విక్రమ్ వేద రీమేక్ లో..!

Vikram Vedha Goes To Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Latest Updates,Vikram Vedha Movie Updates,Vikram Vedha Movie Latest News,Vikram Vedha To Be Remade In Telugu,Vikram Vedha Telugu Remake Cast,Balakrishna and Rajasekhar to act in Telugu remake of Vikram Vedha,Mass Maharaja Ravi Teja To Act In A Remake Movie

విలక్షణ దర్శకుడు వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో రవి తేజ డిస్కో రాజా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా రవితేజ తన తర్వాత సినిమాను సుధీర్ వర్మతో చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే స్ట్రైట్ మూవీ కాదు ఓ సూపర్ హిట్ తమిళ్ మూవీ రీమేక్ ను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా? త‌మిళంలో సూప‌ర్ హిట్ట‌యిన `విక్ర‌మ్‌వేద‌`.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మాధ‌వ‌న్‌, విజ‌య్‌సేతుప‌తి కంబినేషన్లో తెరకెక్కిన ‘విక్రమ్ వేద’ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ విక్ర‌మ్‌గా మాధ‌వ‌న్‌, గ్యాంగ్‌స్ట‌ర్ వేద పాత్ర‌లో విజ‌య్‌సేతుప‌తి న‌టించారు. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ రీమేక్ తెర‌కెక్కుతుంద‌ట‌. ప్ర‌స్తుతం తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్లు సుధీర్ వ‌ర్మ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నార‌ట‌. క‌థ ప్ర‌కారం విక్ర‌మ్‌, వేద పాత్ర‌ల ఢీ అంటే ఢీ అనేలా ఉంటాయి. తెలుగు రీమేక్‌లో పోలీస్ ఆఫీస‌ర్ విక్ర‌మ్‌గా ర‌వితేజ క‌న‌ప‌డ‌తార‌ట‌. మరో హీరోను ఎంపిక చేయాల్సివుంది. ఒరిజినల్ వెర్షన్ ను నిర్మించిన వై నాట్ స్టూడియోస్ ఈ రీమేక్ ను కూడా నిర్మించనుంది. మ‌రి గ్యాంగ్‌స్టర్ వేద పాత్ర‌ను ఎవ‌రో చేయ‌బోతున్నారో వేచి చూడాలి. ప్ర‌స్తుతం `డిస్కోరాజా` చిత్రీక‌ర‌ణ‌లో ర‌వితేజ.. ఈ సినిమా ను పూర్తి చేసి, విక్రమ్ వేద రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఆఫిషియల్ గా ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.