
ట్యాగ్ · 1431 కథనాలు · పేజీ 15


బాలయ్య, చరణ్, సినిమాలు కూడా బాగా ఆడాలి

మెకానిక్ రాకీ.. నాకు చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్

సంక్రాంతికి వస్తున్నాం.. రిలీజ్ డేట్ ఫిక్స్

జీబ్రా స్నీక్ పీక్ చూశారా?

మహారాజ.. చైనాలో భారీ రిలీజ్

ఇకపై రివ్యూస్ బ్యాన్

RAPO22లో హీరోయిన్ ఫిక్స్

విడిపోతున్న ఏఆర్ రెహమాన్-సైరా దంపతులు

రామ్ పోతినేని 22 లాంచ్ డేట్ ఫిక్స్

బచ్చల మల్లి రిలీజ్ డేట్ ఫిక్స్

శివ కార్తికేయన్ రేర్ ఫీట్

రామ్ నెక్స్ట్ మూవీ లాంచ్
ఉస్తాద్ రామ్ పోతినేని 22 వ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.ఈ చిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

బాలయ్య, చరణ్, సినిమాలు కూడా బాగా ఆడాలి
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి 'సంక్రాంతికి వస్తున్నాయ్' కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ట్రైయాంగిల్ స్టొరీ సంక్రాంతికి వస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

20 ఏళ్ల తర్వాత ఇద్దరు సూపర్ స్టార్స్ కలయికలో మూవీ
మలయాళ సినిమా చరిత్రను తిరగరాయడానికి సిద్ధంగా ఉన్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ తాజాగా ప్రారంభమయింది. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం రెండు దశాబ్దాల తర్వాత మమ్ముట్టి, మోహన్‌లాల్‌లను స్క్రీన్స్ పైకి తీసుకువచ్చింది. దీంతో ఇది పాన్ ఇండియా మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవనుంది. కాగా ఈ చిత్రంలో ఈ ఇద్దరు లెజెండ్స్‌తో పాటు మరికొందరు స్టార్ తారాగణం భాగం అవుతోంది.

మెకానిక్ రాకీ.. నాకు చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్
'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మెకానిక్ రాకీ'. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఫస్ట్ గేర్, ట్రైలర్స్, సాంగ్స్‌తో సినిమా హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

నెట్ ఫ్లిక్స్ లోకి బఘీర
ఈ దీపావళికి కన్నడ స్టార్ శ్రీమురళి యాక్షన్ ఎంటర్టైనర్ బఘీరతో వచ్చాడు.ఈసినిమా తెలుగు లోకూడా రిలీజ్ అయ్యింది.స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించడంతో ఈసినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.అయితే బఘీర ఆ అంచనాలను అందుకోలేకపోయింది.కన్నడలో మాత్రం సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటిలోకి వస్తుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈ రోజు రాత్రి 12గంటల నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.కన్నడ తో పాటు తెలుగు , మలయాళ ,తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

సూర్య 44 లో శ్రీయ
తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో సూర్య 44 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సూర్య తన పాత్ర తాలూకు షూటింగ్ కూడా పూర్తి చేశాడు.ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.సూర్య లుక్ కూడా డిఫ్రెంట్ గా ఉండనుంది.ఇప్పటివరకు ఈసినిమా నుండి గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు.దీనికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది.ఈసినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తుంది.ఇక స్పెషల్ సాంగ్ కోసం శ్రీయను కూడా తీసుకున్నారు.దాని తాలూకు షూటింగ్ కూడా పూర్తి చేసింది.ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని అందరికి నచ్చుతుందని శ్రీయ చెప్పుకొచ్చింది.

గేమ్ ఛేంజర్ థర్డ్ సాంగ్ రానుంది
రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్.ఇప్పటివరకు ఈసినిమానుండి రెండు పాటలు రిలీజ్ కాగా రెండు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక మూడో పాట కూడా రానుంది.ఇది మెలోడీ సాంగ్ గా రానుంది.రామ్ చరణ్ ,కియారా అద్వానీ లపై ఇంతకువరకు ఎన్నడూ చూడని లొకేషన్ లలో ఈ సాంగ్ ను చిత్రీకరించారట.ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టారని సమాచారం.తమన్ కంపోజింగ్ కూడా పూర్తి చేశాడు.వచ్చే వారంలో ఈ పాట రిలీజ్ కానుంది.

సంక్రాంతికి వస్తున్నాం.. రిలీజ్ డేట్ ఫిక్స్
విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'సంక్రాతికి వస్తున్నాం'. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణ సారథ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇప్పటికే 90% షూటింగ్ పార్ట్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ చివరిదశలో ఉంది.

జీబ్రా స్నీక్ పీక్ చూశారా?
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ 'జీబ్రా'. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక ఇటీవలే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయగా ఆకట్టుకుంది. జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి స్నీక్ పీక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

మహారాజ.. చైనాలో భారీ రిలీజ్
కోలీవుడ్ విలక్షణ నటుడు, 'మక్కళ్ సెల్వన్' విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మహారాజ'. సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. జూన్ 14న విడుదలైన మహారాజ తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. తమిళనాడులో రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టి విజయ్ సేతుపతి కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది.

