ఒక భాషలో విజయం సాధించిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం కొత్త వ్యవహారమేమీ కాదు. అయితే… ఒకే నెలలో వరుసగా నాలుగు వారాల పాటు వారానికో రీమేక్ చిత్రం విడుదల కావడం కచ్చితంగా వార్తల్లో నిలచే అంశమే. అలా… తెలుగునాట 2019 ఆగస్టు… రీమేక్ మూవీస్‌తో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఆగస్టు 2న విడుదలైన సైకలాజికల్ థ్రిల్లర్ ‘రాక్షసుడు’ తమిళంలో ఘన విజయం సాధించిన ‘రాట్చసన్’కి రీమేక్ కాగా… ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `మన్మథుడు 2` ఫ్రెంచ్ మూవీ ‘ఐ డూ’కి రీమేక్‌గా తెరకెక్కింది. ఇక ఆగస్టు మూడో వారంలో అంటే పంద్రాగస్టున విడుదలైన థ్రిల్లర్ మూవీ ‘ఎవరు’ స్పానిష్ ఫిలిమ్ ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ స్ఫూర్తితో తెరకెక్కగా… ఆగస్టు 23న విడుదల కానున్న స్పోర్ట్స్ డ్రామా ‘కౌసల్య కృష్ణమూర్తి` తమిళ చిత్రం ‘కనా’కి రీమేక్‌గా రూపొందింది.
ఇలా… ఈ ఏడాది ఆగస్టులో వారానికో రీమేక్ మూవీ థియేటర్లలో సందడి చేయడం విశేషమనే చెప్పాలి.
[subscribe]
[youtube_video videoid=TvTnPAtLAgM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: