కన్నప్ప.. ముఖేష్ రిషి, బ్రహ్మాజీ క్యారెక్టర్స్ రివీల్

Kannappa Mukesh Rishi and Brahmaji First Look Poster Released

ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ ‘భక్త కన్నప్ప’కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌ మూవీపై అంచనాలను పెంచేసింది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు నటిస్తుండటం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భక్తిరస ప్రధానంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తుండగా.. మలయాళ అగ్ర నటుడు మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, కాజల్, సీనియర్ నటి మధుబాల తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించడంతో పాటుగా సినిమాలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తుండటం విశేషం.

ఇక ఈ సినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే పలువురు నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేయగా.. తాజాగా కన్నప్ప చిత్రం నుంచి మేకర్స్ మరో సాలిడ్ అప్‌డేట్ అందించారు. సీనియర్ నటుడు ముఖేష్ రిషి ‘కంప‌డు’ మరియు బ్ర‌హ్మాజీ ‘గ‌వ్వ‌రాజు’ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా కంప‌డు పాత్ర‌కు సంబంధించిన వివ‌రాలు, అతడి అయుధం గురించి మేకర్స్ తెలిపారు. ఈ వివరాల ప్రకారం.. అత్యంత పురాత‌నమైన పుళిందుల అనే జాతి స‌దాశివ కొండ‌ల్లో నివ‌సిస్తూ ఉంటుంది. తరతరాలుగా వాయి లింగాన్ని సంర‌క్షించే బాధ్య‌త వంశ పారంప‌ర్యంగా వీరిపై ఉంటుంది. ఈ పుళింద జాతినే భ‌ద్ర గ‌ణం అని కూడా పిలుస్తుంటారు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి వున్నవారు. ఈ భ‌ద్ర గ‌ణం నాయ‌కుడే కంప‌డు. అలానే గ‌వ్వ‌రాజు ఈ భ‌ద్ర గ‌ణంలోని కీలక వ్యక్తి.

కాగా ఇప్పటికే కన్నప్ప తండ్రి ‘నాథనాథుడు’గా శరత్ కుమార్, చెంచుల మహారాణి ‘పన్నగ’గా మధుబాల, ‘ముండ‌డు’ అనే ఎరుక‌ల దొర పాత్ర‌లో సీనియ‌ర్ న‌టుడు దేవ‌రాజ్, భిల్ల జాతి అధినేత ‘చండుడు’ అనే పాత్రలో సంపత్ నటిస్తున్నట్టు మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే.. ఇక త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న కన్నప్ప సినిమాకు మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.