ప్రముఖ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచామవుతూ తెరకెక్కిన సినిమా ‘ఏదైనా జరగొచ్చు’. వెట్ బ్రెయిన్ ఎంటర్ టైన్ మెంట్, సుధర్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై కే. రమాకాంత్ దర్శకత్వంలో విజయ్ రాజా హీరో గా రూపొందిన ఈ కామెడీ హర్రర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్న సినిమా ప్రేక్షుకులకు ఎంత వరకూ నచ్చిందో? అసలు ఏం జరిగిందో? తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు – విజయ్ రాజా, పూజ సోలంకి, సాషా సింగ్, బాబీ సింహా, నాగేంద్రబాబు
డెరెక్టర్ – కే. రమాకాంత్
బ్యానర్స్ – వెట్ బ్రెయిన్ ఎంటర్ టైన్ మెంట్, సుధర్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్
నిర్మాత : సుదర్శన్ హనగోడు
సంగీతం – శ్రీకాంత్ పెండ్యాల
కథ:
ఓ ప్రైవేట్ సంస్థలో రికవరీ ఏజెంట్‌గా చేరతాడు జై (విజయ్ రాజా). అలా జాబ్ లో చేరిన జై కి శశిరేఖ(పూజ సోలంకి) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అలా వారి పరిచయంలో శశిరేఖకు ఉన్న ఇబ్బందుల గురించి తెలుసుకొని ఆమెకు ఎలాగైనా సాయం చేయాలనుకుంటాడు. దీనికోసం ఈజీ గా డబ్బు సంపాదించే మార్గం కోసం అలోచించి ఆఖరికి.. కాళీ(బాబీ సింహా) అనే రౌడీ దగ్గర క్రికెట్ బెట్టింగ్ లో డబ్బు పెడతాడు. అలా బెట్టింగ్లో డబ్బు పెట్టి సమస్యల్లో చిక్కుకుంటాడు. ఈ క్రమంలో కాళీ జీవితంలో ఎవరికీ తెలియని ఓ రహస్యం గురించి జై కి అతని స్నేహితులకు తెలుస్తుంది. జైకి తెలిసిన ఆ రహస్యం ఏంటి..? కాళీ నుంచి జై అతని స్నేహితులు ఎలా తప్పించుకున్నారు? కాళీ వల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
టాలీవుడ్‌లో విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసిన శివాజీ రాజా తన తనయుడిని ఈ సినిమా తో తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఇక విజయ రాజా విషయానికి వస్తే.. తనకు మొదటి సినిమా అయినా కూడా పరవాలేదనిపించాడు. కామెడీ, లవ్ సీన్స్‌లో బాగానే ఆకట్టుకున్నాడు. అయితే మొదటి సినిమా కాబట్టి కొన్ని కొన్ని సన్నివేశాల దగ్గర కాస్త ఇబ్బంది పడినట్టు అనిపిస్తుంది. కాస్త అనుభవం వస్తే నటనలో ఇంకాస్త పరిణతి కనిపిస్తుంది. ఇక విజయ్ రాజా స్నేహితులుగా చేసిన రాఘవ, రవి శివ తేజ మొదటి సగంలో చక్కని వినోదాన్ని పంచడంతో పాటు, రెండవ భాగంలో వచ్చే సీరియస్ సన్నివేశాల్లో కూడా నటనతో ఆకట్టుకుంటారు. హీరోయిన్‌గా పూజా సోలంకి గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంది. తనది పెద్దగా ప్రాధ్యానత ఉన్న పాత్ర కాకపోయినా.. సెకండ్ హాఫ్‌లో వెన్నెల కిశోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు
ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ బాబీ సింహా. బాబీ సింహా విలనిజం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాళీ పాత్రకు బాబీ సింహా సరిగ్గా సరిపోయాడు. సీరియస్ లుక్‌లో మంచి విలనిజం చూపించాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఆయన నటన మరింతగా ఆకట్టుకుంటుంది.
డైరెక్టర్ విషయానికివస్తే.. తను తీసుకున్న లైన్ పాతదే అయినా.. మేకింగ్ మాత్రం ఆకట్టుకునే విధంగానే వుంది. ఈ విషయంలో మంచి మార్కులే పడ్డాయి. అయితే.. ఆసక్తికరంగా సినిమాను ప్రారంభించినా తరువాత రొటీన్ సన్నివేశాలతో బోర్ కొట్టించాడు. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ద్వితీయార్థంపై ఆసక్తికలిగేలా చేసాడు.
ఈ సినిమాలకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. శ్రీకాంత్ పెండ్యాల సంగీతం పర్వాలేదనిపిస్తుంది. అయితే తన మార్క్ చూపించలేకపోయడని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
[wp-review id=”27433″]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























