
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 22

త్వరలో బన్నీ టైటిల్ విడుదల
కొత్త దర్శకుడికి మెగా హీరో గ్రీన్ సిగ్నల్
అమీర్ తో సినిమా నిజమే

హ్యాపీ బర్త్ డే

బొమ్మ పడుతుంది - సినిమా కన్ఫామ్

జెర్సీ మూవీ తమిళ రీమేక్ లో హీరోయిన్ ?

గాంధీ జయంతి రోజు 'వార్'

రణరంగం మూవీ సౌండ్ కట్ ట్రైలర్ రిలీజ్

6 మిలియన్ సబ్ స్క్రైబర్స్ తో తెలుగు ఫిల్మ్ నగర్

సాహో మూవీ ట్రైలర్ ప్రభంజనం

కియారా... జూన్ కనెక్షన్

‘వి’ షూటింగ్‌లో జాయిన్ అయిన నేచురల్ స్టార్

మరో రీమేక్‌లో రాజశేఖర్?

రాజ్ తరుణ్ పక్కన మలయాళీ భామ

థాయ్‌లాండ్‌లో బాలయ్య సందడి

‘సాహో’లో ప్రభాస్ పాత్ర పేరు అదేనా?

రకుల్... ‘భారతీయుడు 2’ షూటింగ్ టైమ్
లోక నాయకుడు కమల్ హాసన్, అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’(1996) ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కట్ చేస్తే... 23 ఏళ్ళ తరువాత కమల్, శంకర్ కాంబోలో మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ఐశ్వర్యా రాజేష్, ప్రియాభవాని శంకర్, విద్యుత్ జమ్వాల్ ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
త్వరలో బన్నీ టైటిల్ విడుదల
స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ విషయం లో అప్ డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఆగష్ట్ 15వ తేదీన టైటిల్ ను రిలీజ్ చేయనున్నట్టు ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మరి ఇదే రోజు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపించాయి. చుద్దాం టైటిల్ ఒక్కటే రిలీజ్ చేస్తారో? లేక టైటిల్ ప్లస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారో?
కొత్త దర్శకుడికి మెగా హీరో గ్రీన్ సిగ్నల్
మొత్తానికి చిత్రలహరి సినిమాతో హిట్ కొట్టాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. గతంలో చేసిన తప్పులు చేయకుండా సినిమాల ఎంపిక విషయం లో జాగ్రతలు తీసుకుంటున్నాడు. తొందరపడకుండా తనకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మారుతి డైరెక్షన్ లో ప్రతి రోజు పండగే అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతకొద్ది నెలలుగా షూటింగ్ జరుపుకుంతుండగా.. మరికొన్ని రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకోనుంది.
అమీర్ తో సినిమా నిజమే
మొత్తానికి అమీర్ ఖాన్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు వచ్చిన వార్తలకు బ్రేక్ పడింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం విజయ్ సేతుపతి నటిస్తున్న ‘సంఘ తమిళన్’ సినిమా షూటింగ్ స్పాట్‌కు అమీర్ ఖాన్ వెళ్లడమే.

హ్యాపీ బర్త్ డే
తెలుగు, తమిళ భాషల చిత్రాలకు మ్యూజిక్ కంపోజర్ గా, బ్యాక్ గ్రౌండ్ స్కోరర్ గా పనిచేస్తున్న గిబ్రాన్ కు జన్మ దిన శుభాకాంక్షలు. బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న వాగై సూడ వా మూవీ తో సంగీత దర్శకుడిగా 2011 సంవత్సరంలో కోలీవుడ్ లో ప్రవేశించిన గిబ్రాన్ సంగీతం అందించిన వత్తి కుచ్చి, ఉత్తమ విలన్,పాపనాశం, తూంగవనం , అదే కనగల్, తీరం అధికారం ఒండ్రు, రాట్చసన్ వంటి తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

బొమ్మ పడుతుంది - సినిమా కన్ఫామ్
ఒక హీరో లో ఉన్న హీరోయిజాన్ని పర్ఫెక్ట్ గా చూపించాలంటే అది డాషింగ్ డైరెక్టర్ పూరీ వల్లే సాధ్యమవుతుందని స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. సినిమా నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో ఎవరంటే టక్కున విజయ్ దేవరకొండ అని చెప్పొచ్చు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటది. సినిమా లవర్స్ కి పండగే కదా..

జెర్సీ మూవీ తమిళ రీమేక్ లో హీరోయిన్ ?
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. క్రికెటర్ గా నాని అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఇప్పుడు ఆ మూవీ తమిళ భాష లో రీమేక్ కానుంది. బహు భాషా నటుడు రానా దగ్గుబాటి నిర్మాణ సారథ్యం లో నెల్సన్V దర్శకత్వంలో రూపొందనుందని సమాచారం.

‘సరిలేరు నీకెవ్వరు' లో అడుగుపెట్టిన లేడీ సూపర్ స్టార్
అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇటీవలే మహేష్ బర్త్ డే సందర్భం గా మహేష్ ఇంట్రడక్షన్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.

గాంధీ జయంతి రోజు 'వార్'
ఒక్క హీరో స్క్రీన్ పై ఉంటేనే ఎంతో సందడిగా ఉంటుంది. అలాంటిది ఇద్దరు హీరోలూ.. అందులోనూ హంక్ బాడీస్.. వార్ కు దిగితే.. రెండు కళ్ళూ సరిపోవు అంతే. అలాంటి ఇద్దరు హీరోలు ఇప్పుడు సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.ఆ హీరోలు ఎవరో కాదు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్.

రణరంగం మూవీ సౌండ్ కట్ ట్రైలర్ రిలీజ్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన యాక్షన్ , క్రైమ్ థ్రిల్లర్ రణరంగం మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కానుంది. శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా నటించిన ఈ మూవీ లో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికలు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందించారు.రణరంగం మూవీ ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

6 మిలియన్ సబ్ స్క్రైబర్స్ తో తెలుగు ఫిల్మ్ నగర్
సౌతిండియాలో నెంబర్ వన్ యూట్యూబ్ ఛానెల్ గా వెలుగొందుతున్న తెలుగు ఫిల్మ్ నగర్ 60 లక్షల సబ్ స్క్రైబర్స్ మైలురాయిని చేరుకుంది. టాలీవుడ్ మూవీస్ అప్ డేట్స్ తో ప్రేక్షకులను తెలుగు ఫిల్మ్ నగర్ ఛానెల్ అలరిస్తుంది. తెలుగు ఫిల్మ్ నగర్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో ముందడుగు వేస్తుంది.

సాహో మూవీ ట్రైలర్ ప్రభంజనం
సుజీత్ దర్శకత్వం లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో ఆగస్ట్ 30వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ , మేకింగ్ వీడియోస్, టీజర్, సాంగ్స్ తో హైప్ క్రియేట్ అయిన సాహో మూవీ ట్రైలర్ ను 10వ తేదీ చిత్ర యూనిట్ నాలుగు భాషలలో రిలీజ్ చేసింది. హాలీవుడ్ మూవీస్ ట్రైలర్స్ ను తలదన్నేలా రూపొందిన సాహో ట్రైలర్ కు ప్రేక్షకులనుండి విశేష స్పందన లభించింది.

కియారా... జూన్ కనెక్షన్
కియారా అద్వానీ... గ్లామర్ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. హిందీ చిత్రం ‘ఫగ్లీ’(2014)తో కథానాయికగా తొలి అడుగులు వేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... ఆ తర్వాత ‘ఎం.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’(2016)తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి... తొలి తెలుగు చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. అలాగే... ఇటీవల విడుదలైన ‘కబీర్ సింగ్’ (‘అర్జున్ రెడ్డి’ రీమేక్) రూపంలో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

డిఫరెంట్ సబ్జెక్ట్‌తో పూరి, విజయ్ దేవరకొండ మూవీ?
వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం క్రాంతిమాధవ్ డైరెక్టోరియల్, ‘హీరో’ చిత్రాలతో ఈ యంగ్ హీరో బిజీగా ఉన్నాడు. అంతేకాదు... `ఇస్మార్ట్` డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లోనూ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయనున్నాడట విజయ్.

‘వి’ షూటింగ్‌లో జాయిన్ అయిన నేచురల్ స్టార్
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం `గ్యాంగ్ లీడర్`, `వి` చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కె.కుమార్ రూపొందిస్తున్న`గ్యాంగ్ లీడర్` సెప్టెంబర్ 13న విడుదల కానుండగా... ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కిస్తున్న `వి` క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది.

మరో రీమేక్‌లో రాజశేఖర్?
‘గరుడవేగ’ (2017)తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసిన సీనియర్ హీరో రాజశేఖర్... రీసెంట్‌గా ‘కల్కి’తో పలకరించాడు. అయితే`కల్కి` ఆశించిన విజయం సాధించకపోవడంతో... గతంలో తనకు కలిసొచ్చిన రీమేక్ ఫార్ములాని మరోసారి నమ్ముకుంటున్నాడట రాజశేఖర్. ఈ నేపథ్యంలోనే... ఓ కన్నడ మూవీ రీమేక్‌లో నటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడని సమాచారం.

`ప్రతీ రోజు పండగే` కోసం సాయితేజ్ సిక్స్ ప్యాక్?
తెలుగునాట సిక్స్ ప్యాక్ ఓ ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు ఈ జాబితాలో మెగాహీరో సాయితేజ్ కూడా చేరనున్నాడని సమాచారం.

రాజ్ తరుణ్ పక్కన మలయాళీ భామ
చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రాజ్ తరుణ్ మళ్ళీ వరుస సినిమాలు తో వచ్చేస్తున్నాడు. గుండె జారి గల్లంతయ్యిందే ఫేం కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

థాయ్‌లాండ్‌లో బాలయ్య సందడి
`జై సింహా` తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక నాయికలుగా నటిస్తుండగా... భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘సాహో’లో ప్రభాస్ పాత్ర పేరు అదేనా?
“గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టినోడికే ఓ రేంజ్ ఉంటుంది” అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రంతో సిక్స్(బ్లాక్‌బస్టర్) కొట్టడానికి సిద్ధపడుతున్నాడు. ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన ట్రైలర్ శనివారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ ట్రైలర్... ‘సాహో’ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తోంది.