రజనీకాంత్ 44 ఇయర్స్ సినీ కెరీర్

2019 Latest Telugu Film News, 44 Years For Rajinikanth in Film Industry, 44 Glorified Years in Film Industry, Super star Rajinikanth Latest movie news, Rajinikanth completes 44 years in Indian cinema, Rajinikanth clocks 44 years in the industry, Rajinikanth Completes glorious 44 years in film industry, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

తమిళ సూపర్ స్టార్ నిన్నటితో 44 సంవత్సరాల సినీ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నారు. అపూర్వ రాగంగళ్ తమిళ మూవీ తో రజనీకాంత్ కోలీవుడ్ కు పరిచయమయ్యారు. ఆమూవీ 1975 సంవత్సరం ఆగస్ట్ 18 వ తేదీ రిలీజయి కమర్షియల్ గా విజయం సాధించింది. సూపర్ హిట్ మూవీ అంతులేని కథ(1976) తో టాలీవుడ్ కు ఎంటరయ్యారు. యాక్టింగ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఏర్పరుచుకున్న రజనీకాంత్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్నారు. అభిమానులచే తలైవా అని పిలిపించుకొనే రజనీకాంత్ తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల చిత్రాలలో నటించారు. ఇంగ్లీష్ భాషా చిత్రం బ్లడ్ స్టోన్ లో నటించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ నటుడు జాకీ చాన్ తరువాత ఆసియా లో హై యెస్ట్ పెయిడ్ యాక్టర్ రజనీకాంత్ ను పద్మ భూషణ్, పద్మ విభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు వరించాయి. 2014 సంవత్సరం లో జరిగిన 45వ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో సెంటినరీ అవార్డ్ ఫర్ ఫిల్మ్ పెర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకొన్నారు. K బాలచందర్, భారతీ రాజా, SP ముత్తురామన్, మణిరత్నం, KS రవి కుమార్, CV శ్రీధర్, సురేష్ కృష్ణ, Sశంకర్ ,R త్యాగరాజన్ , దాసరి నారాయణ రావు, K రాఘవేంద్ర రావు, KSR దాస్, IV శశి, పుట్టన్న కనగళ్ వంటి దర్శక దిగ్గజాలతో రజనీకాంత్ పనిచేశారు. బాషా, ముత్తు, పడయప్పా, చంద్రముఖి, శివాజీ, రోబో, 2.0, పెదరాయుడు, చాల్ బాజ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ రజనీకాంత్ పెర్ఫార్మెన్స్ కు గీటురాళ్ళు. రజనీకాంత్ ప్రస్తుతం AR మురుగ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న దర్బార్ మూవీ లో నటిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 6 =