ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోలు, అప్ కమింగ్ హీరోల హవానే నడుస్తుందని చెప్పొచ్చు. మన స్టార్ హీరోలు భారీ బడ్జెట్ అంటూ ఒక సినిమా తీయడానికి నెలలు, సంవత్సరాలు టైమ్ తీసుకుంటూ చాలా తీరికగా బాక్సాఫీస్ వద్దకు వస్తుంటే.. యంగ్ హీరోలు మాత్రం చిన్న బడ్జెట్ తో సినిమాలు చేసుకుంటూ హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. ఇక ప్రతి శుక్రవారం ఎలాగైతే సినిమాల సందడి ఉంటుందో ఈ 12వ తేదీన కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా రెండు సినిమాలపై మాత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి. అవి ‘రాజ్ దూత్’, ‘దొరసాని’ సినిమాలు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రెండు సినిమాల్లో హీరోలకు ఇదే మొదటి సినిమా అందులోనూ ఒకరేమో రియల్ స్టార్ హీరో శ్రీహరి కొడుకైతే.. ఇంకొకరు.. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తమ్ముడు. వీరిద్దరి సినిమాలు జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కార్తీక్-అర్జున్ దర్శకత్వంలో మేఘాంష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘రాజ్ దూత్’. ఈసినిమా టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మేఘాంష్ కూడా అందరికీ బాగా నోటెడ్ అయ్యాడు. దీంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసింది ‘దొరసాని’. విజయ దేవరకొండ నటించిన ఈసినిమా టీజర్, ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మరి ఈనేపథ్యంలో వీరిద్దరి సినిమాలు ఒకేరోజు విడుదలవుతుండగా ఎవరు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధిస్తారో చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=bjbBVgc2Frs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: