కన్నడ చిత్రసీమ నుండి వచ్చి, తన అద్భుతమైన ప్రతిభతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించిన హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ భారీ విజయాన్ని ఆస్వాదిస్తున్న రిషబ్ శెట్టి, తాజాగా ముంబైలోని ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు శుక్రవారం (అక్టోబర్ 10) ఉదయం ఆలయానికి విచ్చేసిన రిషబ్ శెట్టికి ఆలయ నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం రిషబ్ వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకున్నారు.
సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన రిషబ్
ఆలయ దర్శనానికి వచ్చిన రిషబ్ శెట్టి పూర్తి సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. తెల్లటి షర్ట్, తెల్లటి పంచె ధరించి, కాళ్లకు చెప్పులు లేకుండా వచ్చిన ఆయన భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. దర్శనం పూర్తయిన అనంతరం ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి ప్రసాదాన్ని, శాలువాను అందించారు.
ఇక ఆలయం నుంచి బయటకు వచ్చిన రిషబ్ శెట్టి, అభిమానులకు, కెమెరాలకు నవ్వుతూ అభివాదం చేస్తూ ఫోటోలకు పోజులిచ్చారు. ఈ నేపథ్యంలో కాంతార హీరోను చూసేందుకు అభిమానులు ఉత్సాహం ప్రదర్శించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక కాంతార చాప్టర్ 1 సినిమా విడులైన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ అపూర్వ విజయాన్ని దైవం ఆశీర్వాదంగా భావిస్తూ రిషబ్ శెట్టి సిద్ధివినాయకుడిని దర్శించుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























