కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 88

nani saripodhaa sanivaaram movie teaser release date
ట్రైలర్ & టీజర్

సరిపోదా శనివారం-టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
sivakarthikeyan amaran movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

శివకార్తికేయన్ అమరన్ రిలీజ్ డేట్ పిక్స్

తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ఇక ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో రాజ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు శివ కార్తికేయన్. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Double Ismart getting huge hype
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్ హైప్ డబుల్

రామ్-పూరి జగన్నాథ్ ల మచ్ అవైటెడ్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. ఆగస్టు 15న పాన్ ఇండియా మూవీగా థియేటర్లోకి రానుంది. ఇక ఈసినిమా కు వున్న హైప్ ఒక్కసారిగా డబుల్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ కావడంలో సాంగ్స్ కూడా కీ రోల్ ప్లే చేశాయి. ఇప్పుడు ఈ సీక్వెల్ లో వున్న సాంగ్స్ కూడా హైప్ పెంచడానికి చాలా హెల్ప్ అవుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సాంగ్ స్టెప్పా మార్ తో సినిమాకు బజ్ పెరుగగా నిన్న రిలీజ్ చేసిన సెకండ్ సాంగ్ మార్ ముంతా చోడ్ చింతా హైప్ ను డబుల్ చేసింది

TFN Adminవాట్సాప్
nivetha thomas special glimpse out from 35 movie
ట్రైలర్ & టీజర్

35 మూవీ- నివేదా స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

ముందు నుండీ పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది టాలెంటెట్ యాక్ట్రస్ నివేద థామస్. అందుకే తన నుండి సినిమా వస్తుందంటే అందరూ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే నివేదా నుండి సినిమా వచ్చి చాలా రోజులైపోయింది. ఇప్పుడు గ్యాప్ తరువాత తన నుండి వస్తున్న సినిమా 35. చిన్న కథ కాదు అనేది ఈసినిమా క్యాప్షన్. ఇందులో నివేదా థామ‌స్ ఓ మ‌ధ్య త‌ర‌గతి గృహిణి పాత్ర‌లో క‌నిపిస్తోంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
allu sirish buddy movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

అల్లు శిరీష్ బడ్డీ- ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్

బన్నీ తరువాత అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. గౌరవం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. ఇక ఆ తరువాత నుండి పలు సినిమాలు చేస్తూ కెరీర్ ను కొననసాగిస్తున్నాడు. తన నుండి వచ్చిన చివరి సినిమా ఊర్వశివో..రాక్షసివో. ఆసినిమా తరువాత మరే సినిమాను ఇంతవరకూ రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా బడ్డీ. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది.

TFN Adminవాట్సాప్
bhaag saale video song out from darling movie
సాంగ్

డార్లింగ్ నుండి భాగ్ సాలే సాంగ్ రిలీజ్

అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా డార్లింగ్. చాలా గ్యాప్ తరువాత నభా నటేష్ ఈసినిమాతో రాబోతుంది. ఇక మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. వచ్చిన అప్ డేట్లను బట్టి ఇప్పటికే ఈసినిమా కథాంశం ఏంటో అర్థమైపోయింది. మల్టీ పర్సనాలిటీ ఉన్న భార్యతో ఆమె భర్త ఎలాంటి ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొన్నాడు అనేది ఈసినిమా కథ అని తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Bharateeyudu 2 trimmed by twelve Minutes
సినిమా వార్తలు

భారతీయుడు 2 రన్ టైం తగ్గింది

శంకర్ -కమల్ హాసన్ ల భారీ ప్రాజెక్ట్ ఇండియన్ 2 ఈనెల 12న థియేటర్లోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. అయితే ఆ తరువాత ఆశించిన స్థాయిలో వసూళ్లను దక్కించుకోలేకపోతుంది. ముఖ్యంగా రన్ టైం విషయంలో కంప్లైంట్స్ వచ్చాయి. దాదాపు 3గంటల నిడివితో థియేటర్లోకి రావడం తో స్లో అయిన ఫీలింగ్ తెప్పించింది. దాంతో ఇప్పుడు కొంచెం ట్రిమ్ చేశారు. దాదాపు 12నిమిషాల ఫుటేజీని కట్ చేశారు. తమిళ్ తోపాటు తెలుగు వెర్షన్ ను కూడా ట్రిమ్ చేశారు. ప్రస్తుతం ట్రిమ్ చేసిన వెర్షన్ ను ప్రదర్శిస్తున్నారు. మరి ఇకనుండైనా పుంజుకుంటుందో లేదో చూడాలి.

