తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన రీసెంట్ బ్లాక్ బాస్టర్ మూవీ మహారాజ ఓటిటిలో కూడా అదరగొడుతుంది. గత శుక్రవారం నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను తమిళ్ తోసహా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.దాంతో థియేటర్లలో ఈసినిమాను మిస్ అయిన వారు ఓటిటి లో చూసి యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.సాలిడ్ కంటెంట్ కి తోడు విజయ్ సేతుపతి యాక్టింగ్ సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈవారం నెట్ ఫ్లిక్స్ ఇండియాలో ఈసినిమా టాప్ వన్ ప్లేస్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత నెలలో థియేటర్లోకి వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.ప్రపంచ వ్యాప్తంగా 100కోట్లకు పైగా వసూళ్లను విజయ్ సేతుపతికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను ఇచ్చింది.ఇది తనకు50వ సినిమా కూడా.నిథిలిన్ స్వామి నాథన్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా అనురాగ్ కశ్యప్,మమతా మోహన్ దాస్,అభిరామి కీలక పాత్రల్లో నటించారు.అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు.
ఇక ఉప్పెన తరువాత విజయ్ సేతుపతి తెలుగులో మరో సినిమా ఒప్పుకోలేదు. అయితే త్వరలోనే స్ట్రెయిట్ తెలుగు మూవీ చేసే ఛాన్స్ వుంది.ప్రస్తుతం సేతుపతి తన 51వ సినిమా ఏస్ లో నటిస్తున్నాడు.అరుముగ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది.జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























