‘వ్యూహం’లో నాని పాత్ర వివ‌రాలు!?

Nani Role In Vyuham Revealed,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani Character in Vyuham Movie,Nani Next Film Vyuham Details Revealed,Nani Role in His Next Film,Natural star Nani New Movie News,Nani New Movie Titled as Vyuham,Nani Upcoming Film Title Vyuham
Nani Role in Vyuham Revealed

వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్న యువ క‌థానాయ‌కుడు నాని. ఒక‌వైపు త‌న అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్‌ ‘జెర్సీ’ ఈ నెల 19న విడుద‌లకు సిద్ధ‌మ‌వుతుండ‌గా… మ‌రోవైపు ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ ‘గ్యాంగ్‌లీడ‌ర్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడీ నేచుర‌ల్ స్టార్‌. అంతేకాదు… ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే… త‌న తొలి ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసాడు నాని.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాకి ‘వ్యూహం’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమాలో నానితో పాటు సుధీర్‌బాబు కూడా న‌టిస్తున్నాడు. దాంతో ఇదో మ‌ల్టీస్టారర్ మూవీ అని నాని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ సినిమాలో నాని పాత్ర గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

అదేమిటంటే… ఈ సినిమాలో హీరో సుధీర్‌బాబు అనీ… నాని కేవ‌లం 15 – 20 నిమిషాలు మాత్ర‌మే క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. అయితే హీరోగా మాత్రం కాద‌నీ… కానీ నాని పాత్రే సినిమాకి కీల‌క‌మ‌ని చెబుతున్నారు. అంతేకాదు… ఈ సినిమాకి ‘దిల్’ రాజుతో పాటు నాని కూడా నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్నాడ‌ని స‌మాచారం. మ‌రి… ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో తెలియాలంటే మ‌రి కొంత‌కాలం ఆగాల్సిందే.

[subscribe]


[youtube_video videoid=EOw-oU_HNVA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 7 =