కోలీవుడ్ విలక్షణ నటుడు, ‘మక్కళ్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మహారాజ’. సేతుపతి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. జూన్ 14న విడుదలైన మహారాజ తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. తమిళనాడులో రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టి విజయ్ సేతుపతి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రాన్ని చూసిన కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ హీరో దళపతి విజయ్ చిత్ర దర్శకుడు నిథిలన్ స్వామినాథన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ మూవీని మెచ్చుకున్నారు. ఇక జులై 12న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా తన హవా చూపిస్తూ రికార్డు వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
త్వరలో మహారాజ చైనాలో విడుదల కాబోతోంది. నవంబర్ 29న చైనాలో భారీ స్థాయిలో విడుదలవుతున్న మహారాజ చైనీస్ భాషలో సందడి చేయనుంది. అయితే అక్కడ ఏకంగా చైనా వ్యాప్తంగా 40 వేలకుపైగా స్క్రీన్స్‌లలో గ్రాండ్‌గా విడుదలవుతుండటం విశేషం. కాగా చైనా ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ Yi Shi Films అలీబాబా పిక్చర్స్ భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున విడుదలవుతోన్న ఈ సినిమాపై అక్కడ కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























