
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 107


అక్షయ్ కుమార్ 'సర్ఫిరా' రిలీజ్ డేట్ ఫిక్స్

స్వాగ్- రేజర్ అంటూ రానున్న స్పెషల్ వీడియో

లక్కీ భాస్కర్, తంగలాన్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్

అడివి శేష్ 'డకాయిట్' షూటింగ్‌లో జాయిన్ అయిన శృతి హాసన్

అఫీషియల్.. ముందుగానే వచ్చేస్తున్న దేవర

థగ్ లైఫ్ షూటింగ్‌లో ప్రమాదం.. స్టార్ నటుడికి గాయాలు

ఆర్ఆర్ఆర్ రికార్డుని బ్రేక్ చేసిన కల్కి 2898 AD

ప్రధాని మోదీ.. నాతో ఏం చెప్పారంటే? - మెగాస్టార్

దిశా పటానీకి బర్త్ డే విషెస్ తెలిపిన కల్కి టీమ్

హరోంహర నుంచి రిలీజ్ టీజర్ లాంఛ్

కన్నప్ప టీజర్ రిలీజ్ వేదిక ఫిక్స్

మెగాస్టార్, సూపర్‌స్టార్‌ల వద్దకు ప్రధాని మోదీ

కన్నప్ప టీజర్ రిలీజ్- విజువల్ ట్రీట్
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. ఇక ఎప్పటినుండో ఊరిస్తున్న ఈ సినిమా టీజర్ అయితే వచ్చేసింది. టీజర్ మాత్రం చాలా బాగుంది. కాలాముఖ వాయులింగాన్ని పెకలించి తీసుకురావడానికి పంపిన 50మందిని నీ తమ్ముడు టెంగనతో సహా అందరినీ చంపేశాడు అంటూ మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మంచు విష్ణు తిన్నడు పాత్రలో నటిస్తున్నాడు. ఇక విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. న్యూజిలాండ్ లోనే ఈసినిమా సింహ భాగాన్ని తీయాలని మేకర్స్ ఎందుకు అనుకున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. పచ్చని అందాలతో చాలా ఫ్రెష్ గా ఉన్నాయి విజువల్స్. యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. ప్రభాస్ కళ్ల…

అక్షయ్ కుమార్ 'సర్ఫిరా' రిలీజ్ డేట్ ఫిక్స్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్ఫిరా'. జాతీయ అవార్డు గ్రహీత సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే శాలినీ ఉషాదేవి, పూజా తోలానితో కలిసి సుధా కొంగర స్క్రిప్ట్‌ను అందించారు. కాగా ఈ చిత్రం సూర్య హీరోగా 2020లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'సూరారై పోట్రు'కి రీమేక్ కావడం విశేషం. డైరెక్ట్‌గా ఓటీటీలోకి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. తెలుగులో ఇది 'ఆకాశమే హద్దురా' పేరుతో విడుదలైంది. మరో విశేషమేంటంటే.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇందులో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఆయనతో పాటుగా ఈ చిత్రంలో రాధిక మదన్, పరేష్ రావల్, సీమా బిస్వాస్ కీలక పాత్రలు…

సుధీర్ బాబు హరోం హర రివ్యూ - యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా మాస్ ఆడియన్స్ కు, యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ లు, వైలెన్స్ మాత్రం యాక్షన్ లవర్స్ కి ఐ ఫీస్ట్ ను అందిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ఓ మంచి ఫీలింగ్ తో బయటకు రావచ్చు.

శ్రీవిష్ణు క్యారక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసిన స్వాగ్ టీమ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోలలో శ్రీవిష్ణు ఒకడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లే ఆయన కథల పరంగా కూడా విభిన్న చిత్రాలు చేయడంలో ముందుంటాడు. 'సామజవరగమన'తో గతేడాది సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. ఇటీవలే 'ఓం భీమ్ బుష్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి జోష్ మీదున్న శ్రీ విష్ణు ఇదే ఊపులో మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు.

స్ట్రీమింగ్ కు వచ్చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గోదావరి నేపథ్యంలో రూరల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో విశ్వక్ మరోసారి తన మాస్ నటనతో ఆకట్టుకున్నాడు. తన పాత్ర ఈసినిమా విజయానికి ప్రధానంగా నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

నితిన్ రాబిన్‌హుడ్‌లో హీరోయిన్‌గా స్టార్ యాక్ట్రెస్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు ఏక కాలంలో రెండు చిత్రాలను పట్టాలెక్కిస్తున్నాడు. వీటిలో ఒకటి శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'తమ్ముడు' కాగా, మరొకటి వెంకీ కుడుముల డైరెక్షన్‌లో రూపొందుతోన్న 'రాబిన్ హుడ్'. కాగా ఈ రెండు సినిమాలపై మంచి బజ్ ఉంది. ఇక నితిన్, వెంకీ కుడుముల ఇద్దరూ కలిసి ఇంతకుముందు 'భీష్మ' అనే సినిమా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

స్ట్రీమింగ్ కు వచ్చేసిన లవ్ మీ
ఆశిష్ రెడ్డి హీరోగా బేబి సినిమాతో క్రేజ్ ను సొంతం చేసుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా వచ్చిన సినిమా లవ్ మీ. లవ్ ప్లస్ హారర్ర నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలో కూడా సందడి చేయడానికి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా స్ట్రీమింగ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించారు. దీనిలో భాగంగానే ఈసినిమా నేటి నుండి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సినిమా రిలీజ్ అయిన మూడు వారాలకి ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చేయడం విశేషం. ప్రస్తుతానికి తెలుగులో ఈసినిమా అందుబాటులోకి వచ్చింది.

స్వాగ్- రేజర్ అంటూ రానున్న స్పెషల్ వీడియో
హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా స్వాగ్ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రాజరాజచోర సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. దీంతో ఈసినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈసినిమా నుండి రోజుకో అప్ డేట్ ఇస్తూ సినిమాపై క్రేజ్ ను పెంచేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి రేజర్ అన్న పేరుతో స్పెషల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు చిత్రబృందం.

లక్కీ భాస్కర్, తంగలాన్ ఫస్ట్ సింగిల్ అప్ డేట్
జీవి ప్రకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ్ లో, తెలుగులో పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను అందించాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో మోస్ట్ అవైటెడ్ సినిమాస్ లక్కీ భాస్కర్ ఇంకా తంగలాన్ సినిమాలు కూడా ఉన్నాయి. జీవీ ప్రకాష్ తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ఈసినిమాల గురించి స్పందిస్తూ.. లక్కీ భాస్కర్, తంగలాన్ సినిమాల ఫస్ట్ సింగిల్స్ రెడీ అయిపోయాయి.. ప్రొడ్యూసర్స్ కు కూడా హ్యాండ్ ఓవర్ చేశారను.. త్వరలోనే రెండు పాటలకు సంబంధించిన అప్ డేట్లు రానున్నాయి అంటూ తెలిపాడు.

అడివి శేష్ 'డకాయిట్' షూటింగ్‌లో జాయిన్ అయిన శృతి హాసన్
'మేజర్' సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందాడు టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్. ప్రస్తుతం ఆయన ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డకాయిట్’. అడివి శేష్ గతంలో నటించిన 'క్షణం', 'గూఢచారి'తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు డివోపీగా పనిచేసిన షానీల్ డియో ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి అడివి శేష్, షానీల్ డియో కథ స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా శేష్, శ్రుతి జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇదే.

అఫీషియల్.. ముందుగానే వచ్చేస్తున్న దేవర
టాలీవుడ్ యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ఆకట్టుకున్నాయి. మరోవైపు 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఇప్పటివరకు జూనియర్ నుంచి సినిమా రాలేదు. దీంతో దేవర సినిమా అప్‌డేట్స్ గురించి తారక్ ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్‌డేట్ వచ్చింది.

థగ్ లైఫ్ షూటింగ్‌లో ప్రమాదం.. స్టార్ నటుడికి గాయాలు
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ 'థగ్ లైఫ్'. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. కాగా పొన్నియిన్ సెల్వన్ 2 తరువాత లెజండరీ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న సినిమా ఇదే. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, త్రిష ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. యంగ్ హీరోలు శింబు, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్ మరియు పాపులర్ మాలీవుడ్ యాక్టర్ జోజు జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరిలో జరుగుతుంది. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ రికార్డుని బ్రేక్ చేసిన కల్కి 2898 AD
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD’. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా.. మరొక నటి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. గ్లోబల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.

ప్రధాని మోదీ.. నాతో ఏం చెప్పారంటే? - మెగాస్టార్
మెగా బ్రదర్స్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటామంతి.. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న విషయం. నేషనల్ మీడియాలో సైతం ఈ వార్తకు అధిక ప్రాధాన్యం లభించిందంటే అర్ధం చేసుకోవచ్చు ఇది ఎంత సెన్సేషన్ అయిందో. ఈ అపూర్వ సన్నివేశానికి వేదికైంది మాత్రం ఆంధ్రప్రదేశ్. బుధవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా మొత్తం 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు.

దిశా పటానీకి బర్త్ డే విషెస్ తెలిపిన కల్కి టీమ్
ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ నేడు పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు 'కల్కి 2898 AD' బృందం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా దిశా పటానీకి బర్త్ డే విషెస్ తెలిపిన కల్కి టీమ్.. మూవీలో ఆమె పేరుని రివీల్ చేసింది. "మా 'రాక్సీ' దిశా పటానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు" అని అందులో పేర్కొంది. సో.. దీనిని బట్టి కల్కిలో దిశా పటానీ పేరు రాక్సీ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఆమె ఓ కీలక రోల్ పోషించనుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ను గమనిస్తే ఇది అర్ధమవుతుంది.

హరోంహర నుంచి రిలీజ్ టీజర్ లాంఛ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరోంహర’. ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్ రవి కాలే, కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్, అర్జున్ గోవిందా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సుమంత్ జి.నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రం జూన్ 14న విడుదల కానుంది.

కల్కి బుజ్జిపై ఆనంద్ మహీంద్ర రైడింగ్.. వీడియో వైరల్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మరొక హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. వైజయంతి మూవీస్ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.

కన్నప్ప టీజర్ రిలీజ్ వేదిక ఫిక్స్
ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోవైపు విష్ణు మాత్రం షూట్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు.

ఒకే వేదికపై రజినీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్
ఇండియాలో సినిమా హీరోలు అంటే ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంటుంది. అదే దక్షిణాదిలో అయితే ఇక చెప్పనే అక్కరలేదు. స్టార్‌డమ్ ఉన్న ప్రతి నటుడికి లక్షల్లో అభిమానులు ఉంటారు. ఇక ఎప్పుడైనా ఏదయినా సందర్భంలో ఇద్దరు అగ్ర హీరోలు ఒకేచోట కనిపిస్తే వారి అభిమానులకు పండుగే. అలాంటిది ఒకే వేదికపై ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు అగ్ర తారలు కనిపిస్తే ఊహించుకోవడానికే వాహ్ అనిపిస్తుంది కదా.! అదే నిజమైతే ఆయా హీరోల ఫ్యాన్స్ ఆనందానికి హద్దే ఉండదు. ఇలాంటి సందర్భమే తాజాగా ఒకటి చోటుచేసుకుంది.

మెగాస్టార్, సూపర్‌స్టార్‌ల వద్దకు ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా మొత్తం 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి వద్ద అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.