY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − four =