డే టూ గ్రాస్ లో బాహుబలి-2 ను బీట్ చేసిన ‘సాహో’

Latest Telugu Movies News, Must Read Story for Prabhas Fans About Saaho, Saaho Beats Baahubali 2 with Day 2 Gross, Saaho Collections, Saaho Movie Area Wise Box Office Collections, Saaho Movie Collections, Saaho Movie Two Days Collections, Saaho Movie Updates, Saaho Movie World Wide Collections, Saaho Telugu Movie Collections, Saaho Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates

“తాడెక్కే వాడొకడుంటే… వాడి తల తన్నేవాడొకడు”- అన్నట్లు చరిత్రలో ఎప్పటికప్పుడు సరికొత్త సంచలనాలు సృష్టించే వాళ్లు పుడుతూనే ఉంటారు. అలాగే చరిత్రలో సరికొత్త రికార్డులు కూడా ఎప్పటికప్పుడు సరికొత్తగా పుట్టుకొస్తూనే ఉంటాయి. నిన్నటి వరకు సినిమా రికార్డుల పరంగా చూస్తే
“ బాహుబలి -2” సృష్టించిన రికార్డుల దరిదాపులకు కూడా వేరే సినిమాలేవి చేరుకోలేదు అన్నది నిజం. కాగా ఇప్పుడు తన రికార్డును తానే అధిగమిస్తూ రెబల్ స్టార్ ప్రభాస్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒక సరికొత్త రికార్డును సెట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాధారణంగా ఒక తెలుగు సినిమా జయాపజయాల పరిధిని, రేంజిని డిసైడ్ చేసేవి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కలెక్షన్సే. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డులను బట్టే ఆయా స్టార్ హీరోల అభిమానులు కాలర్ ఎగరేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇప్పటివరకు రెండవ రోజు కలెక్షన్స్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా” బాహుబలి 2″ రికార్డ్ నెలకొల్పింది. ఆ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రెండు రోజులకుగాను 29 లక్షల 18 వేల 206 రూపాయల గ్రాస్ చేయగా ఈ మూడేళ్లలో ఆ రికార్డును ఏ సినిమా క్రాస్ చేయలేదు.కాగా ఇప్పుడు సాహో తో తను సృష్టించిన రికార్డును తానే క్రాస్ చేస్తూ క్రాస్ రోడ్ బాహుబలిగా సరికొత్త రికార్డు సృష్టించారు ప్రభాస్. ఆగస్ట్ 30 న విడుదలైన” సాహో” ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రెండు రోజులకు గాను 29,99,722 రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త సంచలనం సృష్టించింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తన రికార్డును తానే అధిగమించిన స్టార్ గా సంచలనం సృష్టించాడు ప్రభాస్.
ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా 10 వేల థియేటర్లలో ప్రతిష్టాత్మకంగా విడుదలైన సాహో రెండు రోజుల్లో
205 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి విమర్శకుల నోళ్లకు తాళాలు వేసింది. ఈ సినిమాకు తొలి రోజున వచ్చిన టాక్ కు ఈ రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ కు ఏమాత్రం పొంతన లేకపోవడం ట్రేడ్ పరిశీలకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంత డివైడ్ టాక్ వచ్చిన సినిమాకు ఇంత నమ్మశక్యం కాని కలెక్షన్స్ రావడం ఏమిటా అని ఫిలిం ట్రేడ్, క్రిటిక్స్ తమ విమర్శలను తిరిగి విశ్లేషించుకుంటున్నారు. ప్రముఖ నేషనల్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ తొలిరోజు ఇచ్చిన రివ్యూకు మరుసటి రోజున ఇచ్చిన కలెక్షన్ రిపోర్టుకు పొంతన లేదు. ఇది దేశవ్యాప్తంగా ప్రభాస్ కు ఉన్న అవుట్ స్టాండింగ్ పాపులారిటీకి నిదర్శనం అని ఆయన పేర్కొనడం విశేషం.

మొత్తం మీద తన బాహుబలి రికార్డును తానే అధిగమించిన ‘మహాబలి’ ప్రభాస్ అని అభిమానులు మురిసిపోతున్నారు. మొదటిరోజు టాక్ తో కొంత నిరుత్సాహపడిన ప్రభాస్ అభిమానులు ఈ కలెక్షన్ల సునామీ చూసి తెగ సంబరపడిపోతున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 10 =