కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

డ్యూడ్‌తో ప్రదీప్ అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు - శరత్ కుమార్

Pradeep Ranganathan Will Entertain Everyone With Dude, Says Actor Sarath Kumar

డ్యూడ్‌తో ప్రదీప్ అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు - శరత్ కుమార్

Pradeep Ranganathan Will Entertain Everyone with Dude Says Actor Sarath Kumar

Pradeep Ranganathan Will Entertain Everyone With Dude, Says Actor Sarath Kumar

'లవ్ టుడే, డ్రాగన్‌' సినిమాలతో రెండు వరుస సూపర్ హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్‌'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

'ప్రేమలు' వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా యాక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. డ్యూడ్ సినిమా ఒక మంచి వైబ్. ట్రైలర్లో మీరు చూసింది 10 శాతమే. ఈ సినిమా గ్యారంటీ హిట్టు. ఈ సినిమాలో చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా కొత్త కథ ఇది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. రవి గారికి థాంక్యూ." అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. "ప్రదీప్ ఈ సినిమాతో అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. ఇది హోల్సమ్ ఎంటర్టైనర్. దీపావళికి వస్తున్న సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అందరూ థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నాను." అని అన్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్