TFN Adminవాట్సాప్
first single update from ashwin babu shivam bhaje movie
సినిమా వార్తలు

శివం భజే-ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైమ్ ఫిక్స్

ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అశ్విన్ బాబు. తన కెరీర్ లో రాజు గారి గది లాంటి రేంజ్ లో మరొక హిట్ దక్కలేదని చెప్పొచ్చు. అయినా కూడా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు మరో ప్రయోగాత్మకమైన సినిమాతో వస్తున్నాడు. అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా రాబోతున్న సినిమా శివం భజే. శివుని నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఆగష్ట్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
2024 siima nominated movies list
సినిమా వార్తలు

సైమా 2024 నామినేషన్స్ అనౌన్స్ మెంట్

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) తన 12వ ఎడిషన్‌తో సౌత్ ఇండియన్ సినిమాలోని బెస్ట్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమౌతోంది. సైమా సౌత్ ఇండియన్ సినిమాకి నిజమైన ప్రతిబింబం, గ్లోబల్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫ్యాన్స్‌ని సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్‌కి కనెక్ట్ చేస్తుంది. సైమా 2024, 2023 క్యాలెండర్ ఇయర్ లో విడుదలైన చిత్రాల నుంచి నామినేషన్లను అనౌన్స్ చేసింది.

TFN Adminవాట్సాప్
siddhu jonnalagadda telusu kada movie regular shooting update
షూటింగ్ అప్‌డేట్

తెలుసు కదా రెగ్యులర్ షూటింగ్ అప్పటినుండే

ప్రస్తుతం సిద్దూ జొన్నలగడ్డ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. సిద్దూ సినీ కెరీర్ ను ప్రారంభించి ఎన్నో ఏళ్లు అవుతున్నా డీజే టిల్లు సినిమాతో మాత్రం ఒక్కసారిగా సూపర్ అప్పటివరకూ లేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఈఏడాది డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సిద్దూ. అందులో నీరజ కోన దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా కూడా ఉంది. ఇప్పటివరకూ స్టైలిష్ గా పనిచేసిన నీరజ ఈసినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతుంది. తెలుసు కదా అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది.

TFN Adminవాట్సాప్
Naveen Polishety suffered multiple fractures in his Right hand
సినిమా వార్తలు

గాయాలతో కనిపించిన యంగ్ హీరో

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి చాలా రోజుల తరువాత ఓ అప్డేట్ తో వచ్చాడు అయితే ఇదేదో సినిమా అప్డేట్ కాదు తన హెల్త్ అప్డేట్.దురదృష్టవ శాత్తు నా కుడి చేతికి తీవ్రమైన ఫ్రాక్చర్స్ అయ్యాయి అలాగే కాలికి కూడా గాయం అయ్యింది.డాక్టర్ల సలహాలతో తొందరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. దానికి కొన్ని నెలల సమయం పడుతుంది.త్వరలోనే మళ్ళీ స్క్రీన్ మీద కనిపించి మిమ్మల్ని అలరిస్తానని నవీన్ నోట్ ద్వారా తెలిపాడు.

TFN Adminవాట్సాప్
talented actor sj surya joins in karthis sardar2 movie
సినిమా వార్తలు

సర్దార్ 2 లోకి టాలెంటెడ్ నటుడు

తమిళ్ టాలెంటెడ్ నటుడు కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాలతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఖైదీ, సర్దార్, పొన్నియన్ సెల్వం ఇలా వరుసగా హిట్లను అందుకున్నాడు. అయితే ఈమద్య వచ్చిన జపాన్ సినిమా కాస్త నిరాశను మిగిల్చింది. ఇక ఈసినిమాను ఎప్పుడో అధికారింకగా ప్రకటించినా సెట్స్ పైకి మాత్రం ఇంతవరకూ తీసుకెళ్లలేదు. అయితే రీసెంట్ గానే ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
dhanush raayan movie trailer out now
ట్రైలర్ & టీజర్

