పరుచూరి సతీమణి హత్యకు కుట్రపన్నిన పోసాని కృష్ణ మురళి

Posani Krishna Murali Reveals Shocking Facts,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Posani Krishna Murali Reveals Unknown Facts,Posani Krishna Murali Latest Interview With Telugu Filmnagar,Actor Posani Latest Updates,Interesting Facts About Posani
Posani Krishna Murali Reveals Shocking Facts

అర్థాలు అపార్థాలు అయితే అనర్థాలకు దారితీస్తాయి అనటానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది ఈ సంఘటన. క్షణికావేశంలో విచక్షణ కోల్పోతే జరిగే పరిణామాలు ఎవరి నియంత్రణలోనూ ఉండవు. నిజానికి ఆ రోజున అలా జరిగి ఉంటే ఈ రోజున సుప్రసిద్ధ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కుటుంబం తీవ్ర ఆవేదన లో ఉండి ఉండేది…. ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి జీవితం కటకటాల పాలై ఉండేది.  ఇంతకీ ఎలా జరిగితే అనుకుంటున్నారు కదూ … అది తెలుసుకోవాలంటే పోసాని కృష్ణ మురళి “తెలుగు ఫిలిం నగర్” యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ చూడాల్సిందే. ఇంతకూ  పోసాని చెప్పిన ఆనాటి ఫ్లాష్ బ్యాక్ కు అక్షర రూపం ఏమిటంటే…. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అవి పోసాని కృష్ణమురళి  పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న రోజులు. తన  ఊరు పేరు తెలియకపోయినా తమ దగ్గర అసిస్టెంట్ గా పెట్టుకొని ఆదరించారు పరుచూరి బ్రదర్స్. తమ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా చూస్తున్నారు. పోసాని కూడా వారిపట్ల అదే గౌరవ అభిమానాలతో పని చేసేవాడు. అయితే నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా వ్యవహరించే పోసాని వ్యవహార శైలి నచ్చని కొంతమంది అసిస్టెంట్స్ నిరంతరం అతనిమీద పరుచూరి బ్రదర్స్ కు చాడీలు చెప్పేవారట. అయితే పోసాని గురించి వాకబు చేసిన పరుచూరి సోదరులకు అతని గురించి చాలా మంచి రిపోర్ట్స్ అందాయి. చురుకుదనం, టాలెంట్ ఉన్న పోసానిని మరింత ఆదరంగా చూసుకున్నారు పరుచూరి సోదరులు. ఒక సందర్భంలో పోసాని మీద చాడీలు  చెప్పిన ఆ పదిమంది అసిస్టెంట్లను ఒకేసారి పనిలో నుండి తీసేశారు పరుచూరి సోదరులు.

అయితే ఆ చెప్పుడు మాటల ప్రభావం కొంతమేరకు పరుచూరి గోపాలకృష్ణ గారి సతీమణి విజయలక్ష్మి గారి మీద పని చేసిందట. దాంతో ఆవిడ రెండు మూడు సార్లు పోసానిని కోప్పడ్డారట. సహజంగానే ఆవేశపరుడైన పోసాని  “నేను ఏ తప్పు చేయకపోయినా పిన్ని గారు నన్ను ఎందుకు కోప్పడుతున్నారు? నేను ఎప్పుడూ మిస్ బిహేవ్ చేయలేదు. ఆ  ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నప్పటికీ ఏ రోజు తల ఎత్తి కూడా చూడలేదు. చెప్పిన పనులన్నీ చేస్తున్నాను. మరి ఎందుకు నన్ను అకారణంగా మాటలు అనాలి..?  అని తనలో తానే మదనపడుతూ ఆమె పట్ల విపరీతమైన విద్వేషాన్ని పెంచుకున్నారట పోసాని. అంతే ! ఆమెను చంపేయటం కోసం ఒక కత్తి కొనుక్కొచ్చి దాచుకున్నారట. సమయం దొరికినప్పుడు ఆమెను పొడిచెయ్యాలి అని పథకం వేసుకున్నాడు. కానీ ఆ పథకాన్ని అమలుచేయటానికి కంటే ముందే పోసాని లో పరివర్తన ప్రారంభమైంది.


“అమ్మ లాగా ఆదరిస్తుంది.. అన్నం పెడుతుంది… ఏదో కోపంలో ఒక చిన్నమాట అంటే దానికి ఇంత దుర్మార్గంగా ఆలోచించాలా ? అనే పరివర్తన వచ్చి అది పశ్చాత్తాపంగా మారింది. అంతే.. తన తప్పుడు ఆలోచన తనను దహించివేసింది. సిగ్గుతో కుమిలి పోయాడు. ఎంత తప్పుగా ఆలోచించాను…? ఎంత దుర్మార్గంగా ఆలోచించాను… అనుకుంటూ మనసులోనే ఆమెకు, పరుచూరి సోదరులకు శతకోటి క్షమాపణలు చెప్పుకున్నాడు పోసాని కృష్ణ మురళి. నిజంగా ఈ విషయాన్ని ”    తెలుగు ఫిలింనగర్ ఛానల్ కు చెప్తున్నప్పుడు పోసాని కళ్ళలో నిజమైన పశ్చాత్తాపం కనిపించింది.

నిజానికి అప్పటికీ ఇప్పటికీ పోసాని ఆవేశంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అయితే ఇప్పుడు ఆ ఆవేశానికి ఆలోచన , అనుభవం, విచక్షణ తోడవ్వటంతో పోసాని ” పెద్ద మనిషి” అయ్యాడు. సినీ రాజకీయ రంగాలలో సంచలన వ్యక్తి అయ్యాడు.ఆవేశం హద్దులు దాటినప్పుడు కొంచెం విచక్షణతో ఆలోచించడం ఎంత అవసరమో చెప్పటానికి ఈ సంఘటన ఉపకరిస్తుంది.

[subscribe]


[youtube_video videoid=vpXkK0pgm8o]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + nineteen =