మజిలీ సినిమాతో మంచి హిట్ కొట్టిన నాగచైతన్య ఇప్పుడు ప్రస్తుతం ‘వెంకీమామ’ షూటింగులో బిజీగా వున్నాడు. ఇక ఈ సినిమా సెట్స్ పై ఉండగానే శేఖర్ కమ్ములతో మరో సినిమా చేస్తున్నాడు. దీని షూటింగ్ హైద్రాబాద్ లో నిన్ననే ప్రారంభించింది. ఇక ఈ సినిమా తరువాత ఆయన అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది. గత ఏడాది అక్టోబర్లో వచ్చిన ‘బదాయి హో’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో చేయడానికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. బోనీకపూర్ తో కలిసి ఆయన ఈ రీమేక్ ను నిర్మించనున్నాడని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: