ట్యాగ్ · 343 కథనాలు · పేజీ 5

ప్రేక్షకులకు హీరో మేఘాంశ్ లేఖ
మరోసారి ‘పైసా వసూల్’ కాంబినేషన్?
ఏడు డిఫరెంట్ గెటప్స్‌లో నాగశౌర్య?
క్రిస్మస్‌ని టార్గెట్ చేసిన చైతు, సాయిపల్లవి?

వెంకటేష్ ‘దృశ్యం’కు ఐదేళ్ళు

ఇద్దరిలో ఎవరు హిట్ కొడతారో..?
సంక్రాంతికి అల్లు అర్జున్ సినిమా కన్ఫామే
సహ నిర్మాత గా హీరో నాని
వరుసగా సీజన్‌లను టార్గెట్ చేసుకుంటున్న వెంకీ

ఒకే నెలలో హీరోగా, విలన్‌గా కార్తికేయ
అల్లు అర్జున్ 'ఐకాన్' లో లీడింగ్ యాక్ట్రెస్..!
డబ్బింగ్ షురూ చేసిన మన్మథుడు

ఆ సీన్స్ షూట్ లో టెన్షన్ పడ్డా

ఫిట్ నెస్ ట్రైనింగ్ లో ఎన్టీఆర్
`విరాట పర్వం` సెకండ్ షెడ్యూల్ అప్‌డేట్
రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. ‘నీది నాది ఒకే కథ’తో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల… ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో… రానా విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నాడని టాక్. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్‌కి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.

ప్రేక్షకులకు హీరో మేఘాంశ్ లేఖ
లెజండరీ యాక్టర్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా టాలీవుడ్ కు రాజ్ దూత్ మూవీ తో పరిచయమవుతున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అర్జున్ - కార్తీక్ దర్శకత్వంలో మేఘాంశ్, నక్షత్ర జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ రాజ్ దూత్ మూవీ ఈ రోజు రిలీజయింది. బైక్ నేపథ్యం లో రూపొందిన ఈ మూవీ కి వరుణ్ సునీల్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రాజ్ దూత్ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మరోసారి ‘పైసా వసూల్’ కాంబినేషన్?
నటసింహం నందమూరి బాలకృష్ణని కొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రం `పైసా వసూల్`. అంతేకాదు, ఈ సినిమాతో బాలయ్య గాయకుడిగానూ అవతారమెత్తి అభిమానులను అలరించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం... బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. అయినప్పటికీ... రెండేళ్ళ తరువాత బాలయ్య, పూరి మరోసారి జట్టుకట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏడు డిఫరెంట్ గెటప్స్‌లో నాగశౌర్య?
‘ఊహలు గుసగుసలాడే’, ‘జో అచ్యుతానంద’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత కథానాయకుడు నాగశౌర్య - దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సక్సెస్‌ఫుల్ మూవీ ‘కళ్యాణ వైభోగమే’ తరువాత నాగశౌర్యకి జోడీగా మాళవికా నాయర్ నటిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఓ డిఫరెంట్ లవ్ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగశౌర్య ఏడు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లో కనిపిస్తాడట. అంతేకాదు, ఈ ఏడు గెటప్స్ సినిమాకి ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.

మిక్కే జే మేయర్ కేరాఫ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్
‘పోతే పోనీ’ చిత్రంతో టాలీవుడ్‌కి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు మిక్కీ జే మేయర్. ఆపై `హ్యాపీడేస్`, `కొత్త బంగారు లోకం`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `అ ఆ`, `మహానటి` తదితర విజయవంతమైన సినిమాలతో స్వరకర్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మిక్కీ.
క్రిస్మస్‌ని టార్గెట్ చేసిన చైతు, సాయిపల్లవి?
యువసామ్రాట్ నాగచైతన్య, డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఓ సినిమాని రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం... ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. సెప్టెంబర్ రెండో వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని కేవలం రెండు లేదా మూడు నెలల్లోపే పూర్తి చేసి... క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

వెంకటేష్ ‘దృశ్యం’కు ఐదేళ్ళు
విక్టరీ వెంకటేష్, అందాల తార మీనా జంటగా పలు విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘దృశ్యం’ ఒకటి. మహిళా దర్శకురాలు శ్రీ ప్రియ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీలో నదియా, నరేష్ ముఖ్య భూమికలు పోషించగా... కృతిక జయకుమార్, బేబి ఎస్తేర్, పరుచూరి వెంకటేశ్వరరావు, బెనర్జీ, చలపతిరావు, అన్నపూర్ణ, ఉత్తేజ్, రవి కాలె, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

ఇద్దరిలో ఎవరు హిట్ కొడతారో..?
ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోలు, అప్ కమింగ్ హీరోల హవానే నడుస్తుందని చెప్పొచ్చు. మన స్టార్ హీరోలు భారీ బడ్జెట్ అంటూ ఒక సినిమా తీయడానికి నెలలు, సంవత్సరాలు టైమ్ తీసుకుంటూ చాలా తీరికగా బాక్సాఫీస్ వద్దకు వస్తుంటే.. యంగ్ హీరోలు మాత్రం చిన్న బడ్జెట్ తో సినిమాలు చేసుకుంటూ హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. ఇక ప్రతి శుక్రవారం ఎలాగైతే సినిమాల సందడి ఉంటుందో ఈ 12వ తేదీన కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా రెండు సినిమాలపై మాత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి. అవి 'రాజ్ దూత్', 'దొరసాని' సినిమాలు.
సంక్రాంతికి అల్లు అర్జున్ సినిమా కన్ఫామే
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.
సహ నిర్మాత గా హీరో నాని
జెర్సీ మూవీ విజయోత్సాహం తో ఉన్న హీరో నాని గ్యాంగ్ లీడర్, V మూవీస్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అ మూవీ ని నిర్మించిన నాని, ఒక సీక్వెల్ మూవీ కి సహ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. స్వరూప్ రాజ్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ జూన్ 21 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. రాహుల్ యాదవ్ నిర్మాత.
వరుసగా సీజన్‌లను టార్గెట్ చేసుకుంటున్న వెంకీ
`ఎఫ్ 2`తో భారీ విజయం అందుకున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్... ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలసి `వెంకీమామ`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా... విజయదశమి కానుకగా విడుదల కానుందని సమాచారం. కాగా, ఈ చిత్రం తరువాత వెంకీ... హిందీ బ్లాక్‌బస్టర్ `దే దే ప్యార్ దే` రీమేక్‌లో నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్... ఆగస్టు చివరలో లేదా సెప్టెంబర్ ప్రథమార్ధంలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు.

