మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Meesaala Pilla Song Launch Date Out Now

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ నెలలో ఫైనల్ షెడ్యూల్ జరగనుంది.ఇక దసరా పండుగ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ ప్రోమోకి అద్భుతమైన స్పందన వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీసాల పిల్ల అంటూ సాగే ఈ సాంగ్‌లో మెగాస్టార్ స్వాగ్ ,భీమ్స్ సిసిరోలియో అందించిన బీట్స్ సూపర్ అనిపించాయి.ప్రోమో, సాంగ్ పై అంచనాలు పెంచడంతో ఫుల్ సాంగ్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇకఈసాంగ్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈనెల 13న ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ కానుంది.ఈ సందర్బంగా ఓ వీడియో రిలీజ్ చేసి సాంగ్ డేట్ చెప్పారు మేకర్స్.

లెజండరీ సింగర్ ఉదిత్ నారాయణ పాడిన ఈ పాట చార్ట్ బస్టర్ కావడం ఖాయం.సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ హైప్ సృష్టించింది.ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎమోషన్‌లతో పాటు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ కూడా సినిమాకి స్పెషల్ ఆకర్షణగా నిలువనుంది.

ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.