నాన్నగారు మాకు అదే చెప్పేవారు – మేఘాంష్

Meghamsh Srihari Latest Interview About RajDooth Movie

ప్రస్తుతం టాలీవుడ్ లో ఆనాటి స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి కొంత మంది ఈనాటి స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. ఇప్పుడు మరో హీరో కొడుకు కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. తనెవరో కాదు విలక్షణ నటుడు, రియల్ హీరో శ్రీహరి తనయుడు మేఘాంష్. అర్జున్-కార్తీక్ దర్శకత్వంలో మేఘాంష్ హీరోగా తెరకెక్కిన సినిమా రాజ్ దూత్. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు గా ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్, చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచాయనే చెప్పాలి. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న మేఘాంష్ విలేకర్లతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆవేంటో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజ్ దూత్ నా మొదటి సినిమా.. మీరందరూ చాలా సపోర్ట్ చేశారు దానికి థ్యాంక్స్ .. ఎండల్లో ఈ సినిమా తీయడానికి చాలా కష్టపడ్డాము.. ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా చాలా కష్టపడ్డారు.

సినిమా చాలా సైలెంట్ గా ఫినిష్ చేశారు.. టీజర్ రిలీజ్ వరకూ ఎవరికీ తెలియలేదు.?
అది ప్రెజర్ ను అవైడ్ చేయడానికే చేశాను…ఎందుకంటే అమ్మ షూటింగ్ కు వచ్చినప్పుడే నేను ప్రెజర్ ఫీల్ అయిపోయా.. ఇంకా అందరికీ చెబితే నేను అసలు సరిగా చేసుండే వాడిని కాదేమో.. అందుకే ఆ టెన్షన్ ను అవైడ్ చేయడానికే చాలా సీక్రెట్ గా షూట్ చేశాం.

మీరు మొదటి నుండి కూడా ఇదే ప్యాషన్ తో ఉన్నారని మీ మథర్ కూడా చెప్పారు.. టెన్షన్ ఏమీ లేదా?
చిన్నప్పటి నుండీ ఒక ఇంట్రెస్ట్ ఉండేది సినిమాల్లోకే రావాలని.. నాన్న కూడా ఒకసారి అన్నారు చిన్నోడిని హీరో చేస్తా.. పెద్దోడిని డైరెక్టర్ చేస్తా అని.. సో ఆయన చెప్పింది కూడా ఫాలో అవుతున్నాం..

బైక్ టైటిల్స్ తో వస్తున్న సినిమాలు బాగా క్లిక్ అవుతున్నాయని ఆ టైటిల్ పెట్టారా..?
ఈ సినిమాకు రాజ్ దూత్ అనే టైటిల్ తప్పితే వేరే ఏ టైటిల్ పనికిరాదు. మొదటి నుండీ రాజ్ దూత్ అనే అనుకున్నాం…

రోడ్ జర్నీ సినిమానా..? థ్రిల్లర్ జోనరా..?
రోడ్ జర్నీ కూడా ఉంటుంది.. ఇది థ్రిల్లర్ సినిమా కాదు.. ఒక్క జోనర్ లో ఈ సినిమాను పెట్టలేం.. రెండు మూడు జోనర్లు కలిసుంటాయి.. ఇది డిఫరెంట్ కమర్షియల్ సినిమా

మీ ఫాదర్ మిమ్మల్ని హీరో చేద్దామనుకున్నారని చెప్పారు.. మధ్యలో ఎప్పుడైనా మైండ్ ఛేంజ్ అయిందా?
చదువుపరంగా అయితే నేను 70 పర్సెంట్ స్టూడెంట్ ని.. కానీ ఆ సైడ్ ఎప్పుడూ అనుకోలేదు.. చిన్నప్పటి నుండి నాకు తెలిసింది సినిమాలే.

ఈ సినిమానే కరెక్ట్ అని.. ఇదే కరెక్ట్ లాంచింగ్ టైమ్ అని మీకెందుకు అనిపించింది.?
నాఫేస్ కి నా ఏజ్ కి ఇది కరెక్ట్ అనిపించింది.. ఎక్కడా ఓవర్ ఉండదు.. ఎక్కడా తక్కువగా ఉండదు.. ఓ మీడియం రేంజ్ లో ఉంటుంది సినిమా..

మీరు హీరో అవుతున్నారంటే మీ అమ్మ గారు ఎలా స్పందించారు?
అమ్మ చాలా సంతోషించారు, అలాగే సినిమా ఎలా వస్తుందో అని కొంచెం కంగారుకూడా పడ్డారు. ఐతే నేను సినిమాను అమ్మకు చూపించాను,ఆమెకు చాలా బాగా నచ్చింది.

ఈ సినిమా ముందు ఎన్ని స్క్రిప్ట్స్ విన్నారు?
ఈ సినిమాకు ముందు రెండు స్క్రిప్ట్స్ విన్నాను.. ఈ స్క్రిప్ట్ కు కనెక్ట్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసా

మీ నాన్నగారు మీకు ఏం చెప్పేవారు..?
డాడీ ఉన్నప్పుడు.. అందరినీ మంచిగా ట్రీట్ చేయండి..అందరితో మంచిగా ఉండండి.. ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కవ కాదు.. అందరినీ సమానంగా చూడండి..అందరికీ హెల్ప్ చేయమని చెప్పేవారు.

మీ నాన్న గారి నటనలో మీకు ఏ యాస్పెక్ట్ నచ్చుతుంది?
ఆయన నటనలో ప్రతి కోణం నాకు నచ్చుతుంది, ఎమోషనల్ అయినా,యాంగ్రీ సన్నివేశాలలోనైనా ఆయన నటన చాలా బాగుంటుంది.

ఫిలిం ఇన్ స్టిట్యూట్ కి వెళ్లి ఎమైనా యూక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నారా..?
ఈ సినిమా స్టార్టింగ్ కు ఒక నెల ముందు బేసిక్ ట్రైనింగ్ తీసుకున్నా.. స్కూల్ నుండీ థియేటర్ డ్రామాస్ చేస్తున్నా.. టచ్ ఉంది కొంచెం..

రియల్ స్టార్ గా ఎవరిని చూడాలనుకున్నారు నాన్నగారు..?
పెద్దోడిని డైరెక్టర్ గా చూడాలనుకున్నారు..రియల్ స్టార్ గా అంటే అది ఇద్దరికీ వస్తుంది.. కానీ అన్నయ్యకే ఎక్కువ పోలీకలు ఉన్నాయి.. కానీ తను ఆఫ్ స్క్రీన్

మీ నాన్నగారు చనిపోయిన తరువాత నువ్వు కానీ.. మీ అన్నయ్య కానీ పబ్లిక్ కు దూరమయ్యారనే చెపొచ్చు.. ఆతరువాత సడెన్ గా మళ్లీ డైరెక్ట్ గా సినిమాలో హీరోగా కనిపించారు.. కావాలనే చేశారా..?
నిజానికి ఈ మూడేళ్లు మాలో మేమే స్ట్రగుల్ అయ్యాం.. అమ్మ మమ్మల్ని చూసుకుంటూ..మేము అమ్మను చూసుకుంటూ అలా అయిపోయింది. అనుకోకుండా అలా దూరమైపోయాం.. మళ్లీ ఇప్పుడు దగ్గరయ్యాం.

మీ నాన్నగారు ఉంటే ఇంకా బెటర్ గా లాంచ్ అయ్యేవారనుకుంటున్నారా..?
తప్పకుండా అండీ…డాడీ ఉండి ఉంటే నేను ఇంకా ఇంకా బెటర్ గా వచ్చేవాడిని.. ఆయనే అన్నీ చూసుకునేవారు.

నాన్నగారి సినిమాలలో మీకు నచ్చిన చిత్రం?
చాలా ఉన్నాయి. భద్రాచలం,ఢీ, నువ్వులేక నేను లేను సినిమాలంటే చాలా ఇష్టం.

ఈ మూవీ డైరెక్టర్స్ గురించి చెప్పండి?
అర్జున్,కార్తీక్ డైరెక్టర్ సుధీర్ వర్మ దగ్గర పనిచేశారు. వీళ్లద్దరి మధ్య వర్క్ కో ఆర్డినేషన్ బాగుంటుంది. వీళ్ళ మధ్య విబేధాలు వచ్చి సినిమా ఎక్కడ ఆగిపోతుందో అని భయం వేసింది. అలా ఏం కాకుండా ఇద్దరు చిత్రాన్ని పూర్తి చేశారు.

[subscribe]

[youtube_video videoid=9tbIDqVgw8w]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here