డబ్బింగ్ షురూ చేసిన మన్మథుడు

Akkineni Nagarjuna Starts Dubbing For Manmadhudu 2 Movie

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జు ప్రధాన పాత్రలో మన్మథుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఆగష్ట్ లో సినిమాను రిలీజ్ కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ స్పెషల్ టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

ఇదిలా ఉండగా ఒక పక్క ఈసినిమా షూటింగ్ లో పాల్గొంటూనే కింగ్ నాగార్జున డబ్బింగ్ కూడా షురూ చేసినట్టు తెలుస్తోంది. షూటింగ్ చివరి దశలో ఉండగా.. త్వరలోనే పూర్తిచేసి ఆగష్ట్ 9న సినిమాను రిలీజ్ చేయాలన్న యోచనలో ఉన్నారు.

కాగా ఈ సినిమాలో నాగార్జున సరసన కేవలం రకుల్ సింగ్ ప్రీత్ మాత్రమే కథానాయికగా నటిస్తుంది. సమంత, కన్నడ బ్యూటీ అక్షరా గౌడ, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. వెన్నెల కిషోర్, నాజర్, రావు రమేష్, లక్ష్మీ, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున‌, పి.కిర‌ణ్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=TLWmy4u_qYY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here