ఒకే నెలలో హీరోగా, విలన్‌గా కార్తికేయ
గత ఏడాది సంచలనం `ఆర్ ఎక్స్ 100`తో కథానాయకుడిగా తొలి విజయాన్ని అందుకున్నాడు కార్తికేయ. ఇటీవల `హిప్పీ`గా సందడి చేసిన ఈ టాలెంటెడ్ హీరో... ప్రస్తుతం `గుణ 369`, `గ్యాంగ్ లీడర్`, `90 ఎం.ఎల్` చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కాగా, వీటిలో రెండు చిత్రాలు ఒకే నెలలో విడుదలకు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలే... `గుణ 369`, `గ్యాంగ్ లీడర్`.

సురేష్ ప్రొడక్షన్స్‌కి కలిసొస్తున్న మహిళా దర్శకులు
విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలచిన నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. భారతీయ చిత్ర పరిశ్రమలోని పలు భాషల్లో సినిమాలను నిర్మించిన ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్... మహిళా దర్శకులతో సినిమాలు నిర్మించిన సందర్భాలు మాత్రం తక్కువనే చెప్పాలి. అయితే, ఈ సంస్థ మహిళా దర్శకులతో సినిమాలు రూపొందించిన రెండు సందర్భాల్లోనూ విజయాలు దక్కడం విశేషమనే చెప్పాలి.

రాశీ ఖన్నా ఖాతాలో మరో రెండు `మెగా` ప్రాజెక్ట్స్
`ఊహలు గుసగుసలాడే`(2014) చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఆపై పలు చిత్రాల్లో నటించినా... `సుప్రీమ్`, `తొలిప్రేమ`తోనే సాలిడ్ హిట్స్ దక్కాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే... ఈ రెండు సినిమాలు కూడా మెగా కాంపౌండ్ హీరోల చిత్రాలే కావడం విశేషం. `సుప్రీమ్`లో సాయితేజ్‌కి జోడీగా నటించిన రాశి... `తొలిప్రేమ`లో వరుణ్ తేజ్‌కి జంటగా నటించింది.
విజువల్ వండర్ ‘బాహుబలి - ది బిగినింగ్’కి నాలుగేళ్ళు
విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలచిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ... అనతికాలంలోనే అగ్రశ్రేణి దర్శకుడిగా ఎదిగాడు జక్కన్న. అలాంటి రాజమౌళి కెరీర్‌లో విజువల్ వండర్స్‌గా తెరకెక్కిన `బాహుబలి` సిరీస్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సిరీస్‌లో వచ్చిన తొలి చిత్రమే ‘బాహుబలి: ది బిగినింగ్’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ జానపద చిత్రంలో అనుష్క, తమన్నా, దగ్గుబాటి రానా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ముఖ్య భూమికలు పోషించారు.
అల్లు అర్జున్ 'ఐకాన్' లో లీడింగ్ యాక్ట్రెస్..!
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈసినిమా తరువాత మరో రెండు ప్రాజెక్టులు బన్నీ చేతులో ఉన్నాయి. వాటిలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కూడా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు 'ఐకాన్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ చివరి దశకు రాగానే ఈ సినిమాను ట్రాక్ లో పెట్టడానికి రెడీగా ఉన్నాడు వేణు శ్రీరామ్.
డబ్బింగ్ షురూ చేసిన మన్మథుడు
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జు ప్రధాన పాత్రలో మన్మథుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఆగష్ట్ లో సినిమాను రిలీజ్ కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ స్పెషల్ టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

ఆ సీన్స్ షూట్ లో టెన్షన్ పడ్డా
అమలాపాల్ ప్రధాన పాత్రలో రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆడై'. తెలుగులో 'ఆమె' టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్ ను చూసి ఈ సినిమాపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలా పాల్ ఈ సినిమాలో నగ్నంగా నటించే సీన్ల గురించి..తాను నటించేప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అన్న విషయాలు చెప్పుకొచ్చింది.

నాన్నగారు మాకు అదే చెప్పేవారు - మేఘాంష్
ప్రస్తుతం టాలీవుడ్ లో ఆనాటి స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి కొంత మంది ఈనాటి స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. ఇప్పుడు మరో హీరో కొడుకు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. తనెవరో కాదు విలక్షణ నటుడు, రియల్ హీరో శ్రీహరి తనయుడు మేఘాంష్. అర్జున్-కార్తీక్ దర్శకత్వంలో మేఘాంష్ హీరోగా తెరకెక్కిన సినిమా రాజ్ దూత్. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు గా లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్, చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచాయనే చెప్పాలి. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా…

ఫిట్ నెస్ ట్రైనింగ్ లో ఎన్టీఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీ RRR భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తెలంగాణ ట్రైబల్ హీరో కొమరం భీమ్ గా, రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఒక కథానాయిక. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. RRR మూవీ 2020 జులై 30 వ తేదీ రిలీజ్ కానుంది.