స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పట్టాలెక్కిన ఈ చిత్రం తాలూకు రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానుంది. బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్ ఇతర ముఖ్య భూమికల్లో నటిస్తున్నారు. కాగా… ఈ సినిమాకి తొలుత నాన్న నేను
అనే టైటిల్ వినిపించిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే… తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అలకనంద
అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని టాక్. బన్నీకి అమ్మగా నటిస్తున్న టబు పాత్ర పేరు ఇదని… సినిమా మొత్తం ఈ పాత్ర చుట్టే తిరుగుతుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే… అలకనంద
ని ఫిక్స్ చేశాడట త్రివిక్రమ్. అంతేకాదు… త్రివిక్రమ్ చిత్రాల టైటిల్స్ అన్నీ కూడా స్టార్స్ ఇమేజ్‌ల మీద కాకుండా… కథకు తగ్గట్టుగా ఉంటాయి. అలా… అ
సెంటిమెంట్‌తోనే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి పలు చిత్రాలు వచ్చాయి. అతడు, అత్తారింటికి దారేది, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత
… ఇలా ఇప్పటికే ఐదు సార్లు అ
ప్రథమాక్షరంగా త్రివిక్రమ్ చిత్రాల పేర్లు వచ్చాయి. మరి… అలకనంద
టైటిల్‌లో ఎంత వాస్తవముందో త్వరలోనే క్లారిటీ వస్తుంది.
[subscribe]
[youtube_video videoid=Y_sUze-_TZI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: