రామ్ చరణ్, ఉపాసనలపై ప్రధాని మోదీ ప్రశంసలు

PM Modi Lauds Ram Charan, Upasana and Anil Kamineni, For Archery Premier League Success

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, స్పోర్ట్స్ ఎంటర్‌ప్రెన్యూర్ అనిల్ కామినేనిలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇటీవల వారు విలువిద్య (Archery) క్రీడను ప్రోత్సహించడానికి చేస్తున్న కృషిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు వీరు ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రధాని మోదీ సందేశం ఇదే..

ఈ భేటీపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం దీనిపై ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. అందులో.. “ఉపాసనగారిని, అనిల్ కామినేనిగారిని కలవడం ఆనందంగా ఉంది. విలువిద్యను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మీరు చేస్తున్న సమష్టి ప్రయత్నాలు ప్రశంసనీయం. మీరు చేస్తున్న ఈ కృషి ఎంతోమంది యువతకు ప్రయోజనం చేకూరుస్తుంది.” అని తెలుగులో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విలువిద్యకు అండగా ఉపాసన, అనిల్..

అనిల్ కామినేని నేతృత్వంలో ప్రారంభమైన ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ భారతీయ ప్రాచీన క్రీడ అయిన విలువిద్యను (ఆర్చరీ) తిరిగి దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చే లక్ష్యంతో సాగుతోంది. ప్రపంచ స్థాయి శిక్షణ, పోటీ వేదికలు, అంతర్జాతీయ గుర్తింపు.. ఈ మూడు మార్గాల ద్వారా భారత విలువిద్యాకారులకు అవకాశాలను అందించడం APL ప్రధాన లక్ష్యం.

ఈ భేటీ సందర్భంగా, APL తొలి సీజన్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, ప్రతినిధులు ప్రధాన మంత్రికి ఒక సింబాలిక్ బౌ ని అందజేశారు. అలాగే, ఉపాసన-చరణ్ దంపతులు మెగాస్టార్ చిరంజీవి, శ్రీమతి సురేఖ తరఫున ప్రధాన మంత్రికి బాలాజీ విగ్రన్ని బహూకరించారు. ఇక, ప్రధాని మోదీ వీరి సామాజిక కృషిని గుర్తించి అభినందించడం పట్ల మెగా ఫ్యాన్స్, సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.