
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 30

థ్యాంక్స్ జగపతిబాబుగారు అర్థం చేసుకున్నారు
మిస్టర్ కేకే లో హైలెట్ అదేనట..!
గుణ 369 ట్రైలర్ రిలీజ్

అన్న కథను తమ్ముడి కోసం
చైనాకు వెళుతున్న ఓ బేబి

గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ రిలీజ్

అఖిల్ 4 - ఫైనల్లీ ఆన్ సెట్స్

డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న అరుణ్ విజయ్

దిల్ రాజు చేతిలోకి ఆది-కీర్తి సురేష్ సినిమా

కబీర్ సింగ్ మూవీ పై విజయ్ దేవరకొండ స్పందన

సైరా .. నేపథ్య సంగీతం

ఒరిజినల్ బ్లాక్ బస్టర్

అమితాబ్ సినిమా రీమేక్‌లో హృతిక్?

‘శతమానం భవతి’ జోడీ... మరోసారి?

అజయ్ భూపతి, రవితేజ మూవీ అక్టోబర్ లో ప్రారంభం
RX 100 వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైన అజయ్ భూపతి తన రెండవ చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మాస్ మహారాజ హీరో గా ఎంపికయ్యారు. హై ఎమోషనల్, స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో పరిణతి చెందిన ప్రేమకథ గా రూపొందనున్న ఈ మూవీ లో మరో మేల్ లీడ్ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కు హీరో సిద్ధార్ధ్ ను ఎంపిక చేసారని ఎంపిక చేసారని టాక్స్ వినిపిస్తున్నాయి. మరి ఇదే నిజమయితే హీరో సిద్ధార్ధ్ కు 6సంవత్సరాల తరువాత టాలీవుడ్ లో కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. హీరో రవితేజ కు జోడీ గా అదితి రావు హైదరీ సెలెక్ట్ అయ్యారు. మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది.
థ్యాంక్స్ జగపతిబాబుగారు అర్థం చేసుకున్నారు
సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం కశ్మీర్ లో ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటించనున్న జగపతిబాబు సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. అయితే ప్రకాష్ రాజ్ కోసం మహేష్ బాబు, అనిల్ రావిపూడి రిక్వెస్ట్ తోనే జగ్గూభాయ్ తప్పుకున్నట్టు కూడా కథనాలు వచ్చాయి. ఇక తాాజాగా ఈ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్పందించి తన ట్విట్టర్ ద్వారా జగపతిబాబుకు థ్యాంక్స్ చెబుతూ ఓ ట్వీట్ చేశాడు.
ఇస్మార్ట్ శంకర్ట్ ఫస్ట్ డే దిమ్మ తిరిగే కలెక్షన్స్
ఇస్మార్ట్ శంకర్.. డబల్ దిమాక్.. ఈ సినిమా ఒక్కసారిగా అటు పూరీని, రామ్ ని, నిధి అగర్వాల్ ని, నభా నటేష్ ని ఫామ్ లో తెచ్చేసింది. అంతేకాకుండా.. ఇన్ని రోజులు రాని అవకాశం..ఒక్కసారి వస్తే ఎలా ఉంటుందో.. మణిశర్మ తన మ్యూజిక్ తో చూపించాడు. అదిరిపోయే సంగీతాన్ని అందించి.. సినిమాకే హైలెట్ అయ్యాడు. నిన్న విడుదలైన ఈ సినిమాను చూసిన వారందరూ.. పూరీ ఈజ్ బ్యాక్ అంటున్నారు. ఫస్ట్ షో నుండే మంచి టాక్ సొంతం చేసుకునన ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు సైతం దక్కని విధంగా ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టి అందరికీ షాకిస్తుంది. దీంతో పూరీ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. మొదటి రోజు…

'నిన్నే పెళ్లాడతా' అంటున్న రకుల్ బ్రదర్
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రకుల్ తన తమ్ముడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో పడింది. అమన్ సింగ్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ వైకుంఠ బోను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేశారు. కింగ్ నాగార్జున చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్రయూనిట్.
మిస్టర్ కేకే లో హైలెట్ అదేనట..!
రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కందరం కొండన్. తెలుగులో ‘మిస్టర్ kk’ అనే టైటిల్ తో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న విక్రమ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
గుణ 369 ట్రైలర్ రిలీజ్
ఇటీవలే హిప్పీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారం గా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'గుణ 369'. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

అన్న కథను తమ్ముడి కోసం
దొరసాని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేశాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా హీరో హీరోయిన్ల నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సినిమా రిలీజైందో లేదో అప్పుడే మరో సినిమాను ట్రాక్ లో పెట్టే పనిలో పడినట్టు తెలుస్తోంది. అయితే ఈ సారి మాత్రం అన్న విజయ్ దేవరకొండ..తమ్ముడి రెండో సినిమాను లైన్లో పెట్టనున్నట్టు తెలుస్తోంది.
చైనాకు వెళుతున్న ఓ బేబి
నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఓ బేబి. ఈ నెల 5వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రతి సినీ ప్రేక్షకుడికి నచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సమంత చేసిన నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు కామెడీ తో ఎమోషనల్ గా కూడా ఈసినిమా కదిలించడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. రెండో వారంలోనూ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం సమంత కెరీర్లో ‘ఓ బేబీ’ ఒక మైలురాయిలాగే నిలిచిపోయేలా ఉంది.

