విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి ‘సంక్రాంతికి వస్తున్నాయ్’ కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ట్రైయాంగిల్ స్టొరీ సంక్రాంతికి వస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో వెంకటేష్ లుంగీ, నల్ల చొక్కా ధరించి అద్భుతమైన మాస్ లుక్‌లో కనిపించారు. రగ్గడ్ గడ్డంతో, తుపాకీని పట్టుకుని స్ట్రాంగ్ ప్రజెన్స్‌తో ఆకట్టుకున్నారు.
ఇక రిలీజ్ డేట్ ప్రెస్ మీట్‌లో హీరో వెంకటేష్ నందమూరి బాలకృష్ణ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు కూడా సూపర్ హిత వ్వాలని ఆకాంక్షించారు. వెంకీ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “సంక్రాంతికి వస్తున్నాం.. టైటిల్ అదే. నిజంగానే సంక్రాంతి వస్తున్నాం.(నవ్వుతూ) ఈ సినిమాని మొదలు పెట్టినప్పుడే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. సంక్రాంతికి ఒక మంచి ఎంటర్‌టైనర్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాని అద్భుతంగా ఫినిష్ చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేక్షకులకి, ఫ్యాన్స్‌కి, ఫ్యామిలీస్‌కి అందరికీ ఈ సినిమా నచ్చుతుంది.”
“రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలయ్య ‘డాకు మహారాజ్’, మా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలన్నీ అద్భుతంగా ఆడాలి. అన్ని సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బావుంటుంది. అనిల్ తో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ కథని చాలా బాగా రాశారు. అద్భుతంగా తీశారు. సినిమా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది నా కెరీర్‌లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమాల్లో పని చేసిన యాక్టర్స్, టెక్నిషయన్స్ అందరికీ థాంక్స్. ఈ సినిమా సంక్రాంతికి వండర్‌ఫుల్ ఫిల్మ్ కాబోతుంది. డెఫినెట్‌గా సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు” అని తెలిపారు హీరో వెంకటేష్.
ఇక ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ వైఫ్ గా కనిపించనుంది. అలాగే ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: