కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2021

ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 106

సినిమా వార్తలు

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ సౌత్ 2020

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ సౌత్ 2020 లో టాలీవుడ్లో గెలుచుకున్న అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "జెర్సీ "ప్రేక్షకాదరణ పొంది ఘనవిజయం సాధించింది. "జెర్సీ "మూవీ బెస్ట్ ఫిల్మ్ గా అవార్డ్ గెలుచుకుంది. సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్ "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ"మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన హీరో నవీన్ పోలిశెట్టి బెస్ట్ యాక్టర్ గా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మొన్న మహేష్ - నేడు తలైవా

క్రికెట్ లో తన ఆటతో ఎలా మెప్పిస్తాడో.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే సందడి చేస్తున్నాడు డేవిడ్ వార్నర్. మొన్న మహేష్ 'మహర్షి' సినిమాలో సీన్స్ తో అదరగొట్టిన వార్నర్ ఇప్పుడు తలైవాగా మారిపోయాడు. రీ ఫేస్‌ యాప్‌ ద్వారా 'మహర్షి' సినిమాలో సూపర్‌స్టార్‌ మహేశ్‌గా మారి అభిమానులను ఆకట్టుకున్న వార్నర్ ఇప్పుడు రజినీ కాంత్ 'దర్బార్‌' సినిమాలో కొన్ని సన్నివేశాలకు రజినీకాంత్‌కు బదలు తన ఫేస్‌ను యాడ్ చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ఇక ఈ వీడియో ను పోస్ట్ చేస్తూ.. చాలా మంచి రిక్వెస్ట్‌ మేరకు ఇది చేశానని చెబుతూ అందరికీ న్యూ ఇయర్‌ శుభాకాంక్షలను తెలియజేశాడు.

TFN Adminవాట్సాప్
Vijaya Raghavan Movie Teaser To Be Out In 5 Different Languages,Vijaya Raghavan Movie,Vijaya Raghavan,Vijaya Raghavan Film,Vijaya Raghavan Teaser,Vijaya Raghavan Movie Teaser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood
ట్రైలర్ & టీజర్

5 భాషల్లో విజయ్ ఆంటోనీ 'విజయరాఘవన్' టీజర్ రిలీజ్

విభిన్నమైన సినిమాలు చేయడంలో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత మాత్రం ఉంటుంది. ‌ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోని. ‘తమిళరసన్‌’, ‘అగ్ని సిరగుగళ్‌’చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అంతేకాదు మరోసారి బిచ్చగాడు 2 తో రావడానికి సిద్దమయ్యాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బన్నీ, రానా కు 'బ్రహ్మీ' బహుమతి

నవ్వుల రారాజు బ్రహ్మీ కామెడీ గురించి కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. ఆయన నటన గురించి అందరికీ తెలుసు కానీ చిత్ర కారుడు అన్న విషయం మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. అయితే హాస్య కళతో పాటు బ్రహ్మీలో మరొక కళ కూడా ఉందన్న సంగతి ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. ఏదో చిత్రాలు వేసాం అన్నట్టు కాదు.. బ్రహ్మీ వేసిన చిత్రాలు చూస్తే ఆయనలో ఎంత ప్రతిభ ఉందో చెప్పొచ్చు. జీవం ఉట్టిపడేలా ఉన్నాయి ఆయన వేసిన చిత్రాలు చూస్తుంటే. చిత్రకళ పట్ల ఆయనకున్న తృష్ణ కనిపిస్తుంది. మొన్నామధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సమయంలో బ్రహ్మానందం రాముని వీర భక్తుడు 'ఆంజనేయుని ఆనంద భాష్పాలు' పేరుతో చిత్రం గీశారు. ఆ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"లక్ష్య "మూవీ అప్ డేట్

సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా విలు విద్య నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా "లక్ష్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో "రొమాంటిక్ "మూవీ ఫేమ్ కేతిక శర్మ కథానాయిక కాగా జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు . కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'రంగ్ దే' రిలీజ్ డేట్ ఫిక్స్

అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా 'రంగ్ దే' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్.. కరోనా కారణంగా కొన్ని నెలలు బ్రేక్ రాగా తిరిగి సెట్స్ పైకి వచ్చింది. ఇటీవలే ఈ సినిమా కూడా షూటింగ్‌ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాను మార్చి 26వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"ఆచార్య "మూవీ కి భారీ టెంపుల్ టౌన్ సెట్

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ గా "ఆచార్య" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా సోనూ సూద్ , సక్సెస్ ఫుల్ యాంకర్ అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సీనియర్ నటుడు 'నర్సింగ్ యాదవ్' కన్నుమూత

2020లో కరోనా వల్ల సినీ ఇండస్ట్రీకిభారీ నష్టం జరిగితే.. ఇక ఎంతో మంది సెలెబ్రిటీస్ ను కూడా బలిగొంది. చిన్న నటుల దగ్గర నుండి లెజెండరీ నటులవరకూ ఎంతో మంది మరణించారు. ఇక ఏడాది చివరి రోజు కూడా ఒక నటుడు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. ఆ నటుడు ఎవరో కాదు ఎన్నో తెలుగు సినిమాలో నటించిన నర్సింగ్ యాదవ్.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'క్రాక్ ట్రైలర్' - నో డౌట్‌.. ష్యూర్‌ షాట్‌

మొత్తానికి మాస్ మహారాజా రవితేజ అభిమానులకు న్యూ ఇయర్ కి మంచి ట్రీటే లభించింది అని చెప్పొచ్చు. రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమా త్వరలో థియేటర్స్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను ఇంకారెట్టింపు చేసింది అని చెప్పుడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి రవితేజ హిట్ కొట్టడం ఖాయం.. గతంలో పాత రవితేజ కనిపించాడు మళ్లీ ఈ సినిమాతో అన్న అభిప్రాయాలు వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అభినవ శకుంతల సమంత

గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో మహాభారతం ఆది పర్వం లోని శకుంతల -దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా "శాకుంతలం "మూవీ ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం" బ్లాక్ &వైట్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రణయకావ్యం గా రూపొందుతున్న "శాకుంతలం "మూవీ లో కథానాయికగా పలువురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Poll Game: Which Among These Is The Best Movie Of Actor Gopichand,Poll Game,#PollGame,TFN Poll Game,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Telugu Movie Updates,Gopichand,Actor Go
సినిమా వార్తలు

పోల్ గేమ్ : యాక్షన్ హీరో గోపీచంద్ బెస్ట్ మూవీ ?

ఈతరం ఫిల్మ్స్ బ్యానర్ పై ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "యజ్ఞం " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో గోపీచంద్ తీక్షణ లుక్స్ , బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డైలాగ్ డెలివరీ , కామెడీ టైమింగ్ తో గోపీచంద్ ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్
Mohan Babu Shares His Opinion On Rajinikanth Political Entry,Superstar Rajinikanth,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Rajinikanth,Hero Rajinikanth,Mohan Babu,Actor Moha
సినిమా వార్తలు

రజినీ పొలిటిల్ ఎంట్రీ పై మోహన్ బాబు రియాక్షన్

ఎంతో కాలంగా రజినీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అభిమానులతో పాటు అందరూ ఎదురుచూస్తున్నారు . అయితే ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్నానని.. డిసెంబ‌ర్ 31న త‌న పార్టీ పేరుని అనౌన్స్ చేస్తాన‌ని, జ‌న‌వ‌రిలో పార్టీని స్టార్ట్ చేస్తాన‌ని ఆయ‌న తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రోజు కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లోనే మరో ట్విస్ట్ ఇచ్చారు రజినీ. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభిచలేనంటూ ట్విట్టర్ వేదికగా ఒక లేఖను విడుదల చేశారు. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని .. తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను కోరారు. రాజకీయ ప్రకటనకు ముందు…

TFN Adminవాట్సాప్

షేర్