క‌థానాయ‌కుడిగా 15 ఏళ్ళ కెరీర్‌ను పూర్తి చేసుకున్న మంచు మనోజ్

2019 Latest Telugu Film News, Manchu Manoj Finishes 15 Years in Tollywood as Hero, Manchu Manoj Completed 15 Years in Tollywood, Manchu Manoj Latest Movie News, 15 Years For Manchu Manoj TFC, Manchu Manoj Upcoming Movie updates, Manchu Manoj Successfully Completed 15 years in Tollywood as Hero, 15 Glorified years For Manchu Manoj in Tollywood, Telugu Filmnagar, Tollywood Cinema News
Manchu Manoj Finishes 15 Years in Tollywood as Hero

క‌లెక్ష‌న్ కింగ్‌ డా.ఎం.మోహన్‌బాబు నట వారసుడిగా తెలుగు తెరకు క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు మంచు మనోజ్ కుమార్. బాల‌న‌టుడిగా `మేజ‌ర్ చంద్ర‌కాంత్‌`, `అడ‌విలో అన్న‌` వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ త‌న‌యుడిగా గుర్తింపు తెచ్చుకున్న మనోజ్… అనంత‌రం క‌థానాయ‌కుడిగానూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్… ఇలా జానర్ ఏదైనా తనదైన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఈ మంచు వారబ్బాయి… ఇప్పటి వరకు 17 సినిమాల్లో హీరోగా న‌టించాడు. వీటిలో `నేను మీకు తెలుసా?`, `ప్ర‌యాణం`, `బిందాస్‌`, `వేదం`, `ఝుమ్మంది నాదం` వంటి చిత్రాలు మంచి గుర్తింపును తీసుకువ‌చ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… స‌రిగ్గా 15 ఏళ్ళ క్రితం ఇదే రోజున అంటే 2004 ఆగస్టు 6న `దొంగ దొంగది`తో క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేశాడు మనోజ్. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తిరుడా తిరుడి’(ధ‌నుష్ హీరో)కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో… యాక్టింగ్‌ స్కోప్ ఉన్న వాసు పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందాడు మనోజ్‌. మాతృకకు దర్శకత్వం వహించిన సుబ్రహ్మణ్యం శివ ఈ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించాడు. సదా కథానాయికగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో… సునీల్, రాజీవ్ కనకాల ముఖ్య భూమిక‌లు పోషించారు.

నేటితో 15 ఏళ్ళ సినీ ప్రయాణాన్ని పూర్తిచేసుకుంటున్న మంచు మనోజ్… భవిష్యత్తులో మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల్లో న‌టిస్తూ కెరీర్‌లో ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.

[subscribe]

[youtube_video videoid=DBbxU6R_XQQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 2 =