‘లవ్ టుడే, డ్రాగన్’ సినిమాలతో రెండు వరుస సూపర్ హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ప్రదీప్, మమత బైజు, శరత్ కుమార్ గారు ఒకరికి మించి ఒకరు పెర్ఫార్మ్ చేశారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ట్రైలర్‌లో కేవలం సినిమా వైబ్ మాత్రమే ప్రజెంట్ చేశాం. చాలా కంటెంట్ ఉంది. మీరు మాగ్జిమమ్ ఎంజాయ్ చేస్తారు.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “తెలుగు, తమిళ్ రెండు భాషల్లో వస్తుంది. సాంగ్స్ పెద్ద హిట్. సాయి అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. డైరెక్టర్ కీర్తి చెప్పిన దానికంటే అద్భుతంగా తీశారు. ఇందులో హీరో, హీరోయిన్ మధ్య సీన్స్ మామూలుగా ఉండవు. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. దీపావళికి వస్తున్న ‘కిరణ్ అబ్బవరం గారి సినిమా, మిత్రమండలి, తెలుసు కదా’ చిత్రాలు కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























