తమ్ముడి సినిమాకు నిర్మాతగా అన్న..?

2019 Latest Telugu Film News, Vijay Deverakonda To Produce His Brother Movie, Vijay Deverakonda Became a Producer, Anand Deverakonda Next Movie To be Produced by Vijay Deverakonda, Anand Deverakonda Next Movie Project Details, Anand Deverakonda Latest movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే టాప్ హీరో రేంజ్ కి ఎదిగాడు విజయ్ దేవరకొండ. రౌడీ హీరో అని యూత్ ముద్దుగా పిలుచుకునే ఈ హీరో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రొడక్షన్ కూడా స్టార్ చేసాడు. ఇప్పటికే తనకు పెళ్లి చూపులు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. అదేంటంటే.. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో విజయ్ ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘దొరసాని’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు ఆనంద్. పీరియాడిక్ డ్రామా నేపథ్యం లో తెరకెక్కిన ఈ సినిమా నిరాశ పరిచినా..ఆనంద్ నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి. అయితే తన తమ్ముడి మొదటి సినిమాకు విజయ్ పెద్దగా సపోర్ట్ ఇవ్వలేదని తానే ఒప్పుకున్నాడు. కానీ ఈ సారి మాత్రం తన సపోర్ట్ తమ్ముడికి ఇవ్వాలని చూస్తున్నాడట విజయ్. దీనిలో భాగంగానే తానే ప్రొడ్యూసర్ గా ఆనంద్ తో ఓ సినిమాకు తీయనున్నాడట. ఓ కొత్త దర్శకుడితో ఈ సినిమాను రూపొందించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల కోసం చూస్తున్నారట. అంత సెట్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.

ఇక రీసెంట్ గా డియర్ కామ్రేడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ కు ఆ సినిమా అనుకున్నంత విజయం ఇవ్వలేకపోయింది. ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేస్తుండగా.. మొన్నీమద్యే పూరి తో మరో సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. మరి విజయ్ కు ఆల్రెడీ సక్సెస్ వచ్చింది తమ్ముడికి ఎంత వరకు సక్సెస్ తెచ్చిపెడతాడో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=cmMg1MoypTI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =