
ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 25


NC 24 షూటింగ్ స్టార్ట్

గద్దర్ అవార్డ్స్ జ్యూరీకి దిల్ రాజు కీలక సూచన

రెట్రో రన్ టైం ఎంతంటే

దుల్కర్ సల్మాన్ చేతికి హిట్ 3

రివ్యూ: ఓదెల 2

గ్రాండ్‌గా రీరిలీజ్ అవుతోన్న యమదొంగ

హిలేరియస్‌గా సారంగపాణి జాతకం ట్రైలర్

45 తెలుగు టీజర్ రిలీజ్

జాట్ 6 డేస్ కలెక్షన్స్

ఈవారం రెండు సినిమాలు రానున్నాయి

కిచ్చా సుదీప్ 'బిల్లా రంగా బాషా' షూటింగ్ ప్రారంభం

రీరిలీజ్‌కి సిద్ధమైన భరత్ అనే నేను

బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ఫిక్స్ ?

బ్లైండ్ స్పాట్ ట్రైలర్ అప్‌డేట్

రెట్రో రిలీజ్ డేట్ లో మార్పు లేదు

దిల్ రాజు బిగ్ అనౌన్స్‌మెంట్

కుబేర ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

ఎన్టీఆర్ నీల్ తరువాత దేవర 2నే

శ్రీ విష్ణు సింగిల్ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్
ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'సింగిల్'.షూటింగ్ పూర్తికావొచ్చింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్ కనిపించనున్నాడు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

NC 24 షూటింగ్ స్టార్ట్
తండేల్ తో 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ తో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు అక్కినేని హీరో నాగ చైతన్య. రెండు నెలల క్రితం విడుదలైన ఈసినిమా నాగ చైతన్య కు అవసరమైన విజయాన్ని అందించింది.ఈసినిమా రిజల్ట్ ను కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన చైతన్య ఇక తన నెక్స్ట్ మూవీ షూట్ లో జాయిన్ అయ్యాడు.

గద్దర్ అవార్డ్స్ జ్యూరీకి దిల్ రాజు కీలక సూచన
తెలంగాణ ఫిల్మ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ - TFDC) చైర్మన్ దిల్ రాజు 'గద్దర్ అవార్డ్స్' జ్యూరీకి కీలక సూచన చేశారు. బుధవారం సంస్థ సమావేశ మందిరంలో జ్యూరీ ఛైర్మన్, ప్రముఖ నటి జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న దిల్ రాజు, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కొరకు వచ్చిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులను కోరారు.

రెట్రో రన్ టైం ఎంతంటే
కంగువా తరువాత తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ రెట్రోతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.సూర్య ఈసినిమాను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశాడు. ఇందులో తను గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.రేపు ఈసినిమా ఆడియో తోపాటు ట్రైలర్ రిలీజ్ కానుంది.ఇందుకోసం చెన్నై లో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈసినిమా సెన్సార్ కూడా పూర్తయింది.యు/ఏ సర్టిఫికెట్ తో దాదాపు 2 గంటల 48 నిమిషాల భారీ రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.

దుల్కర్ సల్మాన్ చేతికి హిట్ 3
నేచురల్ స్టార్ నాని నుండి నెస్ట్ వస్తున్న సినిమా హిట్ 3.ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.నాని సినిమాల్లోనే ఇప్పటివరకు మోస్ట్ వైలెంట్ మూవీగా వస్తుంది హిట్ 3.ఇక ఈసినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.అందులో భాగంగా మలయాళ వెర్షన్ రైట్స్ ను ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ కు చెందిన వేఫరర్ ఫిలిమ్స్ దక్కించుకుంది.దాంతో కేరళలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.దుల్కర్ కు హిట్ 3 ట్రైలర్ బాగా నచ్చడంతో సినిమా రైట్స్ తీసుకున్నాడు.

రివ్యూ: ఓదెల 2
ప్రేతాత్మ, దైవాంశ వంటి కాల్పనిక కథలు సాధారణ ప్రేక్షకులనే కాకుండా మూవీ క్రిటిక్స్‌ని సైతం మెప్పిస్తాయి. ఈ తరహా కథాంశంతో వచ్చిన ఓదెల 2 కూడా మూవీ లవర్స్‌ని ఆకట్టుకుంది. తమన్నా నటన, స్టోరీ, డైరెక్షన్ సినిమాలో హైలైట్ అయ్యాయి. హార్రర్, థ్రిల్లర్ కోరుకునేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కూడా ఈ మూవీ నచుతుంది. మొత్తానికి అన్నివర్గాల వారిని అలరించేలా వుంది. ఓవరాల్‌గా భారీ అంచనాల మధ్య వచ్చిన ఓదెల 2 ఆ అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు.

గ్రాండ్‌గా రీరిలీజ్ అవుతోన్న యమదొంగ
టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా రీరిలీజ్‌ల ట్రెండ్ మొదలైన విషయం తెలిసిందే. స్టార్ హీరోల బర్త్ డే సందర్భంగా గతంలో వారు నటించి సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. దీంతో ఆయా హీరోల అభిమానులు ఆరోజున ఒకవైపు సెలబ్రేషన్స్ చేసుకుంటూ, మరోవైపు ఈ రీరిలీజ్ చిత్రాలను వీక్షిస్తూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదేవిధంగా ఈ ట్రెండ్ నిర్మాతలకి కూడా కాసులవర్షం కురిపిస్తోంది.

