టీమ్ సాహూ రోజుకో సర్ప్రైజ్ ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పోస్టర్లు, పాటలు రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ సినిమాలో నటించిన విలన్ ఫస్ట్ లుక్స్ ను రోజుకొకటి రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నారు. మొన్న మెయిన్ విలన్ నీల్ నితిన్ ముఖేష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా నిన్న చుంకీ పాండే, అరుణ్ విజయ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ రోజు మరో విలన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మలయాళం సినిమాల్లో విలన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన లాల్ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. ఇబ్రహిం గా ఈ సినిమాలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో ఈ సినిమాను ఆగస్ట్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=8KwZW-wH0PI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: