
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 89


సిద్ధార్థ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

ఇంట్రెస్టింగ్‍గా డార్లింగ్ రిలీజ్ ట్రైలర్

గోపీచంద్ విశ్వం వాయిస్ ఓవర్ కోసం కల్కి

దుబాయ్ లో బిజీగా RC16 టీమ్

డబుల్ ఇస్మార్ట్ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

ఆశిష్ రెడ్డి సెల్ఫిష్ మళ్లీ మొదలు

నార్త్ అమెరికాలో హవా కొనసాగిస్తోన్న కల్కి

ధనుష్ రాయన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కన్నప్ప లో శరత్ కుమార్ రోల్ ఇదే..!

ఇంట్రెస్టింగ్ గా కిరణ్ అబ్బవరం క మూవీ టీజర్ రిలీజ్

డబుల్ ఇస్మార్ట్ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

నా పెళ్లి అప్పుడే-కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. నటి రహస్య గోరక్ తో కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం ఈ ఏడాది మార్చిలో జరిగింది. రాజావారు రాణిగారు సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈసినిమాతోనే కిరణ్, రహస్య గోరక్ ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి కూడా. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ పెళ్లి చేసుకోబోతున్నారు.ఈనేపథ్యంలోనే తన పెళ్లి ఎప్పుడో చెప్పేశాడు కిరణ్ అబ్బవరం.

బచ్చల మల్లి-మా ఊరి జాతరలో ఫుల్ సాంగ్ రిలీజ్
అల్లరి నరేష్ నుండి రాబోతున్న సినిమా బచ్చలమల్లి. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా నుండి ఇప్పటికే వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ ఫుల్ మాస్ రోల్ లో కనిపిస్తుండటంతో ఈసినిమాకు అంత బజ్ పెరిగింది.

అలనాటి రామచంద్రుడు-నాపేరు నువ్వని మెలోడి సాంగ్ రిలీజ్
కృష్ణ వంశీ హీరోగా పరిచయం అవుతూ చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా అలనాటి రామచంద్రుడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమా ఏపీ, తెలంగాణ రిలీజ్ హక్కులను దిల్ రాజు నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు సొంతం చేసుకోవడంతో ఈసినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను ఆగష్ట్ 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.

సిద్ధార్థ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం
స్వతహాగా కోలీవుడ్ నటుడైనప్పటికీ తెలుగునాట కూడా పాపులర్ అయిన హీరో సిద్ధార్థ్. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే ఎందుకనో గత కొంతకాలంగా సిద్దు తమిళ్ చిత్రాలలోనే ఎక్కువగా నటిస్తున్నాడు. ఇదే కోవలో గతేడాది ఆయన నటించి, స్వయంగా నిర్మించిన 'చిత్తా' సినిమా ఘనవిజయం అందుకుంది. కలెక్షన్ల పరంగానే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. దీనిని తెలుగులో 'చిన్నా' పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. మూవీ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఇది థియేటర్లలో యావరేజ్‌గా నడించింది.

ఒక ఓటీటీ లోకి వచ్చేసిన హరోంహర
చాలా గ్యాప్ తరువాత హరోం హర సినిమాతో డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సుధీర్ బాబు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వచ్చిన సినిమా హరోం హర. కుప్పం నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఎన్నో అంచనాల నేపథ్యంలో జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

ఇంట్రెస్టింగ్‍గా డార్లింగ్ రిలీజ్ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'డార్లింగ్'. 'వై దిస్ కొలవరి?' అనేది టాగ్ లైన్‌గా ఉంది. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ భామ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బ్రహ్మనందం, అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్, విష్ణు, కృష్ణతేజ, శివారెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది.

కంగువా ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దేవి
మచ్ అవైటెడ్ కంగువ నుండి ఫస్ట్ సాంగ్ రానుంది.ఈ సాంగ్ హీరో సూర్య బర్త్ డే సందర్భంగా ఈనెల 23న రిలీజ్ కానుందట.ఈవిషయాన్ని ఈసినిమా మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ రీసెంట్ గా ఓ ఈవెంట్ లో తెలియజేశాడు.త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన టీజర్ అంచనాలను భారీగా పెంచేసింది.

గోపీచంద్ విశ్వం వాయిస్ ఓవర్ కోసం కల్కి
గోపీచంద్ కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా భీమా సినిమాతో వచ్చాడు. ఈసినిమా కూడా విజయాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా విశ్వం. ఢీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలతోో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల తో ఈసినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

దుబాయ్ లో బిజీగా RC16 టీమ్
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో పేరు సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఇప్పుడు తన నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

ఓటిటిలోనూ మహారాజకు సూపర్ రెస్పాన్స్
తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన రీసెంట్ బ్లాక్ బాస్టర్ మూవీ మహారాజ ఓటిటిలో కూడా అదరగొడుతుంది. గత శుక్రవారం నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను తమిళ్ తోసహా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.దాంతో థియేటర్లలో ఈసినిమాను మిస్ అయిన వారు ఓటిటి లో చూసి యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.సాలిడ్ కంటెంట్ కి తోడు విజయ్ సేతుపతి యాక్టింగ్ సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈవారం నెట్ ఫ్లిక్స్ ఇండియాలో ఈసినిమా టాప్ వన్ ప్లేస్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

డబుల్ ఇస్మార్ట్ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్
ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ అవ్వడంలో సాంగ్స్ కూడా కీ రోల్ ప్లే చేశాయి.మణిశర్మ ట్యూన్స్ కు రామ్ వేసిన స్టెప్పులు యూత్ ను ఫిదా చేశాయి.ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వస్తున్న విషయం తెలిసిందే.షూటింగ్ కూడా అయిపోయింది. ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు.అందులో భాగంగా రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ స్టెప్పా మార్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఆశిష్ రెడ్డి సెల్ఫిష్ మళ్లీ మొదలు
టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈసినిమా డీసెంట్ హిట్ నే అందించింది. ఆ తరువాత సెల్ఫిష్ సినిమాను లైన్ లో పెట్టాడు. అయితే ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. కానీ మధ్యలో షూట్ కు బ్రేక్ పడింది. ఈసినిమా కథలో మార్పు చేయడం కోసమే షూటింగ్ ను ఆపినట్టు వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే ఈసినిమా కంటే వెనుక మొదలుపెట్టిన లవ్ మీ మూవీని కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు సెల్ఫిష్ షూట్ ను మళ్లీ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. కథలో చేసిన మార్పులు నచ్చి షూటింగ్ ను…

ది గోట్ లైఫ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'సలార్' ఫేమ్, మాలీవుడ్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ది గోట్ లైఫ్'. తెలుగులో 'ఆడు జీవితం' పేరుతో విడుదలయింది. ఈ సినిమాలో అమలాపాల్ కథానాయికగా నటించగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళంలో నిర్మించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేసింది.

నార్త్ అమెరికాలో హవా కొనసాగిస్తోన్న కల్కి
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా టాలీవుడ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించగా.. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. ఇంకా మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ధనుష్ రాయన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా ధనుష్. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై ఆసక్తి పెరగడానికి కారణం ధనుషే స్వయంగా ఈసినిమాకు దర్శకత్వం చేయడమే కారణం. ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ జులై 26న విడుదల కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోష్స్ లో జోరు పెంచారు మేకర్స్.

బచ్చలమల్లి-మా ఊరి జాతరలో సాంగ్ ప్రోమో రిలీజ్
అల్లరి నరేష్ నుండి రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమా బచ్చలమల్లి. ఈ మూవీలో తన మేకోవర్ ను పూర్తిగా మేర్చేశాడు అల్లరి నరేష్. ఫుల్ మాస్ అవతార్ లో ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మరోపక్క అప్పుడప్పుడు ఈసినిమా నుండి అప్ డేట్లను ఇస్తూ వస్తున్నారు.

నేడు డార్లింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాజరవనున్న హీరో నాని
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'డార్లింగ్'. 'వై దిస్ కొలవరి?' అనేది టాగ్ లైన్‌గా ఉంది. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ భామ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బ్రహ్మనందం, అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్, విష్ణు, కృష్ణతేజ, శివారెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది.

కన్నప్ప లో శరత్ కుమార్ రోల్ ఇదే..!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ ‘భక్త కన్నప్ప’ సినిమాను రీమేక్ చేయాలనే విష్ణు మంచు కోరిక మేరకు ఇది రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు నటిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాకు మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.

ఇంట్రెస్టింగ్ గా కిరణ్ అబ్బవరం క మూవీ టీజర్ రిలీజ్
రాజావారు రాణివారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. అంతేకాదు చాాలా తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో బిజీ హీరో కూడా అయిపోయాడు. పెద్ద పెద్ద బ్యానర్ లలో సైతం సినిమా అవకాశాలను దక్కించుకున్నాడు. ఈమధ్య వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఒక మోస్తరు హిట్ ను అయితే అందుకున్నాడు తప్పా సాలిడ్ హిట్ ను అయితే అందుకోలేకపోయాడు. ఇప్పుడు కొంత గ్యాప్ తరువాత ఒక సినిమాతో వస్తున్నాడు. సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా రాబోతుంది.

డబుల్ ఇస్మార్ట్ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడానికి కారణం ఇస్మార్ట్ శంకర్ సినిమానే కారణం. ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అందించడం వల్లనే డబుల్ ఇస్మార్ట్ తెరపైకి తీసుకొచ్చారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా రామ్ ఫుల్ మాస్ అండ్ ఎనర్జిటిక్ పెర్ఫెమెన్స్ కు మంచి ప్రశంసలు దక్కాయి.