రాయన్ ట్రైలర్ రిలీజ్

తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఈసినిమా రాయన్. ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. నార్త్ మద్రాస్‌ బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా వస్తోంది. ఈసినిమా ధనుష్ 50వ సినిమా కావడంతో సినిమాపై ఇంకా ఆసక్తి పెరిగింది. ఈసినిమా సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

TFN Adminవాట్సాప్
manakki manakki first single update from thangalaan movie
సినిమా వార్తలు

తంగలాన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైమ్ ఫిక్స్

వైవిథ్యమైన పాత్రలు చేయడంలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. ఆ విషయాన్ని ఇప్పటికే తన సినిమాల ద్వారా నిరూపించాడు కూడా. అందుకే విక్రమ్ సినిమా అంటే తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రస్తుతం సినీ లవర్స్ అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది విక్రమ్ నుండి వస్తున్న తంగలాన్ సినిమా కోసం. ఈసినిమా కోసం ఎంత ఈగర్ వెయిట్ చేశారో అంత ఆలస్యం అయింది. ఎట్టకేలకు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Nivetha Thomas' 35 Chinna Katha Kaadu Movie Update
సినిమా వార్తలు

నివేదా థామస్ 35 నుంచి రేపు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

ప్రముఖ మలయాళ నటి నివేదా థామస్ చాలాకాలం గ్యాప్‌ తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం '35 - చిన్న కథ కాదు'. తాజాగా ఈ మూవీ టైటిల్‌ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాతో నందకిశోర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఇటీవలే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, మూవీ టీజర్ రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Director Vetrimaaran's Vidudala Part 2 First Look Update
ఫస్ట్ లుక్

విడుదల పార్ట్ 2.. ఫస్ట్ లుక్ అప్‌డేట్

కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించగా.. ప్రముఖ కమెడియన్ టర్న్డ్ హీరో సూరి కథానాయకుడిగా చేసిన మొదటి చిత్రం 'విడుదలై'. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో ఈ సినిమా 'విడుదల' పేరుతో డబ్ అయింది. ఇక్కడా మంచి హిట్‌గా నిలిచింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను తెలుగులో అందించింది.

Srikanth Mవాట్సాప్
jagapathi babu starts his dubbing for ravi tejas mr bachchan movie
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్- జగ్గూభాయ్ డబ్బింగ్ మొదలు

మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ చేయగా ఈ ఏడాది అప్పుడే ఈగల్ అంటూ వచ్చేశాడు. ఈసినిమా డీసెంట్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటుండగా చిత్రీకరణ దాదాపు చివరి దశకు వచ్చింది. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఇంతవరకూ ప్రకటించలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా డబ్బింగ్ కు సంబంధించిన అప్…

TFN Adminవాట్సాప్
maar muntha chod chinta full song out from double ismart movie
సాంగ్

డబుల్ ఇస్మార్ట్- మార్ ముంతా చోడ్ చింతా ఫుల్ సాంగ్ రిలీజ్

పూరీ జగన్నాథ్-రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగష్ట్ 15 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా మాస్ ఎలిమెంట్స్ తో టీజర్ ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Kalki 2898 AD Director Nag Ashwin Met Fans at TCL Chinese Theatre
సినిమా వార్తలు

యూఎస్‌లో కల్కి స్క్రీనింగ్.. సందడి చేసిన నాగ్ అశ్విన్

టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బెనిఫిట్ షో నుంచే మ్యాసీవ్ రెస్పాన్స్‌ అందుకుంది.

Srikanth Mవాట్సాప్
Kichcha Sudeep's MAX Telugu Teaser Released
ట్రైలర్ & టీజర్

కిచ్చా సుదీప్ మ్యాక్స్ తెలుగు టీజర్ రిలీజ్

'ఈగ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మ్యాక్స్'. హై-ఆక్టేన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నాడు. వి క్రియేషన్స్‌ బ్యానర్‌పై కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, సుకృతా వాగ్లే, అనిరుధ్ భట్ తదితరులు నటిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా మహాబలిపురంలో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

Srikanth Mవాట్సాప్

షేర్