ఇకపై రివ్యూస్ బ్యాన్
దేశవ్యాప్తంగా అన్ని సినిమా పరిశ్రమలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో పైరసీ ఒకటి. కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవహారం భాషలతో సంబంధం లేకుండా అన్ని చిత్రాలను దెబ్బకొడుతోంది. అయితే ఇటీవలికాలంలో అంతకుమించి తలనొప్పిగా మారిన మరో వ్యవహారం సినిమా రివ్యూలు. దీనిపై నిర్మాతలు పలు సందర్భాలలో అసహనం, ఆక్రోశం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముఫాసా: ది లయన్ కింగ్ వచ్చేస్తోంది.. మహేష్ బాబు స్పెషల్ ట్వీట్
డిస్నీ స్టూడియోస్ నుండి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ విజువల్ స్టన్నింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ముఫాసా: ది లయన్ కింగ్'. గతంలో వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ది లయన్ కింగ్’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తోంది. కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రధానపాత్ర అయిన ముఫాసాకు ఆయన డబ్బింగ్ చెప్పారు. గత కొన్ని రోజుల క్రితం రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

RAPO22లో హీరోయిన్ ఫిక్స్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇటీవలే 'డబుల్ ఇస్మార్ట్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఇది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఓపెనింగ్స్‌ను అయితే రాబట్టుకుంది కానీ ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద సత్తా చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సిద్దమవుతున్నాడు.

విడిపోతున్న ఏఆర్ రెహమాన్-సైరా దంపతులు
ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్-సైరా బాను దంపతులు విడిపోతున్నట్టు ప్రకటించారు. పెళ్లయిన సుమారు 30 ఏళ్లకు వీరు విడిపోతుండటం గమనార్హం. తాము విడిపోతున్నట్లు తాజాగా ఈ జంట ఓ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈమేరకు రెహమాన్, సైరా బాను పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు వారి లాయర్ వందనా షా అధికారిక ప్రకటన విడుదల చేశారు.

మెకానిక్ రాకీ అన్ ప్రిడిక్టబుల్ - విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా మెకానిక్ రాకీ.డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేయగా మీనాక్షి చౌదరి,శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా రామ్ తాళ్లూరి నిర్మించారు.ఈనెల 22 న విడుదలకానుంది.ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

రామ్ పోతినేని 22 లాంచ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో రామ్ పోతినేని రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ తో వచ్చి హిట్ కొట్టలేకపోయాడు.తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా తెరకెక్కింది డబుల్ ఇస్మార్ట్. దాంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా ఓపెనింగ్స్ ను అయితే రాబట్టుకుంది కానీ ఆతరువాత నిలువలేకపోయింది.ఇక ఈసినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న రామ్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ కి రెడీ అవుతున్నాడు.

జపాన్ లో విశ్వంభర
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ తుది దశకు చేరుకుంది.ప్రస్తుతం జపాన్ లో షూటింగ్ జరుపుకుంటుంది.అక్కడ చిరు, త్రిష లపై డ్యూయెట్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.మరో రెండు రోజుల్లో ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ కానుంది.దాంతో షూటింగ్ దాదాపు పూర్తయినట్లే.ఆ తరువాత విఎఫ్ఎక్స్ కు ఎక్కువ సమయం కేటాయించనున్నారు.ఇక ఈసినిమా రిలీజ్ కూడా వాయిదాపడింది.ముందు ఈసినిమాను జనవరి 10న విడుదలచేయాలనుకున్నారు కానీ అదే రోజు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వస్తుండడంతో విశ్వంభర వెనక్కి వెళ్ళిపోయింది.అన్ని కుదిరితే సమ్మర్ బరిలో నిలువనుంది.

బచ్చల మల్లి రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు ఆయన రూట్ మార్చారు. గత కొంతకాలంగా వైవిధ్యభరిత సినిమాలు చేస్తున్నారు. ఒకే జోనర్‌కు పరిమితమవ్వకుండా డిఫరెంట్ జోనర్స్లో చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన 'నాంది, ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాలు ఇందుకు ఉదాహరణ. వీటిలో నరేష్ చాలా సీరియస్ టైప్ పాత్రలలో నటించి మెప్పించారు.

ఒకే ఫ్రేమ్‌లో బన్నీ, సుక్కూ, డీఎస్పీ.. పిక్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన 'పుష్ప: ది రైజ్' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

శివ కార్తికేయన్ రేర్ ఫీట్
తమిళ హీరో శివ కార్తికేయన్ రేర్ ఫీట్ సాధించాడు.అమరన్ తో 300కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా రజినీకాంత్ ,విజయ్ తరువాత ఈ ఫీట్ సాధించిన మూడో తమిళ హీరోగా రికార్డు సృష్టించాడు.దీపావళికి వచ్చిన అమరన్ సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుంటూ నిన్నటి తో 300కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.మూడో వారం లోకి ఎంట్రీ ఇచ్చినా ఊహించని రన్ తో సాలిడ్ వసూళ్లను దక్కించుకుంటుంది.కంగువా పోటీని కూడా తట్టుకొని జోరు చూపిస్తుంది.బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను మొదటి వారంలోనే క్రాస్ చేయడం తో బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొస్తుంది.ఒక్క తమిళనాడు లోనే 100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.