కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 17

PM Modi Lauds Ram Charan, Upasana and Anil Kamineni, For Archery Premier League Success
సినిమా వార్తలు

రామ్ చరణ్, ఉపాసనలపై ప్రధాని మోదీ ప్రశంసలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, స్పోర్ట్స్ ఎంటర్‌ప్రెన్యూర్ అనిల్ కామినేనిలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇటీవల వారు విలువిద్య (Archery) క్రీడను ప్రోత్సహించడానికి చేస్తున్న కృషిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు వీరు ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Meets New Hyderabad CP Sajjanar To Extend Congratulations
సినిమా వార్తలు

హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి గారు హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్ (సీపీ) వీసీ సజ్జనార్ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ గారిని అభినందించడానికి చిరంజీవి గారు ఆయన కార్యాలయానికి స్వయంగా వెళ్లారు. ఈ సందర్భంగా చిరు… సజ్జనార్ గారికి పుష్పగుచ్ఛం అందజేసి, నూతన బాధ్యతల్లో పూర్తి విజయం సాధించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Srikanth Mవాట్సాప్
Baahubali-The Epic Final Color Grading Wrapped Up - DOP Senthil Kumar
షూటింగ్ అప్‌డేట్

బాహుబలి: ది ఎపిక్.. బజ్ పెంచిన సెంథిల్ ట్వీట్

భారతీయ సినీ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిన 'బాహుబలి' ప్రపంచాన్ని మరోసారి తెరపైకి తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నుండి రాబోతున్న ప్రత్యేక ప్రాజెక్ట్ "బాహుబలి: ది ఎపిక్" గురించి తాజాగా కీలక అప్‌డేట్ విడుదలైంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన కె.కె. సెంథిల్ కుమార్ గారు సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్ట్ ఫైనల్ కలర్ గ్రేడింగ్ పూర్తయినట్టు ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
Rishab Shetty’s Kantara Chapter 1 Roars at North America Box Office
బాక్సాఫీస్

ఓవర్సీస్‌లో దూసుకుపోతున్న కాంతారా చాప్టర్ 1

ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ “కాంతార: ఎ లెజెండ్ చాప్టర్-1” ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భారతదేశంలో అద్భుతమైన స్పందన అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు విదేశాల్లో కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం నార్త్ అమెరికాలో $4 మిలియన్ (రూ. 33 కోట్లకు పైగా) గ్రాస్ కలెక్షన్ సాధించి దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
Asura Aagamana Glimpse Coming Soon From Supreme Hero Sai Durgha Tej’s SYG
ట్రైలర్ & టీజర్

సంబరాల ఏటిగట్టు నుంచి ‘అసుర ఆగమన’ గ్లింప్స్‌ వస్తోంది

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సంబరాల ఏటిగట్టు' (SYG). దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, చిత్ర యూనిట్ ఒక సాలిడ్ అప్‌డేట్‌ను అందించింది.

Srikanth Mవాట్సాప్
Thaman Brings Divine Touch With Vedic Pandit Duo For Akhanda 2
సినిమా వార్తలు

అఖండ 2 కోసం బిగ్ సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేసిన తమన్

'గాడ్ ఆఫ్ ది మాసెస్' నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను డైనమిక్ అండ్ పవర్ ఫుల్ ఫోర్త్ కొలాబరేషన్ లో మోస్ట్ అవైటెడ్ హై-ఆక్టేన్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం' పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
K-Ramp Trailer Out Kiran Abbavaram Promises Colourful Diwali Treat To Audience
ట్రైలర్ & టీజర్

కే-ర్యాంప్ ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, కథానాయిక యుక్తి తరేజా జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'కే-ర్యాంప్' (K-Ramp). ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేయగా, ప్రేక్షకుల్లో ముఖ్యంగా యువతలో భారీ స్పందన లభిస్తోంది. జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో పాటు, యాక్షన్, రొమాన్స్, కామెడీ కలగలిపిన విభిన్నమైన కథాంశంతో రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Srikanth Mవాట్సాప్
Director Atlee Shares Interesting Updates on Allu Arjun's AA22 Project
సినిమా వార్తలు

AA22xA6 మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అట్లీ

'పుష్ప 2'తో ఆల్ టైమ్ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా అట్లీ ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించనుందని ఆయన ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
Dil Raju Produces Vijay Deverakonda’s Rowdy Janardhana Launched Grandly
సినిమా వార్తలు

ఘనంగా ప్రారంభమైన దిల్ రాజు-విజయ్ దేవరకొండ చిత్రం

'కింగ్ డమ్' సినిమా తర్వాత టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా కొత్త చిత్రం షురూ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 59వ ప్రాజెక్టుగా రూపొందుతోన్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా, మేకర్స్ ఈ చిత్రానికి 'రౌడీ జనార్ధన' అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Mass Maharaja Ravi Teja's RT76 Lengthy Foreign Schedule Commences
షూటింగ్ అప్‌డేట్

రవితేజ RT76 ఫారిన్ షెడ్యూల్ ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో హోల్సమ్ ఎంటర్‌టైనర్ #RT76 చేస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను బిగ్ కాన్వాస్‌పై స్టైలిష్‌గా రూపొందిస్తున్నారు. టీమ్ ప్రస్తుతం కీలక ఫారిన్ షెడ్యూల్‌కి షిఫ్ట్ అయ్యింది. గత కొన్ని రోజులుగా స్పెయిన్‌లోని వాలెన్షియా, సమీప దీవుల్లో లొకేషన్ రెక్కీ పనులు పూర్తి చేశారు.

Srikanth Mవాట్సాప్
Meesaala Pilla Song Launch Date Out Now
సాంగ్

మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ నెలలో ఫైనల్ షెడ్యూల్ జరగనుంది.ఇక దసరా పండుగ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ ప్రోమోకి అద్భుతమైన స్పందన వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Rishab Shetty Visits and Offers Special Prayers At Mumbais Siddhivinayak Temple
సినిమా వార్తలు

కాంతార చాప్టర్ 1 సక్సెస్.. ముంబై సిద్ధి వినాయక ఆలయంలో రిషబ్ శెట్టి ప్రత్యేక పూజలు

కన్నడ చిత్రసీమ నుండి వచ్చి, తన అద్భుతమైన ప్రతిభతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించిన హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'కాంతార చాప్టర్ 1' ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
Andhra King Taluka Teaser Date Revealed
ట్రైలర్ & టీజర్

ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ డేట్ రివీల్

ఉస్తాద్ రామ్ పోతినేని నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా తో రానున్నాడు.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.రీసెంట్ గా రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ గా టీజర్ ను వదలనున్నారు.75 సెకండ్ల నిడివితో ఈ నెల 12న ఈ టీజర్ విడుదలకానుంది. టీజర్ వచ్చాక సినిమాపై హైప్ డబుల్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Producer Mythri Ravi Shankar Predicts Dude Will be Blockbuster
సినిమా వార్తలు

డ్యూడ్‌లో హీరో, హీరోయిన్ మధ్య సీన్స్ మామూలుగా ఉండవు - మైత్రి రవిశంకర్

'లవ్ టుడే, డ్రాగన్‌' సినిమాలతో రెండు వరుస సూపర్ హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్‌'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Pradeep Ranganathan Will Entertain Everyone With Dude, Says Actor Sarath Kumar
సినిమా వార్తలు

డ్యూడ్‌తో ప్రదీప్ అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు - శరత్ కుమార్

'లవ్ టుడే, డ్రాగన్‌' సినిమాలతో రెండు వరుస సూపర్ హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్‌'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Director Rajamouli Birthday Mahesh Babu, NTR, Ram Charan and Other Celebs Extends Wishes
సినిమా వార్తలు

రాజమౌళి బర్త్ డే.. సెలబ్రిటీల శుభాకాంక్షలు

భారతీయ సినీ ప్రపంచానికి కొత్త పుంతలు తొక్కించిన విజనరీ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి జన్మదినం సందర్భంగా టాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌ వంటి స్టార్‌ హీరోలు రాజమౌళికి ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ, ఆయన సృజనాత్మకతకు మళ్ళీ మరొకసారి సెల్యూట్‌ చేశారు.

Srikanth Mవాట్సాప్
SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar
బర్త్‌డే స్పెషల్స్

తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

సినిమా అంటే కేవలం వినోద సాధనం మాత్రమే కాదు, అదొక విశ్వాసం, అదొక బ్రాండ్ అని నిరూపించిన సృజనశీలి, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. తెలుగు గడ్డపై పుట్టి, తన అద్భుతమైన సృజనాత్మకతతో భారతీయ సినిమాను ప్రపంచ సినిమా వేదికపై సగర్వంగా నిలబెట్టిన ఘనత ఆయనది. అక్టోబర్ 10న ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఆయన వ్యక్తిగత జీవితం నుండి అంతర్జాతీయ ఖ్యాతి వరకు సాగిన అద్భుత ప్రయాణాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.

Srikanth Mవాట్సాప్
Dude Will Feature Surprising Elements, Say Pradeep Ranganathan
సినిమా వార్తలు

డ్యూడ్‌లో ఊహించని ఎలిమెంట్స్ చాలా ఉంటాయి - ప్రదీప్ రంగనాథన్

యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే, డ్రాగన్‌' వంటి రెండు వరుస సూపర్ హిట్‌ల తర్వాత ఇప్పుడు 'డ్యూడ్‌'తో దీపావళి కానుకగా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Pradeep Ranganathan's Dude Trailer Highlights
ట్రైలర్ & టీజర్

డ్యూడ్‌ ట్రైలర్‌ హైలైట్స్

'లవ్ టుడే, డ్రాగన్‌' సినిమాలతో రెండు వరుస సూపర్ హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్‌'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Venkatesh's Nuvvu Naaku Nachav Returns to Theatres on Jan 1st, 2026
సినిమా వార్తలు

న్యూ ఇయర్ కానుకగా.. 'నువ్వు నాకు నచ్చావ్' రీ-రిలీజ్

టాలీవుడ్‌లో ఎప్పటికీ మరుపురాని, కుటుంబ ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన చిత్రాలలో ఒకటైన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. విక్టరీ వెంకటేష్ గారి నటన, త్రివిక్రమ్ గారి సంభాషణల మ్యాజిక్ ఉన్న ఈ టైమ్‌లెస్ క్లాసిక్‌ను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ ఆహ్లాదకరమైన ఎంటర్‌టైనర్‌ను సరిగ్గా కొత్త సంవత్సరం రోజున, జనవరి 1, 2026 నాడు, థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Srikanth Mవాట్సాప్

షేర్