హిలేరియస్‌గా సారంగపాణి జాతకం ట్రైలర్
క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'సారంగపాణి జాతకం'. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 25న సారంగపాణి జాతకం సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

45 తెలుగు టీజర్ రిలీజ్
కన్నడ స్టార్స్ శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 45.ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా 45 ని డైరెక్ట్ చేస్తుండగా సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి. ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా తెలుగు టీజర్ లాంఛ్ నిర్వహించారు.ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.

జాట్ 6 డేస్ కలెక్షన్స్
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ జాట్ వీక్ డేస్ లో స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద స్టడీ గా వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్న దేశ వ్యాప్తంగా 6కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో 6రోజుల్లో ఈసినిమా దేశవ్యాప్తంగా 65.45 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఈ వారం లో 100కోట్ల క్లబ్ లో చేరనుంది. ప్రస్తుతం మరో సినిమాతో పోటీ లేకపోవడం జాట్ కు అడ్వాంటేజ్ కానుంది.

ఈవారం రెండు సినిమాలు రానున్నాయి
గత వారం తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు.డబ్బింగ్ సినిమా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రమే పెద్ద సినిమాగా వచ్చింది. అయితే ఈ వారం రెండు హైప్ వున్న తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.అందులో ఓదెల 2 ఒకటి కాగా మరొకటి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ రెండు సినిమాలకు మంచి బజ్ వుంది.

కిచ్చా సుదీప్ 'బిల్లా రంగా బాషా' షూటింగ్ ప్రారంభం
భారతీయ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కొత్త శకానికి నాంది పలుకుతూ 'బిల్లా రంగ బాషా' ఈరోజు షూటింగ్ ప్రారంభమైయింది. కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా, విజనరీ అనుప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 2209 AD ఫ్యుచర్‌లో సెట్ చేయబడిన ఇంతకు ముందెన్నడూ చూడని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది.

రీరిలీజ్‌కి సిద్ధమైన భరత్ అనే నేను
టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఈ లిస్టులోకి ఓ క్రేజీ మూవీ చేరింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రం త్వరలో రీ రిలీజ్‌కి కాబోతోంది.

బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ఫిక్స్ ?
మినిమమ్ గ్యాప్ తీసుకోకుండా సినిమాలు పూర్తి చేసే హీరోల్లో బాలకృష్ణ ఒకరు.ఒక సినిమా పూర్తయ్యే లోపు మరో సినిమాను లైన్లో పెడతాడు.అంతేకాదు అఖండ నుండి ప్లాప్ అన్నదే తెలియకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఈ సీనియర్ హీరో.రీసెంట్ గా సంక్రాంతికి డాకు మహారాజ్ తో వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.ఇక ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 చేస్తున్నాడు.బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తుంది.అఖండ సీక్వెల్ కావడంతో ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.తమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.

బ్లైండ్ స్పాట్ ట్రైలర్ అప్‌డేట్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బ్లైండ్ స్పాట్'. ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రాకేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక. పేడాడ, హర్ష రోషన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రెట్రో రిలీజ్ డేట్ లో మార్పు లేదు
తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ రెట్రోతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.మే 1న తమిళంతోపాటు తెలుగు ,హిందీలోనూ రిలీజ్ కానుంది.అయితే తెలుగులో అదే డేట్ కు రిలీజ్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.మే 1నుండి రెట్రో రాంపేజ్ స్టార్ట్ కానుందని పోస్టర్ ద్వారా సితార ఎంటెర్టైన్మెంట్స్ ప్రకటించింది.ఈసంస్థ రెట్రోని తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేస్తుంది.

దిల్ రాజు బిగ్ అనౌన్స్‌మెంట్
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఓ ఏఐ బేస్డ్ టెక్నికల్ కంపెనీతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. సినిమాలకు సంబంధించి ఏఐ టెక్నాలజీ రిలేటెడ్ వర్క్స్ చేసే ఈ సంస్థతో దిల్ రాజు సంస్థ బిగ్ డీల్ కుదుర్చుకుంది. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎక్స్ వేదికగా నిన్న 'బోల్డ్… బిగ్… బియాండ్ ఇమాజినేషన్' అంటూ ట్వీట్ చేసింది.

ఓజీ కోసం శింబు.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన తమన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరి హరవీరమల్లు’, ‘ఓజీ’ సినిమాలు తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలన్నింటిపై ఇటు పవర్ స్టార్ అభిమానులతో పాటు అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కుబేర ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, రిలీజ్ డేట్ పోస్టర్ సహా ప్రచార చిత్రాలన్నీ అద్భుతమైన స్పందన రాబట్టుకున్నాయి. ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది.

ఎన్టీఆర్ నీల్ తరువాత దేవర 2నే
దేవర తరువాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తెలుగులో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.నెక్స్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నాడు.ఈనెల 22 నుండి ఎన్టీఆర్ సెట్ లో అడుగుపెట్టనున్నాడు.ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.