ప్రారంభానికి ముందే రచ్చ రంబోలా అవుతున్న బిగ్ బాస్ - 3
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ - 3 జులై 21 నుండి ప్రారంభం కానుంది. దాంతోపాటు హడావుడి, హంగామా, పబ్లిసిటీ,బజ్,క్రేజ్, క్యూరియాసిటీ, నెగిటివ్ టాక్, ట్రోలింగ్స్, తిట్లు, శాపనార్థాలు, టీవీ చర్చా కార్యక్రమాలు, వాటి కింద పచ్చి బూతుల కామెంట్లు- పోలీస్ కేసులు వంటి సకల దరిద్రాలు ప్రారంభమయ్యాయి.

గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ రిలీజ్
విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రిలీజ్ డేట్ కూడా ఎప్పుడో ఫిక్స్ చేసేశారు. ఆగష్ట్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అఖిల్ 4 - ఫైనల్లీ ఆన్ సెట్స్
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా ఈ సినిమాపై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకులతో పని చేయాలా..? లేక అనుభవం ఉన్న దర్శకులను ఎన్నుకోవాలా..? అనే విషయంలో చర్చలు జరిగిన అనంతరం ఫైనల్ గా బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకుంటుంది. మరో పది రోజుల వరకూ ఇక్కడే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాపై ప్రస్తుతం అఖిల్ ఉన్న సన్నివేశాలను…
సాహో సాంగ్ పై పాకిస్తానీ సింగర్ ట్వీట్ కు థండరింగ్ రెస్పాన్స్
"బాహుబలి" సిరీస్ తో ప్రపంచవ్యాప్తమైన క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ తదుపరి చిత్రం "సాహో " రిలీజ్ కోసం వరల్డ్ ఫిలిం ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తుందనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయానికి ప్రపంచ వ్యాప్త అభిమానులు నుండి విశేషమైన స్పందన లభించడం దీనికి వచ్చిన క్రేజ్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్న అరుణ్ విజయ్
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ కమ్ భారీ యాక్షన్ మూవీ సాహో. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేసింది. దీనిలో ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా.. ఇటీవలే ఈ సినిమా నుండి ఇటీవలే 'ద సైకో సయ్యాన్' అనే వీడియో పాటను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

దిల్ రాజు చేతిలోకి ఆది-కీర్తి సురేష్ సినిమా
కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నగేష్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయంకానున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు ఓ ఎగ్జైటింగ్ అప్ డేట్ ఇవ్వనున్నట్టు నాలుగు రోజుల క్రితం చిత్రయూనిట్ తెలిపిన సంగతి తెలిసిందే కదా. తాజాగా అదేంటో రివీల్ చేశారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు సమర్పిస్తున్నట్టు తెలిపారు. దానితో పాటు సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు.

కబీర్ సింగ్ మూవీ పై విజయ్ దేవరకొండ స్పందన
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ ఘనవిజయం సాధించి, బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, హీరో విజయ్ దేవరకొండ కు స్టార్ డమ్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి మూవీ ని షాహిద్ కపూర్ హీరో గా సందీప్ రెడ్డి వంగ హిందీ భాషలో కబీర్ సింగ్ పేరుతో రూపొందించగా కమర్షియల్ గా ఘనవిజయం సాధించింది. 250 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో షాహిద్ కపూర్ సినీకెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది.

సైరా .. నేపథ్య సంగీతం
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ మూవీ మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్, తారాగణం తో రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి అక్టోబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక. బాలీవుడ్ సంగీత దర్శకుడు స్వరాలు సమకూర్చారు. ప్రముఖ బాలీవుడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్ జూలియస్ పేకియమ్ సైరా నరసింహా రెడ్డి మూవీ కి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. కాబూల్ ఎక్స్ ప్రెస్ వంటి సూపర్ హిట్ మూవీ కి నేపథ్య సంగీతం అందించి బాలీవుడ్ కు పరిచయమైన జూలియస్ పేకియమ్ , బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ఏక్ థా…
గుణ 369 బుజ్జి బంగారం సెకండ్ లిరికల్ రిలీజ్
వరుస సినిమాలతో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. ఇటీవలే హిప్పీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారం గా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'గుణ 369'. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా " తొలి పరిచయమా ఇది .. తొలి పరవశమా ఇది .. అలుపెరగని ఆశతో మనసెందుకో నిను చేరమన్నది " అనే ఫస్ట్ లిరికల్ ను రిలీజ్ చేయగా.. శ్రోతలను…

ఒరిజినల్ బ్లాక్ బస్టర్
స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్వరూప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ జూన్ 21 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. చిన్న బడ్జెట్ తో, అంతా కొత్తవారితో రూపొందిన ASSA మూవీ కథా, కథనం తో ఆకట్టుకుని క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.

అమితాబ్ సినిమా రీమేక్‌లో హృతిక్?
‘క్రిష్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్. తాజాగా `సూపర్ 30`తో పలకరించిన ఈ టాలెంటెడ్ స్టార్... త్వరలో ఓ రీమేక్ మూవీ చేయబోతున్నాడని టాక్. ఆ వివరాల్లోకి వెళితే... అమితాబ్, హేమమాలిని జంటగా నటించిన ‘సత్తే పే సత్తా’ (1982) ని అదే పేరుతో పర్హా ఖాన్ రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నిర్మించనున్న ఈ చిత్రంలో బిగ్ బి పాత్రలో హృతిక్ నటించనుండగా... హేమమాలిని పాత్రలో దీపికా పదుకొణేని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ రీమేక్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి…

‘శతమానం భవతి’ జోడీ... మరోసారి?
యువ కథానాయకుడు శర్వానంద్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలచిన చిత్రం ‘శతమానం భవతి’. 2017 సంక్రాంతికి విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో శర్వాకి జోడీగా నటించి అలరించింది కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్. కట్ చేస్తే... మూడేళ్ళ తరువాత అదే సంక్రాంతికి మరో చిత్రంతో పలకరించనుందట ఈ అందాల జంట.