
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 78

రాజశేఖర్‌కి జోడీగా అమలా పాల్?

ఆవిరి మూవీ ఫస్ట్ లుక్ విడుదల
హిందీలోనూ విజయం అందుకున్న టాలీవుడ్ ఏజెంట్
అందాల అభినయం శ్రియ

ముందే వస్తున్న `అల వైకుంఠపురములో` టీజర్
పోరాట ఘట్టంలో `ఎంత మంచివాడవురా`
`ప్రతి రోజూ పండగే`... లేటెస్ట్ అప్‌డేట్

డే టూ గ్రాస్ లో బాహుబలి-2 ను బీట్ చేసిన 'సాహో'

మ్యూజికల్ హిట్ ‘ముద్దుల ప్రియుడు’కు పాతికేళ్ళు

విక్రమ్ వేద రీమేక్ లో..!

పరుశురాంతో మహేష్ సినిమా అంతా ఫేక్ న్యూసే..!

శ్రద్ధా కపూర్ మనసులోని కోరిక

RRRమూవీ లో యంగ్ "టైగర్" ఫైట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ RRR 2020 సంవత్సరం జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ కొమరంభీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఒక కథానాయికగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
రాజశేఖర్‌కి జోడీగా అమలా పాల్?
తమిళ అనువాద చిత్రం `ప్రేమఖైదీ`(2011)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కేరళకుట్టి అమలా పాల్. ఆపై `బెజవాడ`, `నాయక్`, `ఇద్దరమ్మాయిలతో`, `జెండాపై కపిరాజు` వంటి స్ట్రయిట్ తెలుగు పిక్చర్స్‌లో హీరోయిన్‌గా నటించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... దాదాపు నాలుగేళ్ళ తరువాత మరో తెలుగు చిత్రానికి సంతకం చేసిందట. అంతేకాదు.. గత నాలుగు చిత్రాల్లో యువ కథానాయకులతో ఆడిపాడిన అమల... ఈ సారి ఓ సీనియర్ హీరో పక్కన కనువిందు చేయనుందట. ఆ హీరో మరెవరో కాదు.. డా.రాజశేఖర్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కనున్న కన్నడ రీమేక్‌లో నాయిక పాత్ర కోసం అమలా పాల్ పేరుని…

ఆవిరి మూవీ ఫస్ట్ లుక్ విడుదల
విభిన్న కథాంశాలతో మూవీస్ రూపొందించే రవిబాబు దర్శకత్వం లో మరో ప్రయోగాత్మక మూవీ ఆవిరి రూపొందింది. అల్లరి మూవీ తో సినీకెరీర్ ప్రారంభించిన రవిబాబు దర్శకత్వం వహించిన అమ్మాయిలు అబ్బాయిలు, నచ్చావులే, మనసారా, అవును వంటి మూవీస్ విజయం సాధించాయి. తక్కువ బడ్జెట్ తో మూవీస్ రూపొందించే రవిబాబు కు టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఉంది. రవిబాబు తన కొత్త సినిమా ఆవిరి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులలో మూవీ పై ఆసక్తి కలిగేలా చేశారు.
హిందీలోనూ విజయం అందుకున్న టాలీవుడ్ ఏజెంట్
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు నవీన్ పొలిశెట్టి. మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ టాలెంటెడ్ హీరో... తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఈ సారి తెలుగు చిత్రంతో కాదు ఓ హిందీ చిత్రంతో ఈ సక్సెస్ చూశాడు నవీన్. ఆ చిత్రమే `ఛిఛోరే`. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో... హీరో ఫ్రెండ్స్‌లో ఒకడిగా కనిపించాడు నవీన్. కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో యాసిడ్ పాత్రలో తనదైన కామెడీ టైమింగ్‌తో ఉత్తరాది ప్రేక్షకులను అలరిస్తున్నాడు మన ఏజెంట్…
అందాల అభినయం శ్రియ
శ్రియా శరన్... ఈ పేరు చెబితే చాలు వేసవికాలం వెన్నెలలా, సంక్రాంతి ముగ్గులా పొందికగా ఉండే అందమైన రూపం కళ్ళ ముందు కదలాడుతుంది. కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా పెర్‌ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రల్లోనూ మెప్పించిన వైనం శ్రియ సొంతం. `ఇష్టం`(2001)తో నటనకు శ్రీకారం చుట్టిన శ్రియ... ఆపై తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, ఆంగ్ల భాషా చిత్రాల్లో నటిస్తూ తనదైన బాణీతో ముందుకు సాగింది.

