షాహిద్ కపూర్, కియారా అద్వాని జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘కబీర్ సింగ్’. తెలుగునాట సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్ వెర్షన్‌గా రూపొందిన ‘కబీర్ సింగ్’… బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా వసూళ్ళ కుంభవృష్టి కురిపించింది. అంతేకాదు… మొదటి ఆట నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్… 2019కి గానూ (తొలి 7 నెలల్లో) బాలీవుడ్ టాప్ 10 గ్రాసర్స్‌లో తొలి స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇక ‘కబీర్ సింగ్’ తరువాత స్థానాలలో ‘ఉరి’, ‘భారత్’, ‘కేసరి’, ‘టోటల్ ఢమాల్’, ‘సూపర్ 30’, ‘గల్లీబాయ్’, ‘దే దే ప్యార్ దే’, ‘మణికర్ణిక’, ‘లుకా చుప్పి’ నిలిచాయి. మొత్తానికి… `అర్జున్ రెడ్డి` కథాంశం తెలుగునాటే కాదు బాలీవుడ్‌లోనూ బ్లాక్‌బస్టర్‌గా నిలచిందన్నమాట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: