ట్యాగ్ · 343 కథనాలు · పేజీ 6
‘ఆర్ ఆర్ ఆర్’... రామ్ చరణ్‌కి తండ్రిగా అజయ్?
యన్టీఆర్ ‘కదలడు వదలడు’కు 50 ఏళ్ళు
మరో డిఫరెంట్ రోల్‌లో విజయ్
జూలై 9... తాత మనవళ్ళ ఇండస్ట్రీ హిట్స్

తెలుగులోకి టెంపర్ రీమేక్ అయోగ్య అవసరమా..!

విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యంకు మాతృవియోగం
అన్నాదమ్ముళ్లు ఎనిమిదేళ్ల తరువాత
కన్నడ హీరోయిన్స్ ఆన్ హై డిమాండ్
ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో కళ్యాణ్ రామ్ మూవీ

యన్టీఆర్ ‘వేటగాడు’కు 40 ఏళ్ళు

సాహో మూవీ ఫస్ట్ సాంగ్ టీజర్ విడుదల
ఎంత మంచివాడవురా ! కళ్యాణ్ రామ్

కోలుకున్న నాగశౌర్య.. బ్యాక్ టు షూట్
కుటుంబకథా చిత్రం "జరిగిన కథ" కు 50 ఏళ్ళు
మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీలో సామ్?

సమంత పాలిటిక్స్ లో ?
భారీ బడ్జెట్ చిత్రాల టాలీవుడ్
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బాలీవుడ్, కోలీవుడ్ లలో భారీ బడ్జెట్ మూవీస్ రూపొందించడం జరిగేది. రాజ మౌళి దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి తరువాత టాలీవుడ్ లో భారీ బడ్జెట్ చి త్ర నిర్మాణం కొత్త పుంతలు తొక్కింది. బాహుబలి మూవీ తో తెలుగు సినిమాలు అంతర్జాతీయ మార్కెట్ ను సంపాదించుకున్నాయి. తెలుగు తో పాటు రెండు,మూడు ఇతర భాషలలో కూడా తెలుగు మూవీస్ రూపొందుతున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూ టాలీవుడ్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో రికార్డ్ క్రియేట్ చేస్తుంది.
మూడు వారాలు... మూడు వరుస విజయాలు...
గత కొద్ది వారాలుగా నిస్తేజంగా ఉన్న బాక్సాఫీస్‌ని ఉత్తేజపరుస్తూ... మూడు వరుస వారాల్లో ఆసక్తికరమైన చిత్రాలు విడుదలై విజయకేతనం ఎగరవేశాయి. ఆ సినిమాలే... జూన్ 21న విడుదలైన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, జూన్ 28న రిలీజైన ‘బ్రోచేవారెవరురా’, జూలై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓ బేబీ’. వేర్వేరు జానర్స్‌లో వచ్చిన ఈ మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కినవే కావడం విశేషం. అలాగే ఎమోషన్స్‌కు కూడా ఎలాంటి లోటు రాకుండా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడంలో విజయం సాధించాయి ఈ మూడు చిత్రాలు. అందుకే... ఈ చిత్ర త్రయాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి…
‘ఆర్ ఆర్ ఆర్’... రామ్ చరణ్‌కి తండ్రిగా అజయ్?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పేట్రియాటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కొమరం భీమ్‌గా తారక్... అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నారు. చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్న ఈ చిత్రంలో... బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, తమిళ దర్శకనటుడు సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో అజయ్ పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
యన్టీఆర్ ‘కదలడు వదలడు’కు 50 ఏళ్ళు
మహానటుడు యన్.టి.రామారావు, “జానపద బ్రహ్మ” బి.విఠలాచార్యది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరి కలయికలో దాదాపు 13 జానపద చిత్రాలు తెరకెక్కగా... వాటిలో సింహభాగం విజయం సాధించినవే కావడం విశేషం. అటువంటి విజయవంతమైన జోడీ నుంచి వచ్చిన జానపద చిత్రాలలో ‘కదలడు వదలడు’ ఒకటి. జయలలిత కథానాయికగా నటించిన ఈ సినిమాలో రామకృష్ణ, సత్యనారాయణ, మిక్కిలినేని, ధూళిపాల, ముక్కామల, హేమలత, ఛాయాదేవి, విజయలలిత తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. సి.నారాయణరెడ్డి, వేటూరి, దాశరధి, కొసరాజు గీత రచన చేయగా... యన్టీఆర్ ఆస్థాన సంగీత దర్శకుడు టి.వి.రాజు స్వరకల్పనలో రూపొందిన బాణీలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
మరో డిఫరెంట్ రోల్‌లో విజయ్
వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం... ఈ టాలెంటెడ్ హీరో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను చేస్తున్న సంగతి తెలిసిందే. రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ప్లే బాయ్‌గా కనిపించనున్నాడట మన రౌడీ హీరో. అయితే... ఇంతవరకు తెలుగుతెరపై వచ్చిన ప్లే బాయ్ రోల్స్ కు భిన్నంగా ఈ క్యారెక్టర్ ఎంతో మెచ్యూర్డ్‌గా ఉంటుందని సమాచారం.
జూలై 9... తాత మనవళ్ళ ఇండస్ట్రీ హిట్స్
జూలై 9... నందమూరి కుటుంబానికి కలిసొచ్చిన తేదీల్లో ఒకటి. ఎందుకంటే... ఇదే రోజున ఆ కుటుంబం నుంచి రెండు వేర్వేరు తరాల కథానాయకులు నటించిన శక్తిమంతమైన చిత్రాలు విడుదలై ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. ఆ ఇద్దరి హీరోల్లో ఒకరు మహానటుడు యన్.టి.రామారావు కాగా... మరొకరు ఆయన మనవడు యంగ్ టైగర్ యన్టీఆర్. ఆ చిత్రాలే `బొబ్బిలిపులి`, `సింహాద్రి`.

తెలుగులోకి టెంపర్ రీమేక్ అయోగ్య అవసరమా..!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పూరీ జగన్నాథ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ సినిమాను రీమేక్ చేసి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయోగ్య టైటిల్ తో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇక తెలుగులో ఈ సినిమా ఎంత హిట్టయిందో తమిళ్ రీమేక్ కూడా అదే రేంజ్ లో హిట్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక తమిళ్ తో పాటు తెలుగులో కూడా విశాల్ కు మంచి ఫాలోయింగే ఉంది. అందుకే తను తమిళ్ లో చేసిన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా తన సినిమాను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేయనున్నాడు.

విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యంకు మాతృవియోగం
యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, జాతర, చైతన్య రథం వంటి విప్లవ చిత్రాల ద్వారా ఒక తరం యువతను విపరీతంగా ప్రభావితం చేసిన విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యంకు ఈరోజు మాతృవియోగం సంప్రాప్తించింది.86 సంవత్సరాల ఆయన తల్లి గారు శ్రీమతి ధవళ సరస్వతి ఈరోజు ఉదయం నర్సాపూర్ లో కన్నుమూసారు. అద్భుత కళాకారుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్నో సన్మానాలు పొందిన ప్రముఖ శిల్పి ధవళ సూర్యారావు ఆమె భర్త.
అన్నాదమ్ముళ్లు ఎనిమిదేళ్ల తరువాత
తమిళ ఇండస్ట్రీలో ఒకరు నటుడిగా.. ఒకరు దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న బ్రదర్స్ ధనుష్, సెల్వ రాఘవన్ అని చెప్పొచ్చు. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్లో హిట్ మూవీస్ కూడా వచ్చాయి. కాదల్ కొండియన్ (తెలుగులో నేను అనే సినిమా చేశాడు అల్లరి నరేష్), పుదుపెట్టయ్, మయక్కమ్ ఎన్న అనే మూడు సూపర్ హిట్ ఫిలింస్ వచ్చాయి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషనల్ లో సినిమా రాబోతున్నట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
కన్నడ హీరోయిన్స్ ఆన్ హై డిమాండ్
తెలుగు సినీ పరిశ్రమ అనే కానీ.. ఇక్కడ హవా చాటుతున్నది మాత్రం వేరే రాష్ట్రాల హీరోయిన్స్ అని ఎలాంటి తడబాటు లేకుండా చెప్పొచ్చు. తమిళ్, మలయాళం, కన్నడ, బొంబాయి ఇలా పలు ప్రాంతాల నుండి హీరోయిన్స్ దిగుమతి అవుతుంటారు టాలీవుడ్ కి. ఇక్కడ లక్ కలిసొచ్చి ఒక్క సినిమా హిట్ అయిందా ఇక అంతే ఇక్కడ వరుసపెట్టి అవకాశాలు వచ్చేస్తాయి. అలా పక్క రాష్ట్రాల నుండి మన ఇండస్ట్రీ కి వచ్చి తిష్ట వేసిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఒకప్పుడు హీందీ వాళ్లు హవా చేస్తే... ఆ తరువాత మలయాళీ ముద్దు గుమ్మలు.. ఇప్పుడు కన్నడ భామలు తెలుగులో తమ హవా కొనసాగిస్తున్నారు.
ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో కళ్యాణ్ రామ్ మూవీ
ఇటీవల ‘118’తో మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్... ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కళ్యాణ్ సరసన పంజాబీ భామ మెహరీన్ కథానాయికగా నటిస్తుండగా... గోపిసుందర్ బాణీలు సమకూరుస్తున్నాడు.

యన్టీఆర్ ‘వేటగాడు’కు 40 ఏళ్ళు
మహానటుడు నందమూరి తారక రామారావుకి అచ్చొచ్చిన కథానాయికల్లో అతిలోక సుందరి శ్రీదేవి ఒకరు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం `వేటగాడు`. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాలో జగ్గయ్య, కాంతారావు, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, నగేష్, చలపతిరావు, పుష్పలత, పండరీబాయి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రోజా మూవీస్ పతాకంపై ఎం.అర్జున్‌రాజు, కె.శివరామరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి స్వరకర్త చక్రవర్తి అందించిన బాణీలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి.

సాహో మూవీ ఫస్ట్ సాంగ్ టీజర్ విడుదల
UV క్రియేషన్స్, T - సిరీస్ బ్యానర్స్ పై సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ తెలుగు,తమిళ, మలయాళ, హిందీ భాషలలో ఆగష్టు 15 వతేదీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇండియా తో పాటు విదేశాలలో రూపుదిద్దుకున్న సాహో మూవీ లో ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా యాక్షన్ సీన్స్ ను హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ కంపోజ్ చేశారు.
ఎంత మంచివాడవురా ! కళ్యాణ్ రామ్
ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉమేష్ గుప్తా నిర్మాణసారథ్యం లో, శివలెంక కృష్ణ సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కుటుంబ విలువల నేపథ్యం లో కళ్యాణ్ రామ్ 17 మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. అందాల తార మెహరీన్ కథానాయిక. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

కోలుకున్న నాగశౌర్య.. బ్యాక్ టు షూట్
రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా కొత్త సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ లో భాగంగా నాగశౌర్య గాయపడిన సంగతి కూడా విదితమే. స్టంట్ మాస్టర్ అంబరీవ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఎటువంటి ఆధారం లేకుండా, డూప్ సహాయం తీసుకోకుండా 15అడుగుల ఎతైన భవనం పై నుండి దూకడంతో ఆయన మోకాలికి బలమైన గాయమైంది. దీంతో వైద్యులు కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.
కుటుంబకథా చిత్రం "జరిగిన కథ" కు 50 ఏళ్ళు
“అనుమానం పెనుభూతం” అన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘జరిగిన కథ’. అన్నదమ్ముల ఆదర్శం, ఆలుమగల అనురాగం, తల్లీబిడ్డల మమకారం వంటి అంశాలతో ప్రేక్షకులను అలరించిన సినిమా. “కళావాచస్పతి” జగ్గయ్య, సూపర్ స్టార్ కృష్ణ, కాంచన ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నాగయ్య, రాజనాల, రాజబాబు, బాలకృష్ణ, అల్లురామలింగయ్య, ప్రభాకరరెడ్డి, సంధ్య, విజయలలిత, మంజుల, సబిత, బేబీ రోజారమణి తదితరులు ఇతర భూమికలను పోషించారు. కె.బాబూరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగావళీ (విజేతా) ఫిలిమ్స్ పతాకంపై కె.ఎ.ప్రభాకర్ నిర్మించారు.
మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీలో సామ్?
టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న సమంత... గత రెండేళ్లుగా నాయికా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడానికి ఆసక్తి కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో ఫీమేల్ సెంట్రిక్ మూవీస్‌గా విడుదలైన ‘యూటర్న్’, ‘రాజుగారి గది 2’ చిత్రాలలో నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... రేపు (జూలై 5న) విడుదల కానున్న ‘ఓ బేబీ’లో మరోసారి అటువంటి పాత్రలోనే దర్శనమివ్వనుంది. ఇదిలా ఉంటే... ఇప్పుడు తమిళంలో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ చేయబోతోందట సామ్.
ఆది-వేదిక కొత్త సినిమా ఫస్ట్ లుక్ అప్ డేట్
అడివి సాయికిరణ్ డైరెక్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’ అనే యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాతో పాటు కార్తీక్ విఘ్నేశ్ దర్శకత్వంలో ఆది హీరోగా మరో కొత్త సినిమా రూపొందుతున్న సంగతి విదితమే. తెలుగు, తమిళ బై లింగ్వుల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో వేదిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇది తెలుగులో వేదిక నటిస్తున్న నాలుగో సినిమా. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

సమంత పాలిటిక్స్ లో ?
టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల స్టార్ హీరోయిన్ సమంత రాజకీయాల్లోకి రానున్నారా ? అనే టాపిక్ తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. రియల్ పాలిటిక్స్ లోకి కాకుండా సమంత రీల్ పాలిటిక్స్ లోకి రానున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై సక్సెస్ ఫుల్ తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా ఒక మూవీ రూపొందనుంది.

వరలక్ష్మి శరత్ కుమార్ నాగకన్య ఫస్ట్ లుక్ రిలీజ్
వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో పాము నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో నీయా అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. తెలుగులో నాగకన్య అనే పేరుతో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నాగకన్యగా వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్టు పోస్టర్ ఆకట్టుకునేలా వుంది. ఆడియోను త్వరలో విడుదల చేయనున్నట్టు ఓ పోస్టర్ ద్వారా తెలిపారు.