వరల్డ్ ఫోటోగ్రఫీ డే.. అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్

Megastar Chiranjeevi Shares His Father Old Pic on World Photography Day

ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ అరుదైన ఫొటోను పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఆయన తన తండ్రి పాత ఫోటో ఒకటి షేర్ చేశారు. ఈ ఫొటోలో చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు గారు బ్లాక్ గాగూల్స్‌ పెట్టుకుని సైకిల్ ప‌ట్టుకుని నిల్చుని ఉన్నారు. అయితే ఈ ఫోటోను చిరునే స్వయంగా తీయడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు ఎక్స్ వేదికగా.. “బ్లాక్ అండ్ వైట్ కెమెరా కాలంలో నేను మా నాన్నగారిని తీసిన ఫోటో ఇది.. అత‌డు హీరోలా ఉన్నాడు. నా అగ్ఫా కెమెరా ఇలాంటి అరుదైన మూమెంట్‌ని క్యాప్చర్‌ చేసింది. కష్టపడకుండా టైమ్ ట్రావెల్ చేసేందుకు ఫొటోస్ మా మిష‌న్స్” అని అందులో పేర్కొన్నారు.

ఇక ఇదిలావుంటే, చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా.. కునాల్ కపూర్, సురభి ,ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్‌ బ్యానర్ పై నిర్మాతలు విక్రమ్, వంశీ, ప్రమోద్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే యేడాది జనవరి 10 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.