ముందే వస్తున్న `అల వైకుంఠపురములో` టీజర్
`నా పేరు సూర్య` తరువాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... ప్రస్తుతం ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న `అల వైకుంఠపురములో`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. టబు, నివేదా పెతురాజ్, సుశాంత్, నవదీప్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7న రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. తాజా…

హిందీ సూపర్ హిట్ మూవీ రీమేక్ కు చైతు గ్రీన్ సిగ్నల్..?
మజిలీ సినిమాతో మంచి హిట్ కొట్టిన నాగచైతన్య ఇప్పుడు ప్రస్తుతం 'వెంకీమామ' షూటింగులో బిజీగా వున్నాడు. ఇక ఈ సినిమా సెట్స్ పై ఉండగానే శేఖర్ కమ్ములతో మరో సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ హైద్రాబాద్ లో నిన్ననే ప్రారంభించింది. ఇక ఈ సినిమా తరువాత ఆయన అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి.
పోరాట ఘట్టంలో `ఎంత మంచివాడవురా`
ఈ సంవత్సరం ఆరంభంలో `118`తో థ్రిల్ చేసిన నందమూరి కళ్యాణ్ రామ్... ప్రస్తుతం `ఎంత మంచివాడవురా`తో బిజీగా ఉన్నాడు. `శతమానం భవతి` ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్‌కి జోడీగా మెహరీన్ నటిస్తుండగా... గోపీసుందర్ బాణీలు అందిస్తున్నాడు. శివలెంక కృష్ణప్రసాద్, ఉమేష్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన తాజా షెడ్యూల్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవల కళ్యాణ్ రామ్, నటాషా దోషిపై ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించిన యూనిట్... ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బృందంపై పోరాట ఘట్టాన్ని తెరకెక్కించే పనిలో…
`ప్రతి రోజూ పండగే`... లేటెస్ట్ అప్‌డేట్
మెగా హీరో సాయితేజ్, యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి ఫస్ట్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం `ప్రతి రోజూ పండగే`. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్, జీఎ2 పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం థమన్ స్వరాలు అందిస్తున్నాడు.
నెక్ట్స్ షెడ్యూల్‌కి ముస్తాబవుతున్న బాలయ్య కొత్త చిత్రం
`యన్టీఆర్` బయోపిక్ తరువాత స్వల్ప విరామం తీసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ... ప్రస్తుతం కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలయ్యకి జోడీగా సోనాల్ చౌహాన్, వేదిక నాయికలుగా నటిస్తుండగా... భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
రీమిక్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న శ్రీదేవి పాపులర్ సాంగ్స్
శ్రీదేవి... అందానికి, అభినయానికి ఐకాన్‌లా నిలచిన ఓ తరం అగ్ర కథానాయిక. ఆల్ ఇండియా సూపర్‌స్టార్ అనిపించుకున్న శ్రీదేవికి సంబంధించి ఆమె పోషించిన పాత్రలే కాదు నర్తించిన గీతాలు కూడా నిత్యనూతనమే. అంతేకాదు... ఈ తరం కథానాయికలకు మార్గదర్శకురాలిగా నిలచిన శ్రీదేవిని దృష్టిలో పెట్టుకుని... ఇప్పటికే కొంతమంది టాలీవుడ్, బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమె పాటలను రీమిక్స్ చేయగా... తాజాగా మరికొంతమంది ఇదే బాటలో నడుస్తున్నారు. ముఖ్యంగా... ఈ ఏడాదినైతే శ్రీదేవి రీమిక్స్ నామ సంవత్సరం అనొచ్చేమో. ఎందుకంటే... శ్రీదేవి నర్తించిన మూడు పాటలు రీమిక్స్ రూపంలో సందడి చేస్తున్నాయి.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అంధాధున్’ రీమేక్‌లో నితిన్?
‘అంధాధున్’... గత ఏడాది హిందీనాట కాసుల వర్షం కురిపించిన బాలీవుడ్ మూవీ. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ... పలు ప్రాంతీయ పురస్కారాలతో పాటు తాజాగా మూడు జాతీయ అవార్డులను కూడా కైవసం చేసుకుంది. అలాంటి నేపథ్యం ఉన్న ఈ చిత్రాన్ని... తమిళంలో ప్రశాంత్ హీరోగా రీమేక్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా... తెలుగులోనూ ఈ సినిమాని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. తాజా సమాచారం ప్రకారం... `అంధాధున్` తెలుగు రీమేక్ రైట్స్‌ను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఫ్యాన్సీ రేట్‌తో సొంతం…

