దేశవ్యాప్తంగా అన్ని సినిమా పరిశ్రమలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో పైరసీ ఒకటి. కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవహారం భాషలతో సంబంధం లేకుండా అన్ని చిత్రాలను దెబ్బకొడుతోంది. అయితే ఇటీవలికాలంలో అంతకుమించి తలనొప్పిగా మారిన మరో వ్యవహారం సినిమా రివ్యూలు. దీనిపై నిర్మాతలు పలు సందర్భాలలో అసహనం, ఆక్రోశం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈమధ్య కొత్త చిత్రం ఏది విడుదలైనా అది ప్రదర్శించబడే థియేటర్ల ముందు అనేకమంది యూట్యూబ్ ఛానళ్లు, కొందరు నెటిజన్లు రివ్యూలు ఇవ్వడం ఎక్కువైపోయిన విషయం తెలిసిందే. వీరు చేసే ఈ హడావుడి రివ్యూలు సినిమా ఫలితంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని నిర్మాతలు మండిపడుతున్నారు. కాగా ఈ రివ్యూలు ఇటీవల విడుదలైన చాలా సినిమాలపై ప్రభావం చూపించాయి.
ఈ నేపథ్యంలో తాజాగా కోలీవుడ్ పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమా థియేటర్ల పరిసరాల్లోకి ఇలా రివ్యూలు చేసేవారిని, మీడియా చానళ్లను అనుమతించకుండా కట్టడి చేయాలని కోరింది. ఈ మేరకు తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (TFAPA) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లకు సూచన చేసింది.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో TFAPA ఇలా తెలిపింది.. “సినిమా సమీక్ష పేరుతో వ్యక్తిగత దాడులు, విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని ఖండిస్తున్నాం. ఈ సమస్యను నివారించేందుకు అన్ని సంఘాలు కలిసి రావాలి. థియేటర్ యజమానులు యూట్యూబ్ ఛానెళ్లను థియేటర్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదు. ఫస్ట్ డే.. ఫస్ట్ షో సమయంలో పబ్లిక్ రివ్యూలను అనుమతించవద్దు. రివ్యూల పేరుతో నటీనటులు, దర్శకనిర్మాతలపై వ్యక్తిగత విమర్శలను ఖండిస్తున్నాం. ఇకపై ఇలాంటివి చేస్తే ఒప్పుకునేది లేదు” అని పేర్కొంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: