డ్యూడ్‌ ట్రైలర్‌ హైలైట్స్

Pradeep Ranganathan's Dude Trailer Highlights

‘లవ్ టుడే, డ్రాగన్‌’ సినిమాలతో రెండు వరుస సూపర్ హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్‌’తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ లాంచ్ చేశారు.

‘డ్యూడ్‌’ ట్రైలర్‌ హైలైట్స్

  • సాంప్రదాయ ప్రేమ కథలకంటే భిన్నంగా ‘డ్యూడ్’ కథ ఒక యువకుడి జీవితం, ప్రేమతో మొదలవుతుంది.
  • తాను అన్నీ అర్థం చేసుకున్నానని అనుకునే ఒక పక్కా రొమాంటిక్.
  • అయితే, అతని ప్రేమ జీవితం పర్‌ఫెక్ట్‌గా సాగుతున్నట్టు అనిపిస్తుందంతే కానీ, ఒక్కసారిగా నిజ జీవితం తలకిందులు అవుతుంది.
  • అతని లవ్ దూరమవడం అతని మనసులో భావోద్వేగ తుఫాను తెచ్చిపెడుతుంది.
  • అదే సమయంలో మరో అమ్మాయి అతని జీవితంలోకి అడుగు పెట్టడం, తాళి అనే అంశానికి కొత్త మీమింగ్ జోడిస్తుంది.
  • ‘డ్యూడ్’ బ్రేకప్‌ గురించీ, లేదా కామెడీ గురించీ కాదు, రెండింటి మధ్య ఉన్న ఆ గందరగోళమైన, అందమైన ఫీలింగ్ గురించీ.
  • ట్రైలర్‌లో కామెడీ, ఎమోషన్స్, మోడరన్ యూత్ వైబ్స్ పర్ఫెక్ట్‌గా వున్నాయి.
  • ప్రదీప్ తన నేచురల్ హ్యుమర్, ఎమోషన్స్ అదరగొట్టాడు. మమితా బైజు తన పాత్రలో కట్టిపడేసింది.
  • నేహా శెట్టి ప్రెజెన్స్ ఇంట్రస్టింగ్‌గా వుంది. శరత్‌కుమార్, రోహిణి మొల్లెట్టి, హృదు హారూన్, ద్రవిడ్ సెల్వం లాంటి నటులు కథకు మరింత బలాన్ని జోడించారు.
  • డెబ్యుట్ డైరెక్టర్ కీర్తిశ్వరన్ కామెడీ, సెంటిమెంట్ మధ్య సున్నితమైన బ్యాలెన్స్‌ను అద్భుతంగా చూపించారు.
  • నికేత్ బొమ్మి విజువల్స్, సాయి అభ్యంకర్ సంగీతం అద్భుతంగా వున్నాయి.
  • మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపించాయి.

మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలు పెంచింది. కాగా, అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతున్న ‘డ్యూడ్’ ఈ సీజన్‌ను నవ్వులు, మ్యూజిక్, ఎమోషన్స్ తో అలరించనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.