రీరిలీజ్‌కి సిద్ధమైన భరత్ అనే నేను

Bharat Ane Nenu Ready For Re Release

టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఈ లిస్టులోకి ఓ క్రేజీ మూవీ చేరింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం త్వరలో రీ రిలీజ్‌కి కాబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా మళ్లీ విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 26న ఈ మూవీ మళ్ళీ థియేటర్లలోకి వస్తోంది. దీనికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలోనే ఓపెన్ కానున్నాయి. సామజిక స్పృహ ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు ఉన్నత విద్యావంతుడైన, బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా కనిపించారు. ఇప్పుడు ఇది మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో మహేష్ అభిమానులే కాకుండా సినీ ప్రియులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

2018 ఏప్రిల్ 20న రిలీజైన భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ బాబు అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఆయన సరసన కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, రావు రమేష్, దేవరాజ్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డివివి దానయ్య నిర్మించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.