టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్లైండ్ స్పాట్’. ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రాకేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక. పేడాడ, హర్ష రోషన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవల శ్రీరామ నవమి పండుగ సందర్భంగా రిలీజ్ చేసిన బ్లైండ్ స్పాట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ప్రధానపాత్రధారులైన నవీన్ చంద్ర, రాశి సింగ్, రవి వర్మ, అలీ రెజా ఇంటెన్స్ లుక్స్‌తో చూస్తున్న ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఇక ప్రస్తుతం బ్లైండ్ స్పాట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది.
ఈనెల 18న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రానుంది. ఇక ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్లైండ్ స్పాట్ చిత్రం, ఇప్పుడు ఈ తాజా అప్‌డేట్‌తో మూవీ లవర్స్‌కి మరింత థ్రిల్ అందించేందుకు సిద్ధమైంది. కాగా ఈ సినిమాకి శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తుండగా.. దర్శన్ ఎమ్ అంబట్ సినిమాటోగ్రఫీ, సత్య. జి ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























