ఒక ఓటీటీ లోకి వచ్చేసిన హరోంహర

sudheer babu harom hara movie now streaming on aha

చాలా గ్యాప్ తరువాత హరోం హర సినిమాతో డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సుధీర్ బాబు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వచ్చిన సినిమా హరోం హర. కుప్పం నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఎన్నో అంచనాల నేపథ్యంలో జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఓటీటీ హక్కులను రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు దక్కించుకున్న సంగతి తెలిసిందే కదా. ఆహా ఇంకా ఈటీవీ విన్ వారు ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నారు. అయితే ఈసినిమాను ఆహాలో ముందు జులై 11వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ పలు కారణాలవల్ల ఈసినిమా ఆరోజు రిలీజ్ కాలేకపోయింది. కానీ ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈసినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరోవైపు ఈటీవీ విన్ లో ఈసినిమాను జులై18వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి థియేటర్లలో చూడటం మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

కాగా ఈసినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. సునీల్, రవి కాలే, రాజశేఖర్ అనింగి, కేషల్ దీపక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుమంత్‌ జీ నాయుడు నిర్మించగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం.. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.