డ్యూడ్‌లో ఊహించని ఎలిమెంట్స్ చాలా ఉంటాయి – ప్రదీప్ రంగనాథన్

Dude Will Feature Surprising Elements, Say Pradeep Ranganathan

యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ టుడే, డ్రాగన్‌’ వంటి రెండు వరుస సూపర్ హిట్‌ల తర్వాత ఇప్పుడు ‘డ్యూడ్‌’తో దీపావళి కానుకగా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత మమిత బైజు ఈ సినిమాలో కథానాయికగా నటించగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. సినిమా ప్రమోషన్స్ కి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందంగా ఉంది. ఈవెంట్లకు వెళ్తున్నప్పుడు ఆడియన్స్ ఇంత పెద్ద స్థాయిలో రావడం నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇంత ప్రేమని అందిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారికి, రవి గారికి థాంక్యూ.”

“మైత్రి మూవీ మేకర్స్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఇన్ ఇండియా. వాళ్ళతో పని చేస్తున్నప్పుడు ఎందుకు ఇండియాలో నెంబర్ వన్ సంస్థగా ఉన్నారో అర్థమైంది. చాలా ప్యాషన్ తో పని చేస్తారు. సినిమా ట్రైలర్ కి తెలుగు, తమిళ్‌లో అద్భుతమైన స్పందన వచ్చింది. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఈక్వల్ గా వ్యూస్ రావడం నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది.”

“ట్రైలర్‌లో మీరు చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌ చూసారు. సినిమాలో చాలా డ్రామా, ఎమోషన్ ఉంటుంది. మీరు ఊహించని ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేసిన శరత్ కుమార్ గారికి థాంక్యూ. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. యూత్‌తో పాటు ఫ్యామిలీస్ సినిమాని ఇష్టపడతారు. దీపావళికి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న ‘తెలుసు కదా, మిత్రమండలి, కే-ర్యాంప్’ సినిమాలు అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నాను.” అని తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.