సాహు గురించి ప్రభాస్ అభిమానులు చదవ వలసిన పాజిటివ్ కోణం
ఆగస్ట్ 30 న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదలైన ప్రభాస్ 'సాహో'చిత్రం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత ,తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కోశాధికారి తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆ చిత్రం పై వాట్సప్ ద్వారా పంపిన తన అభిప్రాయం ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా ప్రభాస్ ఫాన్స్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అవుతుంది.

డే టూ గ్రాస్ లో బాహుబలి-2 ను బీట్ చేసిన 'సాహో'
"తాడెక్కే వాడొకడుంటే... వాడి తల తన్నేవాడొకడు"- అన్నట్లు చరిత్రలో ఎప్పటికప్పుడు సరికొత్త సంచలనాలు సృష్టించే వాళ్లు పుడుతూనే ఉంటారు. అలాగే చరిత్రలో సరికొత్త రికార్డులు కూడా ఎప్పటికప్పుడు సరికొత్తగా పుట్టుకొస్తూనే ఉంటాయి. నిన్నటి వరకు సినిమా రికార్డుల పరంగా చూస్తే “ బాహుబలి -2” సృష్టించిన రికార్డుల దరిదాపులకు కూడా వేరే సినిమాలేవి చేరుకోలేదు అన్నది నిజం. కాగా ఇప్పుడు తన రికార్డును తానే అధిగమిస్తూ రెబల్ స్టార్ ప్రభాస్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒక సరికొత్త రికార్డును సెట్ చేశాడు.

మ్యూజికల్ హిట్ ‘ముద్దుల ప్రియుడు’కు పాతికేళ్ళు
‘విక్టరీ’ వెంకటేష్ కెరీర్‌లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘ముద్దుల ప్రియుడు’ ఒకటి. 'కలియుగ పాండవులు', ‘కూలీ నెం.1’, ‘సుందరకాండ’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత ‘విక్టరీ’ వెంకటేష్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమిది. రమ్యకృష్ణ, రంభ నాయికలుగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో... కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, కోట శ్రీనివాసరావు, అలీ, బ్రహ్మానందం, సుత్తివేలు, బాబూమోహన్, అన్నపూర్ణ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. హాలీవుడ్ మూవీ ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’(1965) స్ఫూర్తితో ఈ సినిమా రూపొందింది.

విక్రమ్ వేద రీమేక్ లో..!
విలక్షణ దర్శకుడు వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో రవి తేజ డిస్కో రాజా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా రవితేజ తన తర్వాత సినిమాను సుధీర్ వర్మతో చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే స్ట్రైట్ మూవీ కాదు ఓ సూపర్ హిట్ తమిళ్ మూవీ రీమేక్ ను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా? తమిళంలో సూపర్ హిట్టయిన `విక్రమ్‌వేద`.

పరుశురాంతో మహేష్ సినిమా అంతా ఫేక్ న్యూసే..!
రీసెంట్ గా మహర్షి సినిమాతో మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

శ్రద్ధా కపూర్ మనసులోని కోరిక
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించిన ఆషికి 2, ఏక్ విలన్, ABCD 2, బాఘీ, స్త్రీ, బట్టి గుల్ మీటర్ చాలూ మూవీస్ ఘనవిజయం సాధించాయి. తెలుగు, తమిళ, హిందీ భాషలలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన సాహో మూవీ తో తెలుగు, తమిళ ప్రేక్షకులకు శ్రద్ధా కపూర్పరిచయమవుతున్నారు. సాహో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో శ్రద్ధా కపూర్ తన మనసులోని కోరికను వెల్లడించారు.

ఏదైనా జరగొచ్చు తెలుగు మూవీ రివ్యూ
ఈ సినిమాలకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. శ్రీకాంత్ పెండ్యాల సంగీతం పర్వాలేదనిపిస్తుంది. అయితే తన మార్క్ చూపించలేకపోయడని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

హవా తెలుగు మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లు ఈ సినిమా నచ్చుతుందని చెప్పొచ్చు.