ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ డేట్ రివీల్

Andhra King Taluka Teaser Date Revealed

ఉస్తాద్ రామ్ పోతినేని నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా తో రానున్నాడు.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.రీసెంట్ గా రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ గా టీజర్ ను వదలనున్నారు.75 సెకండ్ల నిడివితో ఈ నెల 12న ఈ టీజర్ విడుదలకానుంది. టీజర్ వచ్చాక సినిమాపై హైప్ డబుల్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో ఫ్యాన్ బయోపిక్ గా తెరక్కుతున్న ఈసినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే నటిస్తుండగా కన్నడ స్టార్ ఉపేంద్ర స్టార్ హీరో పాత్రలో కనిపించనున్నాడు. అతని అభిమానిగా సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నాడు. తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.నవంబర్ 28 న ఆంధ్ర కింగ్ తాలూకా థియేటర్లోకి రానుంది.

ఇక ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని రామ్ చూస్తున్నాడు.అందుకు తగ్గట్లే సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. సినిమా కూడా అనుకున్నట్లే వస్తుందట. సో రామ్ ఈసినిమాతో కం బ్యాక్ ఇవ్వడం పక్కా.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.